Horoscope Today 18th October 2023: ఈ రాశులవారిపై మహాలక్ష్మి కటాక్షం, అక్టోబరు 18 రాశిఫలాలు
Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today October 18th, 2023
మేష రాశి
ఈ రాశివారికి ఈ రోజు ఉద్యోగంలో కొన్ని కారణాల వల్ల సమస్యలు తలెత్తవచ్చు, మీ మనస్సు కూడా కలత చెందే అవకాశం ఉంది. కాస్త ఓపికగా వ్యవహరించండి. కుటుంబంలో, కార్యాలయంలో మీకు పెద్దల మద్దతు లభిస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించి సమాచారం వింటారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయమే.
వృషభ రాశి
మీరు ఏదో విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. మీ మనస్సులో తప్పుడు భావన రానివ్వవద్దు. ప్రతికూల ఆలోచనలకు అస్సలు చోటివ్వకండి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభాలొస్తాయి.
మిథున రాశి
ఈ రోజు మీరు డబ్బు పరంగా అదృష్టవంతులు. గత రెండు రోజులుగా ఇంటి పరిస్థితులో కొంత మార్పు వస్తుంది. ఆర్థికంగా అంతా సాఫీగా సాగుతుంది. మీరు ఈ వారంలో కొన్ని చిన్నపాటి బాధ్యతలను నెరవేర్చగలుగుతారు.
Also Read: దసరాల్లో బాలలకు పూజ ఎందుకు చేస్తారు - దానివెనుకున్న ఆంతర్యం ఏంటి!
కర్కాటక రాశి
ఈ రోజు కొంత ఇబ్బందిగా ఉంటారు. కొన్నిసార్లు మిమ్మల్ని నిరాశ ఆవహిస్తుంది. అయితే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉన్నతాధికారుల నుంచి అవసరమైన సహాయం పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
సింహ రాశి
మీకు ఏదైనా కొత్త బాధ్యత లేదా ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినట్లయితే దానివల్ల మీకు మంచి జరుగుతుంది. కష్టపడి పనిచేసినప్పుడే అందుకు తగిన ఫలితం పొందుతారు. ఇది మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపిస్తుంది. తెలివిగా ఆలోచించండి. నూతన పెట్టుబడులకు ఇదే సరైన సమయం. విద్యార్థులు ఉన్నత చదువుపై దృష్టి సారించాలి.
కన్యా రాశి
ఏదైనా పని పూర్తవకపోతే నిగ్రహాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు..కొంత టైమ్ పట్టినా కానీ పని జరుగుతుంది. మీ పని జరుగుతుంది ఆ విషయంపై చింతించాల్సిన అవసరం లేదు. వ్యాపారం బాగా సాగుతుంది కానీ భారీ లాభాలు వస్తాయని ఆశించవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి
Also Read : శరన్నవరాత్రుల్లో ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం!
తులా రాశి
ఈ రోజు మీరు ప్రతి పనిని పూర్తి ఆత్మవిశ్వాసంతో చేస్తారు కానీ ఏదో విషయంలో బాధపడతారు. స్నేహితుల నుంచి అవసరం అయిన సమయంలో సహాయం లభిస్తుంది. సమయానికి డబ్బు చేతికందుతుంది
ధనుస్సు రాశి
ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి సమయం. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. కుటుంబానికి సమయం కేటాయించాలి. అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు.
మకర రాశి
మీ ఆలోచనల్లో కొన్నింటిని మార్పు చేసుకోవాల్సిన అవరసం ఉంది. కార్యాలయంలో, వ్యక్తిగత జీవితంలోనూ తీరు మార్చుకోవాలి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలొస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి.
కుంభ రాశి
ఈ రాశివారి ఆలోచనలకు ఈ రోజు అంతం ఉండదు.మీ ఆరోగ్యం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగులు తమ బాధ్యతల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. వ్యాపారం బాగానే సాగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
మీన రాశి
ఈ రోజు ఈ రాశివారు అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. స్నేహితుల కారణంగా బాధపడతారు. అనవసర కోపానికి దూరంగా ఉండాలి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం. ఆరోగ్యం బావుంటుంది.