అన్వేషించండి

Horoscope Today: ఈ 4 రాశులవారికి ఆదాయం పెరుగుతుంది, 12 రాశులవారి రాశిఫలాలు

దిన ఫలాలు నవంబర్ 03, 2023: మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today 03rd november 2023 (దిన ఫలాలు నవంబర్ 03, 2023)

మేష రాశి
ఈ రోజు మీరు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. దూరప్రాంత ప్రయాణం ప్లాన్ చేసుకుంటే జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేసే వ్యక్తులు లాభపడతారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. డబ్బు ఏర్పాటు చేయడంలో కొంత ఇబ్బంది ఉంటుంది కానీ టైమ్ కలిసొస్తుంది. మీ ప్రత్యర్థుల ఎత్తుగడలు అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి.ఒత్తిడి తగ్గుతుంది.

వృషభ రాశి
ఈ రోజు  మీకు సంతోషకరమైన రోజు. అనుకున్న పనులన్నీ ఈరోజు పూర్తవుతాయి. రాజకీయ రంగాలకు సంబంధించిన వ్యక్తుల సర్కిల్ పెరుగుతుంది.  మీరు విలువైన వస్తువును బహుమతిగా అందుకోవచ్చు. కుటుంబ కార్యకలాపాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా కుటుంబ సభ్యులు మీపై కోపంగా ఉంటారు. 

మిథున రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. పిల్లలకు విలువలు, సంప్రదాయాలను బోధిస్తారు. మీపై ఉన్న అంచనాలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. వ్యాపారంలో భాగస్వామ్యంలోకి ప్రవేశించవద్దు మీరు నమ్మకద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది.   మీ లక్ష్యాలలో ఏదైనా సాధించవచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించడం వల్ల మీరు ఒత్తిడికి లోనవుతారు.

Also Read: KCR రాజశ్యామల యాగం - ఈ యాగంతో కేసీఆర్‌కు మళ్లీ అధికారం ఖాయమా!

కర్కాటక రాశి
ఈ రోజు మీకు కొన్ని సమస్యలను తీసుకురాబోతోంది. మాట, ప్రవర్తనలో స్పష్టంగా ఉండండి. లావాదేవీల విషయంలో  అందర్నీ నమ్మేయవద్దు. విదేశాలలో వ్యాపారం చేసేవారికి లాభాలొస్తాయి. మీరు మీ ముఖ్యమైన పనులకు మంచి మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు. బడ్జెట్  ప్లాన్ చేసుకోవడం మంచిది. మీ ప్రతిష్ట పెరుగుతుంది. చట్టపరమైన విషయంలో విజయం సాధించవచ్చు. అహంకారం తగ్గించుకోవాలి.
 
సింహ రాశి
ఈ రోజు మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. పోటీ భావన మీ మనసులో నిలిచిపోతుంది. కెరీర్ విషయంలో పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి మీరు ఉపశమనం పొందుతారు. మీ సోదరులతో ఏదైనా సమస్యపై మాట్లాడవచ్చు. విద్యార్థులు ఏ పరీక్షలోనైనా విజయం సాధించడానికి అన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి.

కన్యా రాశి
ఈరోజంతా మీరు సంతోషంగా ఉంటారు. కళ , నైపుణ్యాలు మెరుగుపడతాయి. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయండి. కార్యాలయంలో అనుకున్న పనిని సమయం కన్నా ముందే పూర్తిచేస్తారు. ఈ రోజు మీకు శుభవార్త అందుతుంది. మీరు స్నేహితుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. మీరు మీ పిల్లలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండవచ్చు.

Also Read: దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీ పూజలో పాటించాల్సిన నియమాలివే!

తులా రాశి
ఈ రోజు మీకు చాలా మంచి రోజు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి..లేదంటే సమస్యలు రావచ్చు. మతపరమైన , వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ముఖ్యమైన సమచారం వింటారు.

వృశ్చిక రాశి
ఈ రోజంతా ధైర్యంగా ఉంటారు.  మీరు మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలి, లేకుంటే ఇబ్బందులు తప్పవు. ప్రమాదకర పనిలో పాల్గొనవద్దు. వ్యాపారంలో పూర్తి లాభం పొందుతారు. మీరు వ్యాపారంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం  తీసుకోవచ్చు. మీ పనిని చాలా జాగ్రత్తగా చేయడం మంచిది. కుటుంబ సభ్యుల సలహాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి

Also Read: ధన త్రయోదశి రోజు ఈ వస్తువులు కొనితెచ్చుకున్నా శుభమే - తక్కువ ఖర్చే!

ధనుస్సు రాశి
ఈ రోజు మీకు ముఖ్యమైన రోజు కానుంది. భాగస్వామ్యంతో కొన్ని పనులు చేస్తే బాగుంటుంది. మీరు మీ సహోద్యోగులను విశ్వసిస్తారు. ముఖ్యమైన పత్రాలపై నిఘా ఉంచడం ద్వారా ప్రభుత్వ పనిని కొనసాగించండి లేదంటే మీరు మోసపోవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. వ్యాపారంలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు.

మకర రాశి
ఈ రోజు మీకు అంతగా కలసిరాదు.మీరు ఎవరినీ తప్పుదారి పట్టించకూడదు దానివల్ల మీకే సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఏదైనా వ్యాపార సంబంధిత విషయం మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతూ ఉంటే, మీరు దాన్ని పరిష్కరించగలరు. ఉద్యోగాలలో పని చేసే వ్యక్తులు కొంత పురోగతి గురించి వార్తలు వినవచ్చు. మీరు మీ లావాదేవీ విషయాలపై పూర్తి దృష్టిని కొనసాగించాలి, లేకుంటే సమస్యలు ఉంటాయి.

కుంభ రాశి
ఈ రోజు మీకు ముఖ్యమైన రోజు కానుంది. అవసరమైన సమాచారం అందుతుంది. కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు. మీరు మెరుగ్గా పని చేస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పని ఈ రోజు ఊపందుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వ్యక్తులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఏదైనా పథకంలో చాలా ఆలోచనాత్మకంగా పెట్టుబడి పెట్టాలి.

Also Read: యుగయుగాలుగా లక్ష్మీ ఆరాధన -ఇంతకీ దీపావళి రోజే లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి!

మీన రాశి
ఈ రోజు మీకు సౌకర్యాలు పెరుగుతాయి. నూతన నిర్ణయాలు తీసుకునేందుకు తొందరపడకండి లేదంటే కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. బాధ్యతాయుతమైన పనిని పొందుతారు. వాహనం కొనాలనే మీ కల కూడా నెరవేరుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కావచ్చు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
Life And Death Story: చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KL Rahul Controversial Out in Perth | ఆడక ఆడక ఆడితే నీకే ఏంటిది రాహుల్..? | ABP DesamAus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
Life And Death Story: చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sidhu True Husband: మగ సావిత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ - దాదాపుగా చనిపోయిన భార్యను బతికించుకున్న వైనం తెలిస్తే మీరే ఒప్పుకుంటారు !
మగ సావిత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ - దాదాపుగా చనిపోయిన భార్యను బతికించుకున్న వైనం తెలిస్తే మీరే ఒప్పుకుంటారు !
Samantha: మగాళ్లు నిందించినప్పుడు తలెత్తుకుని నిలబడు... సమంత పోస్ట్ చేసిన కవిత రాసింది ఎవరో తెలుసా? 
మగాళ్లు నిందించినప్పుడు తలెత్తుకుని నిలబడు... సమంత పోస్ట్ చేసిన కవిత రాసింది ఎవరో తెలుసా? 
Embed widget