News
News
X

Horoscope Today 19th March 2023: ఈ రాశి వారు ఈరోజు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే అదృష్టం కలిసివస్తుంది

Rasi Phalalu Today 19th March 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

మేష రాశి 
ఈరోజు మీకు కులాసాగా, సరదాగా జరుగుతుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడి ఈరోజు మంచి ఫలితాలను అందిస్తుంది. మీ గురించి మీ భార్యా లేదా భర్త చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పనులను పూర్తి చేయని కారణంగా ఆఫీసులో ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది.

వృషభ రాశి 
సౌమ్యంగా ఉండే ప్రవర్తన అందరి మెప్పు పొందేలా చేస్తుంది. ఈరోజు ఎవరైనా బంధువులను కలవడానికి వెళ్లే అవకాశం ఉంది. మీ మనసులో ఉన్న కొన్ని విషయాలు మీకు ఆందోళన గురిచేస్తాయి. కాబట్టి అనుభవం ఉన్న ఎవరినైనా సంప్రదించి మీ సమస్యలను చెప్పుకోవడం మంచిది.

మిధున రాశి 
కుటుంబంతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటిని మీ మనసుకు తీసుకోకపోవడం మంచిది. రియల్ ఎస్టేట్లో ఈరోజు పెట్టుబడి పెడితే మంచిది. ఇంటి నుండి బయటకు వెళ్లే ముందే ముఖ్యమైన కాగితాలు, వస్తువులు ఉన్నాయో లేవో సరి చూసుకోండి.

కర్కాటక రాశి
ఎవరితోనైనా గొడవయ్యే అవకాశం ఉంది. అది నీ మూడ్ ని పాడు చేస్తుంది. కాబట్టి గొడవ కాకుండా తెలివిగా తప్పించుకోండి. ఒక శుభవార్త అందే అవకాశం ఉంది. అది మీ కుటుంబాన్ని ఆనందపరుస్తుంది. మీకు ఒక ప్రియమైన వ్యక్తి వలన మానసిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంది.

సింహరాశి 
ఈరోజు శ్రమతో నిండి ఉంటుంది. కానీ ఆరోగ్యం మాత్రం బాగానే ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు చేతికి అందే రోజు. ఈరోజు సమాజసేవ వైపు మీ మనసు మళ్లుతుంది.

కన్యా రాశి 
మీకు మనసు ప్రశాంతంగా ఏ పనుల్లో అయితే ఉంటుందో ఆ పనులనే ఈరోజు చేయండి. మీకు తెలియనివ్యక్తి ద్వారా ధన లాభం కలిగే అవకాశం ఉంది. దీని వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మిమ్మల్ని సంతోష పెట్టేందుకు ఈరోజు మీ జీవిత భాగస్వామి అన్ని ప్రయత్నాలూ చేస్తారు.

వృశ్చిక రాశి 
మిమ్మల్ని అప్‌సెట్ చేయాలని చూసే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి కోపం వచ్చినా నియంత్రణలో ఉంచుకోండి. అనవసర ఆందోళనలు, బెంగ రాకుండా చూసుకోండి. ఇవన్నీ మీ శరీరంపై డిప్రెషన్, ఒత్తిడి వంటివి కలిగేలా చేస్తుంది. అలాగే చర్మ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎప్పటినుంచో మీరు చేస్తున్న పొదుపు ఈ రోజు మిమ్మల్ని కాపాడుతుంది.

ధనూ రాశి 
ఈరోజు ఒక సంతోషకరమైన వార్త అందవచ్చు. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి బాధిస్తూ ఉంటే ఈరోజు హాస్పిటల్‌కి వెళ్లి ధనం ఖర్చు చేయవలసిన అవసరం పడుతుంది. ఈరోజు ప్రయాణాలకు అంత మంచిది కాదు.

మకర రాశి 
మీకున్న తగువులమారి బుద్ధిని వదులుకుంటే మంచిది. అదే మీ ప్రధాన శత్రువు. గొడవ పెట్టుకున్నాక పశ్చాత్తాపంతో కుమిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి గొడవ కాకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవాలి.

కుంభరాశి 
మీకు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి. దూకుడు స్వభావాన్ని తగ్గించుకుంటే మంచిది. వాడి వేడి వాదనలు అయ్యే అవకాశం ఉంది కానీ అవన్నీ సాయంత్రానికి సర్దుకుంటాయి. మీ మీద మీరు నియంత్రణ కోల్పోయి కుటుంబ సభ్యులతో దురుసుగా మాట్లాడే అవకాశం ఉంది.

మీన రాశి
ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. మీరు ఎంతో కాలంగా చెల్లించకుండా మిగిలిపోయిన బకాయిలు, బిల్లులు ఈరోజు చెల్లించే అవకాశం ఉంది. పగలు, ప్రతీకారం వదిలేసి ప్రశాంతమైన మనసుతో జీవించడం ముఖ్యం. ప్రయాణం చేయాలన్న ప్లాన్లు ఏమైనా ఉంటే అవి వాయిదా పడే ఛాన్సులు ఉన్నాయి. 

Published at : 19 Mar 2023 06:38 AM (IST) Tags: rasi phalalu Horoscope Today Today Rasiphalalu astrological prediction today Horoscope for March 19th 19th March Horoscope 19th March Astrology మార్చి 19 రాశిఫలాలు

సంబంధిత కథనాలు

Sri Rama Navami 2023: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!

Sri Rama Navami 2023: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!

Sri Rama Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి, నిత్యం చదువుకుంటే ఇంకా మంచిది

Sri Rama Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి, నిత్యం చదువుకుంటే ఇంకా మంచిది

Astrology News: మీ రాశి ప్రకారం వివాహానికి, శుభకార్యాలకు మీకు కలిసొచ్చే తేదీలు, రంగులు

Astrology News: మీ రాశి ప్రకారం వివాహానికి, శుభకార్యాలకు మీకు కలిసొచ్చే తేదీలు, రంగులు

మార్చి 28 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారి ఆదాయం, ఆనందం పెరుగుతుంది

మార్చి 28 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారి ఆదాయం, ఆనందం పెరుగుతుంది

మార్చి 27 రాశిఫలాలు, ఈ రాశివారు తమని తాము నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయం

మార్చి 27 రాశిఫలాలు, ఈ రాశివారు తమని తాము నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయం

టాప్ స్టోరీస్

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Group 1 Mains Postponed :  ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?