మే 14 రాశిఫలాలు, ఈ రాశులవారు తొందరపాటు తగ్గించుకోవాలి
Rasi Phalalu Today 14th May: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మే 14 రాశిఫలాలు
మేష రాశి
మీ మనస్సును నియంత్రించుకోండి. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి బహుమతి కొనిస్తారు. ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. తొందరపాటు వల్ల ధన నష్టం జరగవచ్చు. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. ఉద్యోగంలో ప్రశాంతత ఉంటుంది. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. ఆనందం ఉంటుంది.
వృషభ రాశి
స్థిరాస్తి కొనుగోలు ద్వారా అధిక లాభం పొందుతారు. ఎవరితోనైనా శత్రుత్వం ఉంటుంది..మాట తూలొద్దు. సమయానికి భాగస్వాముల సహకారం లభించడంతో సంతోషిస్తారు. ఉద్యోగంలో కిందిస్థాయి అధికారుల సహకారం ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. పాత రోగాల బారినపడే ప్రమాదం ఉంది జాగ్రత్త. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు.
మిథున రాశి
స్నేహితులతో మంచి సమయం గడుపుతార. మంచి భోజనాన్ని ఆస్వాదిస్తారు. మోధోపరమైన పనిలో విజయం సాధిస్తారు. జ్ఞానోదయం పొందిన వ్యక్తి నుంచి మార్గదర్శకత్వం పొందుతారు. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. మా మాటలను నియంత్రించాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆదాయం లేకపోవడంతో ఆందోళన చెందుతారు. ఎక్కువ పనిభారం ఉంటుంది. ఎలాంటి కారణం లేకుండా అనవసర వాదనలు ఉండొచ్చు. సంతాప వార్త అందుకున్న తర్వాత భావోద్వేగానికి లోనవుతారు. స్నేహితుడి ప్రవర్తన వల్ల ప్రతికూలత పెరుగుతుంది. వ్యాపారంలో సంతృప్తి ఉండదు. కుటుంబంలో విభేదాలు ఉండవచ్చు. ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించవద్దు.
సింహ రాశి
పురోగతి కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. కొన్ని పెద్ద సమస్యలు పరిష్కారమవుతాయి. మిత్రుల నుంచి సహకారం అందుతుంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారం బాగా సాగుతుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. మీ అభీష్టం మేరకు వ్యాపారం సాగుతుంది. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. పెట్టుబడి శుభప్రదంగా ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు.
కన్యా రాశి
కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో సహోద్యోగులు మీకు సహకరిస్తారు. వ్యాపారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు నివారించండి. లాభదాయకమైన అవకాశాలు చేతికి అందుతాయి. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
తులా రాశి
కోపాన్ని అదుపులో పెట్టుకోండి. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపార యాత్ర విజయవంతమవుతుంది. ఊహించని లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. వ్యాపారం విషయంలో ఒత్తిడి తగ్గుతుంది. ఇంటా బయటా మీ బాధ్యత పెరుగుతుంది. జూదం, బెట్టింగ్‌లు, లాటరీల ఉచ్చులో చిక్కుకోవద్దు. పెట్టుబడి శుభప్రదంగా ఉంటుంది. సోమరితనం వీడండి. అడగకుండా ఎవ్వరికీ సలహాలు ఇవ్వకండి.
వృశ్చిక రాశి
అనుకోని ఖర్చులు పెరుగుతాయి. సమయానికి డబ్బులు అందుబాటులో ఉండకపోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి.ఉద్యోగంలో బావుంటంది. భాగస్వాములతో విభేదాలు రావొచ్చు. అలసటగా అనిపిస్తుంది. అవసరమైన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆందోళన పెరుగుతుంది. కొత్త పనులేవీ ప్రారంభించకపోవడమే మంచిది.
ధనుస్సు రాశి
ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ మోసం చేయవద్దు. ఎవరికీ సలహా ఇవ్వకండి. ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తారు. పాత మిత్రులను కలుస్తారు. డబ్బు సంపాదిస్తారు. రిస్క్ తీసుకునే ధైర్యం ఉంటుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి కాగలవు.
మకర రాశి
విద్యార్థులు విజయం సాధిస్తారు. పనితీరులో మెరుగుదల ఉంటుంది. సామాజిక సేవ చేయాలనే కోరిక మేల్కొంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతోష సాధనాలు సమకూరుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆదాయ వనరులు పెరగవచ్చు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పెట్టుబడి శుభప్రదంగా ఉంటుంది. సంతోషం పెరుగుతుంది.
కుంభ రాశి
మతపరమైన పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కోర్టు పనులు పూర్తవుతాయి. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. లాభదాయకమైన అవకాశాలు మీకు వస్తాయి. సన్నిహితుల మద్దతు లభిస్తుంది. సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషం పెరుగుతుంది.
మీన రాశి
పాతవ్యాధులు తిరగబెట్టే అవకాశం ఉంది. స్నేహితుని వల్ల పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. వాహనాలు, యంత్రాల వినియోగంలో నిర్లక్ష్యం వద్దు. తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. సామాజిక బాధ్యతలు నెరవేరుస్తారు. వ్యాపారం బాగా సాగుతుంది. స్నేహితులు, బంధువుల నుంచి సహాయం చేస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.