2025 అక్టోబర్ 21 రాశిఫలాలు - మేషం నుంచి మీనం.. ఈరోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
Daily Horoscope in Telugu: 2025 అక్టోబర్ 21న మేషం నుంచి మీనం వరకూ ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి

2025 అక్టోబర్ 21 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu 21 October 2025
మేష రాశి
ఈ రోజు మీకు కొత్త మార్పులు తెస్తుంది. సామాజిక రంగంలో చురుకుదనం పెరుగుతుంది. పనిలో సానుకూల ఫలితాలను పొందుతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు . ప్రతి పనిని శ్రద్ధగా చేస్తారు. మహిళలు తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడంపై దృష్టి పెడతారు. పాత స్నేహితులను కలుసుకుంటారు.
అదృష్ట సంఖ్య: 9
అదృష్ట రంగు: ఎరుపు
పరిహారం: హనుమంతునికి సింధూరం సమర్పించండి.
వృషభ రాశి
ఈ రోజు ఆనందంతో నిండి ఉంటుంది. విద్యార్థులకు ఉపాధ్యాయుల సహకారం లభిస్తుంది. వృత్తిలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు లభిస్తాయి. జీవిత భాగస్వామి నుంచి శుభవార్త అందుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.
అదృష్ట సంఖ్య: 6
అదృష్ట రంగు: తెలుపు
పరిహారం: లక్ష్మీదేవిని పూజించండి
మిథున రాశి
మీకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనుభవజ్ఞుడైన వ్యక్తి నుంచి సహాయం అందుతుంది. సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఉద్యోగం ,వ్యాపారంలో లాభం ఉంటుంది. అప్పులు ఇవ్వొద్దు
అదృష్ట సంఖ్య: 5
అదృష్ట రంగు: ఆకుపచ్చ
పరిహారం: తులసి మొక్కకు నీరు పోయండి, "ఓం నమో భగవతే వాసుదేవాయ" జపించండి.
కర్కాటక రాశి
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కుటుంబ సహకారం కొనసాగుతుంది. ఓపిక , సహనం కలిగి ఉండండి. సంభాషణలో పదాలను జాగ్రత్తగా వాడండి. కోపం తొందరపాటు తగ్గించుకోండి. వ్యాపారంలో కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. ఈ రోజు పెద్ద నిర్ణయాలు తీసుకోకండి.
అదృష్ట సంఖ్య: 2
అదృష్ట రంగు: తెలుపు లేదా క్రీమ్
పరిహారం: చంద్రునికి అర్ఘ్యం సమర్పించండి.
సింహ రాశి
ఈ రోజు మీకు సంతోషకరంగా ఉంటుంది. మీరు విజయవంతమయ్యే కొత్త పథకాలు వేస్తారు. సానుకూల స్వభావం మీ గౌరవాన్ని పెంచుతుంది. ఉద్యోగస్తులకు శుభవార్త అందుతుంది.ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు
అదృష్ట సంఖ్య: 1
అదృష్ట రంగు: బంగారు లేదా నారింజ
పరిహారం: సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి
కన్యా రాశి
ఈ రోజు శుభంగా ఉంటుంది. విద్యార్థుల కెరీర్‌లో కొత్త మార్పు వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా ప్రత్యేక పనిలో విజయం సాధిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
అదృష్ట సంఖ్య: 7
అదృష్ట రంగు: లేత ఆకుపచ్చ
పరిహారం: గణేశునికి దూర్వను సమర్పించండి
తులా రాశి
ఆఫీసులో బిజీగా ఉంటారు. అలసట అనిపిస్తుంది, ఆహారంపై శ్రద్ధ వహించండి. వ్యాపారంలో వేగం పెరుగుతుంది. సహోద్యోగుల సహాయంతో పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆస్తిని పొందే అవకాశాలు ఉన్నాయి.
అదృష్ట సంఖ్య: 6
అదృష్ట రంగు: గులాబీ
పరిహారం: లక్ష్మీదేవిని పూజించండి
వృశ్చిక రాశి
ఈ రోజు ఏదైనా ప్రత్యేక పనిలో లాభం ఉంటుంది. తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. సామాజిక , రాజకీయ సంబంధాలు బలపడతాయి. పని రంగంలో కొత్త బాధ్యతలు విజయవంతంగా పూర్తవుతాయి.
అదృష్ట సంఖ్య: 9
అదృష్ట రంగు: మెరూన్
పరిహారం: మంగళవారం ఎర్ర కందిపప్పు దానం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
ధనుస్సు రాశి
ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. అసాధ్యమైన పనులు పూర్తవుతాయి. అకస్మాత్తుగా ధన లాభం పొందే అవకాశాలు లభిస్తాయి. పాత సంబంధాలు మెరుగుపడతాయి. ఆఫీసులో మీ ప్రశంసలు లభిస్తాయి. మతపరమైన పనులపై ఆసక్తి పెరుగుతుంది.
అదృష్ట సంఖ్య: 3
అదృష్ట రంగు: పసుపు
పరిహారం: గురువారం పసుపు రంగు దుస్తులు ధరించండి
మకర రాశి
ఈ రోజు ఉత్సాహంతో నిండి ఉంటుంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి. నూతన వధూవరుల జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడం సాధ్యమవుతుంది. వ్యాపారంలో సానుకూల మార్పులు వస్తాయి.
అదృష్ట సంఖ్య: 8
అదృష్ట రంగు: నీలం లేదా బూడిద
పరిహారం: శనివారం నల్ల మినుములు దానం చేయండి
కుంభ రాశి
రోజు కొత్త ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. ఆఫీసులో సమన్వయం ఉంటుంది. కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి. పిల్లల విజయంతో ఆనందం లభిస్తుంది. సాయంత్రం ఒక వేడుక లేదా కార్యక్రమంలో పాల్గొంటారు.
అదృష్ట సంఖ్య: 4
అదృష్ట రంగు: నీలం
పరిహారం: శని దేవునికి ఆవాల నూనెతో దీపం వెలిగించండి
మీన రాశి
ఈ రోజు ఆనందంగా ఉంటుంది. కుటుంబ విషయాలలో కొంచెం కష్టపడాల్సి రావచ్చు. ఆఫీసులో పని నెమ్మదిగా సాగుతుంది. కుటుంబ సమస్యలను అర్థం చేసుకోండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
అదృష్ట సంఖ్య: 7
అదృష్ట రంగు: లేత నీలం
పరిహారం: గురువారం విష్ణు ఆలయంలో దీపం వెలిగించండి.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















