అన్వేషించండి

Today Horoscope In Telugu: మార్చి 30 రాశి ఫలాలు - ఈ రాశి వారికి ఈరోజు అకస్మిక ధనప్రాప్తి!

Horoscope Prediction 30th March 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for March 30th 2024:

మేష రాశి

ఈరోజు ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి. సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు మీ జీవితంలో ఆశ్యర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్థి కొనుగోలు ప్రయత్నాలు సక్సెస్‌ అవుతాయి.

వృషభ రాశి

ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన పనులు స్లోగా జరుగుతాయి. వాహనాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారులకు, ఉద్యోగస్తులకు ఈరోజు అచ్చిరాదు. అధిక కష్టంతో తక్కువ ఫలితాన్ని పొందుతారు.

మిథున రాశి

ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపారస్తులు జాగ్రత్తగా ముందడుగు వేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత పురోగతి ఉంటుంది. కానీ ఉద్యోగస్తులకు వృత్తిలో కొంత గందరగోళం ఉంటుంది. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఏర్పడతాయి.

కర్కాటక రాశి

ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపార, వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. నూతన పరిచయాల వల్ల మంచి జరుగుతుంది.

సింహ రాశి

ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తీరిపోతాయి. ప్రముఖులతో ఉన్న పరిచయాలను మరింత పటిష్టపరుచుకుంటారు. ఆర్థిక పరిస్థితులు శుభసూచకంగా ఉంటాయి.

కన్య రాశి

ఈ రాశి వారు ఇవాళ చేపట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్‌ లేదా కొత్త ఉద్యోగం లభించే అవకావం ఉంది. రుణాలు తీరుస్తారు. కుటుంబంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే కలిసి వస్తాయి.

తులా రాశి

ఈ రాశి వారికి ఇవాళ ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ద వహించాలి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు ఎక్కువ. వృత్తి ఉద్యోగాలలో గందరగోళం.

వృశ్చిక రాశి

ఈ రాశి వారు ఇవాళ దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే వాయిదా వేసుకోవడమే మంచిది. ఆర్థిక పరమైన విషయాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఎంతో శ్రమిస్తే కానీ పనులు సకాలంలో పూర్తి కావు. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అంత ఆశాజనకంగా ఉండవు.

ధనస్సు రాశి

ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. మిత్రులతో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి.

మకర రాశి

ఈరాశి వారికి ఈరోజు రుణ బాధలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విఘ్నాలు ఏర్పడటంతో నిరాశకు లోనవుతారు. వృత్తి, ఉద్యోగాలలో అధిక శ్రమ ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

కుంభ రాశి

ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ఫలితం లభిస్తుంది.

మీన రాశి

ఈరాశి వారు ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి.

Note:  ఓ రాశిలో ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

ALSO READ: అలా జరగాలంటే మనం తోపులం అయ్యుండాలి - సోహెల్‌కు ‘బిగ్ బాస్’ దివి సలహా, పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదట!

టాప్ హెడ్ లైన్స్

26-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
26-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
26-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
26-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
26-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
26-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
Gold Price September 2026: సెప్టెంబర్‌లో బంగారం ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా? కీలక అంచనా!
సెప్టెంబర్‌లో బంగారం ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా? కీలక అంచనా!

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NH 365 BB Development: తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
AE Nookaraju Grandson: సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
Polavaram Left Canal: గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
Junior Doctors Strike: సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
Pant Injury Update: పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
YS Jagan:
"స్థానిక సంస్థలన్నీ మనవే! ఏకగ్రీవాలు కానివ్వొద్దు, ఎలక్షన్స్‌ను లైట్ తీసుకొవద్దు" వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
Rules for Foreign Travel Clearances: విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
Embed widget