అన్వేషించండి

Horoscope 08th February 2024: పనిలో మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే టైమ్ ఇది, ఫిబ్రవరి 08 రాశిఫలాలు

Horoscope 8th February 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 8th February 2024  - ఫిబ్రవరి 8 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

మీ కెరీర్‌లో విజయం సాధించాలంటే రాబోయే కష్టానికి భయపడకుండా పరిష్కరించుకోండి. మహిళలు కుటుంబ సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. వైవాహిక జీవితంలో కొంత ఇబ్బంది ఉంటుంది. కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయం బాగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. ఆరోగ్యం బావుంటుంది.

వృషభ రాశి (Taurus  Horoscope Today)

ఈ రోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తోబుట్టువులతో ఆర్థిక వివాదాలన్నింటినీ పరిష్కరించుకుంటారు. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. కార్యాలయంలో ఎదురైన సమస్యలని పరిష్కరించుకుంటారు. బయట ఆహారానికి దూరంగాం ఉండడం మంచిది.

మిథున రాశి (Gemini Horoscope Today) 

ఈ రోజు ఈ రాశికి చెందిన వారు తమను తాము నియంత్రించుకోవాలి. తెగిపోయే దశలో ఉన్న కొన్ని బంధాలు మళ్లీ దగ్గరవుతాయి. క్లిష్టమైన విషయాలను జాగ్రత్తగా నిర్వహించండి. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లాలనుకునే వారికి శుభవార్తలు అందుతాయి. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి, ప్రతి పనిని కష్టపడి పూర్తి చేయండి. తీసుకున్న రుణాన్ని కూడా తిరిగి చెల్లిస్తారు

Also Read: ఫిబ్రవరి 9 మౌని అమావాస్య, ఈ రోజు ఇవి పాటించడం మర్చిపోవద్దు!

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

ఈ రోజు డబ్బును తెలివిగా ఖర్చు చేయండి. కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి..వాటిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారు. నూతన పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఈ రోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనవసరమైన ఒత్తిడిని తీసుకోవద్దు. సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి.

సింహ రాశి (Leo Horoscope Today)

ఈ రోజు మీరు కార్యాలయ రాజకీయాలతో ఇబ్బంది పడతారు, కొన్ని కష్టమైన పనుల భారం మీ భుజాలపై పడుతుంది. మీ భాగస్వామిని గుడ్డిగా నమ్మవద్దు. ఆర్థిక లావాదేవీలన్నీ ఈరోజు సజావుగా సాగుతాయి. ఆర్థిక ప్రణాళికకు కట్టుబడి ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. 

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

రోజంతా సంతోషంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆర్థిక పరంగా మంచి రోజు. పెట్టుబడులు తెలివిగా పెట్టండి. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవచ్చు. ఒంటరి వ్యక్తులు తోడు వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు.ఖర్చు చేసేటప్పుడు మరోసారి ఆలోచించండి. 

Also Read: భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఆచరించకూడని విధులివే!

తులా రాశి (Libra Horoscope Today) 

ఈ రోజు వ్యాపార సమస్యలను పరిష్కరించడంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులకు ఓవర్ టైం పని చేయాల్సి రావచ్చు. వివాహితులు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి. మీ ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక ప్రణాళికకు కట్టుబడి ఉండండి. సానుకూల శక్తి మీలో నిండి ఉంటుంది.
 
వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

ఈ రోజు మూడో వ్యక్తి ఇచ్చే సలహాలను జాగ్రత్తగా తీసుకోండి. వ్యక్తిగత జీవితంలో అహానికి చోటు ఇవ్వొద్దు. కొందరికి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ప్రభుత్వ అధికారులు స్థల మార్పును ఆశించవచ్చు. ఈరోజు మీ భాగస్వామి మనోభావాలను దెబ్బతీయకండి. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటారు

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

ఈ రోజు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.  వ్యాపారంలో విజయం సాధిస్తారు. విదేశీ కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఉపయోగించండి. కోపం ప్రదర్శిస్తే నష్టపోయేది మీరే. ప్రభావవంతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు కొత్త విజయాలను పొందుతారు. 

Also Read: ప్రేమికుల దినోత్సవం రోజే వసంతపంచమి, ఆ రోజుకున్న విశిష్టత ఇదే!

మకర రాశి (Capricorn Horoscope Today) 

ఈ రోజు డబ్బుకు లోటు ఉండదు. కొంతమంది విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కుటుంబం నుంచి అవసరమైన సమయంలో ఆర్థిక సహాయం పొందుతారు. ఇంటర్వ్యూకు వెళ్లే వారు ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టాలి. సానుకూల వాతావరణంలో ఉండటం ద్వారా ఒత్తిడి సంబంధిత సమస్యలు తగ్గుతాయి. పెట్టుబడుల ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

మిమ్మల్ని మీరు అద్భుతంగా మార్చుకోండి. సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ఈరోజు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండండి. బస్సు లేదా రైలులో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.  పాత వివాదాలను స్నేహితులతో చర్చించుకోండి. సమస్యలను పరిష్కరించేటప్పుడు వ్యక్తిగత దూషణలను ఉపయోగించవద్దు. ఆర్థికంగా మీరు బాగానే ఉంటారు. పాత పెట్టుబడి నుంచి డబ్బు పొందవచ్చు. 

మీన రాశి (Pisces Horoscope Today) 

కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. వైవాహిక జీవితంలో కలహాలు కలిగించే దేనిలోనూ జోక్యం చేసుకోకండి. నిజాయితీ ప్రయత్నాలకు ప్రశంసలు అందుతాయి. డబ్బు విషయంలో ఎవరి మీదా ఆధారపడొద్దు. రాత్రిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే

గమనిక:  ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.  

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
Kodangal Narayanapet Lift Irrigation Scheme: కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Renu Desai : పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
Kodangal Narayanapet Lift Irrigation Scheme: కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Renu Desai : పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
వన్డేల్లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు ఎలా ఉందో చూశారా.. కలిసొచ్చిన మూడో స్థానం
వన్డేల్లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు ఎలా ఉందో చూశారా.. కలిసొచ్చిన మూడో స్థానం
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
Embed widget