అన్వేషించండి

Today Horoscope In Telugu: ఏప్రిల్ 1 రాశి ఫలాలు – ఈ రాశి వారు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి

Horoscope Prediction 1st April 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి

Daily Horoscope for April 1st 2024 

మేష రాశి

ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. మొండి బాకీలు వసూలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అవసరానికి బంధు మిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. సంతానం, విద్యా, వృత్తి, ఉద్యోగాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. శుభకార్యాలకు హాజరవుతారు.

వృషభ రాశి

ఈరోజు ఈ రాశి వారికి ఇంట్లో కొన్ని ఆశ్చర్యకర సంఘటనలు జరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సొసైటీలో పేరున్న వ్యక్తులతో పరిచయాలు కలిగే అవకాశం.  

మిథున రాశి

ఈ రోజు ఈ రాశి వారికి దూర ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక పరమైన విషయాల్లో వివాదాలు నెలకొనే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు ఎదురవుతాయి. కుటుంబంలో కలతలు ఏర్పడతాయి. దైవారాధన చేస్తారు. మనసులో కలతలు పెరుగుతాయి.   

కర్కాటక రాశి

ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. చేపట్టిన పనులలో అధిక శ్రమ ఉంటుంది. కొత్త బాధ్యతలు పెరగడంతో మానసిక ప్రశాంతత ఉండదు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు నెలకొనే సూచనలున్నవి.

సింహ రాశి

ఈ రాశి వారికి ఈరోజు రావలసిన ధనం చేతికి అందుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సానుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగాల విషయంలో శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాలలో మంచి జరిగే అవకాశం ఉంది.  

కన్య రాశి

ఈ రాశి వారు ఇవాళ ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మిత్రులతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. ఆద్యాత్మిక విషయాలపై మక్కువ పెరుగుతుంది. వ్యవహారాలలో జయం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో సత్ఫలితాలు ఉన్నాయి.

తులా రాశి

ఈ రాశి వారికి ఇవాళ చేపట్టిన పనులన్నీ నిదానంగా జరుగుతాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఇంటా బయటా ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృథా ఖర్చులు ఎక్కువగా అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ఫలితం లభించదు.

వృశ్చిక రాశి

ఈ రాశి వారికి ఇవాళ ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఆస్థి వివాదాలలో రాజీ ప్రయత్నాలు విఫలం అవుతాయి. కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో ఒత్తిడి నెలకొంటుంది. ఆర్థికపరమైన నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి.

ధనస్సు రాశి

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సంతానం, విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. రుణాలు తీరుస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.

మకర రాశి

ఈరాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగాలలో ప్రతికూలత  పెరుగుతుంది. దూర ప్రయాణాలలో వాహనాల వల్ల ఇబ్బందులు పడతారు. దైవదైర్శనం చేసుకుంటారు. పాత రుణాలు తీర్చడానికి కొత్త రుణాలు చేయల్సి వస్తుంది.

కుంభ రాశి

ఈరోజు ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో విజయాలు సాధిస్తారు. చేపట్టిన పనులు, ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసి పై అధికారుల మన్ననలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మీ విలువ పెరుగుతుంది.

మీన రాశి

ఈరాశి వారు ఈరోజు ఉద్యోగ విషయాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆకస్మిక ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాలలో పనులు నిదానంగా సాగుతాయి.

Note: ఓ రాశిలో ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

ALSO READ: నల్లదారం ధరిస్తే ప్రయోజనాలేమిటీ? ఆ సమస్యలన్నీ తొలగిపోతాయా?

టాప్ హెడ్ లైన్స్

కర్కాటక రాశి వారఫలాలు అక్టోబర్ 12 to 18 : శరన్నవరాత్రి వారం ఇల్లు, పని, ఖర్చులు - ఈ వారం కీలక నిర్ణయాలు తప్పవు
కర్కాటక రాశి వారఫలాలు అక్టోబర్ 12 to 18 : శరన్నవరాత్రి వారం ఇల్లు, పని, ఖర్చులు - ఈ వారం కీలక నిర్ణయాలు తప్పవు
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం తులా, వృశ్చిక, ధనస్సు రాశిఫలాలు: ఈ రోజు మీ రాశిపై గ్రహాల ప్రభావం!
11-10-2026 ఆదివారం తులా, వృశ్చిక, ధనస్సు రాశిఫలాలు: ఈ రోజు మీ రాశిపై గ్రహాల ప్రభావం!
11-10-2026 ఆదివారం కర్కాటకం, సింహం, కన్య రాశిఫలాలు: వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యంపై మీ అదృష్టం!
11-10-2026 ఆదివారం కర్కాటకం, సింహం, కన్య రాశిఫలాలు: వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యంపై మీ అదృష్టం!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget