అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Hanuman Jayanti Horoscope : హనుమాన్ జయంతి రోజు ఈ రాశులవారికి ఆర్థిక లాభం - ఏప్రిల్ 23 రాశిఫలాలు!

Daily Horoscope For All 12 Zodiac Signs: ఏప్రిల్ 23 హనుమాన్ జయంతి మంగళవారం ఏ ఏ రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి, ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి...

Horoscope Today 23rd April 2024 

మేష రాశి
మీ పని తీరులో చాలా మార్పు వస్తుంది. ఇంట్లో, కార్యాలయంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ దినచర్య సమతుల్యంగా ఉంటుంది. పిల్లలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. పెద్దల నుంచి మీకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.

వృషభ రాశి
తప్పుడు ఆలోచనలు ఉండే వ్యక్తులకు దూరంగా ఉండండి. అప్పులు ఇచ్చేముందు, తీసుకునేముందు మరోసారి ఆలోచించండి. రోజంతా బిజీ బిజీగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. 

మిథున రాశి 
కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయి. సృజనాత్మక కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. మేధోపరమైన చర్చల్లో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఈరోజు మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతారు. రహస్య శత్రువులు మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు..

Also Read: పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!

కర్కాటక రాశి
మీ బాధ్యతలను అర్థం చేసుకుని మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టండి. ప్రతి పనిలోనూ ప్రతికూల ఫలితాలుంటాయి. ఆకస్మిక ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. సహోద్యోగులతో పాత విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కోపం తగ్గించుకోవాలి. 

సింహ రాశి
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. అదృష్టం కలిసొస్తుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి మీకు సహకారం అందుతుంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. గతంలో అప్పు ఇచ్చిన డబ్బు ఎట్టకేలకు చేతికందుతుంది. 

కన్యా రాశి 
ఈ రాశివారికి అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామిపట్ల మంచి ప్రవర్తన కొనసాగించండి. 

Also Read: రామాయణంలో సుందరకాండకే ఎందుకంత ప్రాధాన్యం - సుందరకాండలో అసలేముంది!

తులా రాశి
ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రేమ వివాహానికి కుటుంబ సమ్మతి లభించవచ్చు. మీ ప్రత్యర్థులు మీ ముందు చాలా బలహీనం అవుతారు. వ్యాపారులకు మంచి లాభాలున్నాయి. విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలు కనబరుస్తారు. 

వృశ్చికం రాశి
ఈ రాశివారి చేపట్టిన పనిపై పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించాలి. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. మీ తొందరపాటు స్వభావం నియంత్రించుకోకుంటే ఇబ్బందులు తప్పవు. వ్యాపారంలో నష్టాలొచ్చే సూచనలున్నాయి నూతన పెట్టుబడులు పెట్టొద్దు. 

ధనుస్సు రాశి
ఈ రోజు మీకు చాలా శుభప్రదమైన రోజు. కొన్నాళ్లుగా వెంటాడుతున్న వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు. కార్యాలయంలో మీ పనితీరుకి ప్రశంసలు అందుతాయి. పాత స్నేహితులను కలుస్తారు. వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. 

Also Read: ఏప్రిల్ 23 నుంచి జూన్ 01 వరకూ ఈ పారాయణం చేయండి - ఫలితం మీరు ఊహించలేరు!

మకర రాశి
మీ భావాలను వ్యక్తపరచడం మీకు కష్టంగా ఉంటుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరి నుంచి మీకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగ ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. ఉద్యోగం మారాలి అనుకున్నా ఇదే మంచి సమయం.

కుంభ రాశి 
ఈ రోజు ఒత్తిడి తగ్గుతుంది. ప్రారంభించిన పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తిచేస్తారు. నూతన సమాచారం వింటారు. ఉద్యోగులకు పనిలో సవాళ్లు ఎదురవుతాయి. వ్యాపారులకు సాధారణ ఫలితాలున్నాయి. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

మీన రాశి
డబ్బుకి సంబంధించిన వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు. న్యాయపరమైన విషయాల్లోనూ విజయం మీదే. పాత మిత్రులను కలుస్తారు. దీర్ఘకాలంగా వెంటాడుతున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ మాటలతో ఎవ్వరినీ బాధపెట్టొద్దు. వస్తు సౌఖ్యం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. 

Also Read: ఏప్రిల్ 23 నుంచి జూన్ 01 వరకూ ఈ పారాయణం చేయండి - ఫలితం మీరు ఊహించలేరు!

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి...

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
AR Rahman Legal Notice: వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
Weather Update: బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Embed widget