అన్వేషించండి

Ksheerabdi Dwadasi Horoscope 13 November 2024: క్షీరాబ్ధి ద్వాదశి రోజు ఈ రాశులవారిపై శ్రీ లక్ష్మీ నారాయణుల అనుగ్రహం!

Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today November 13, 2024

మేష రాశి

ఈ రోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది. కార్యాలయంలో బాధ్యతలు ఎక్కువవుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి.

వృషభ రాశి

ఈ రాశివారికి కార్యాలయంలో బాధ్యత పెరుగుతుంది..ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. ప్రేమ సంబంధాలలో పరస్పర అంకితభావం ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వ్యాపారంలో మంచి ఆర్డర్లు పొందుతారు. 

మిథున రాశి

ఈ రోజు పొట్టకు సంబంధించిన సమస్యలుంటాయి. మార్కెటింగ్ ఫీల్డ్ తో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ రోజు మంచి లాభాలు పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. విదేశాలకు వెళ్లడంవల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. చురుకుగా వ్యవహరిస్తారు. 

Also Read: నవంబరు 13నే క్షీరాబ్ధి ద్వాదశి - కార్తీకమాసంలో ఈ రోజుకి ఎందుకంత ప్రాధాన్యతో తెలుసా!

కర్కాటక రాశి

ఈ రోజు కుటుంబంలో చిన్న చిన్న వివాదాలుంటాయి. పనికి రాని విషయాలకు, అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది. మీ సహోద్యోగుల నుంచి మీకు మద్దతు లభించదు. షేర్లు, రిస్క్ తో కూడిన పెట్టుబడులు పెట్టొద్దు. మీరు ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు. అనారోగ్యంతో బాధపడతారు. 

సింహ రాశి

ఈ రోజు ఈ రాశివారికి రహస్య జ్ఞానం పట్ల ఆసక్తి పెరుగుతుంది. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఏ పనీ చేయాలని అనిపించదు.  సామాజిక, వ్యాపార రంగాల్లో కొత్త ప్రత్యర్థులు ఏర్పడవచ్చు. అనుమానాస్పద ధోరణులకు దూరంగా ఉండండి

కన్యా రాశి

ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. పిల్లల విజయంతో సంతోషంగా ఉంటారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం వ్యాపారంలో గొప్ప విజయానికి దారి తీస్తుంది. శుభకార్యక్రమాలలో పాల్గొనగలరు. అవివాహితులకు వివాహాలు జరిగే అవకాశం ఉంది.

తులా రాశి

ఈ రోజు చాలా మంచి రోజు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ప్రత్యర్థులు కూడా మీ ప్రతిభను ప్రోత్సహిస్తారు. మీ జీవన ప్రమాణం పెరుగుతుంది. విద్యార్థులు చదువుతో పాటు ఇతర ఉద్యోగాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. సంతానం లేని జంటలకు శుభవార్త అందుతుంది.

Also Read: లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం క్షీరాబ్ధి ద్వాదశి పూజ ఇలా ఈజీగా చేసేసుకోండి !

వృశ్చిక రాశి

మీరు ఈరోజు వ్యాపారం ప్రారంభించడంలో విజయం సాధిస్తారు. మా మాటల్లో సౌమ్యత ఉండేలా చూసుకోండి. సంఘంలో మీ హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఏదో ఒక మూల నుంచి ఆదాయం ఉంటుంది. మీరు ఆస్తి విషయాలలో విజయం సాధించవచ్చు. 

ధనస్సు రాశి

కార్యాలయంలో మీ పనితీరు మెచ్చుకోలుగా ఉంటుంది. యువకుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. జీతాల పెంపు కోసం అధికారులను అభ్యర్థిస్తారు.  ఆరోగ్య సంబంధిత సమస్యలు మెరుగుపడే అవకాశం ఉంది. కళపై ఆసక్తి చూపవచ్చు. కొత్త స్నేహితులు ఏర్పడతారు.  ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి 

మకర రాశి

ఈ రోజు మీ పనిలో పారదర్శకంగా ఉండండి. ముఖ్యమైన వస్తువులను భద్రంగా ఉంచండి. వ్యాపారంలో నగదు సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. సాంకేతిక రంగానికి సంబంధించిన వ్యాపారం నుంచి  ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కొన్ని రహస్య విషయాలు బయటకు రావచ్చు. కొంతమంది వ్యక్తులు మీ అమాయకత్వాన్ని ఉపయోగించుకుంటారు

Also Read:  క్షీరాబ్ధి ద్వాదశి వ్రత కథ ఇదే.. తులసి కోట దగ్గర దీపాలు వెలిగించాక చదువుకోవాలి!

కుంభ రాశి

కళారంగంలో ఉండేవారికి ఈ రోజు మంచిరోజు. మీ సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. కుటుంబంలో, కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. పాత విషయాలు గుర్తుచేసుకుంటారు. ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించారి. వ్యాయామంపై దృష్టి సారించండి

మీన రాశి

మీ ప్రతిభను గుర్తించేవారి సంఖ్య పెరుగుతుంది. మీ విజయాల గురించి మీకు మీరే గొప్పగా చెప్పుకోవడం చేయొద్దు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం. తప్పనిసరి అయితే కానీ దూరప్రాంత ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.పెట్టుబడుల విషయంలో ఆర్థికంగా నష్టపోతారు. ప్రత్యర్థులపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. 

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

Also Read: కార్తీక పౌర్ణమి ఈ ఏడాది (2024) ఎప్పుడొచ్చింది - ఈ రోజు విశిష్టత ఏంటి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: ఇప్పుడంతా స్విగ్గీ రాజకీయాలు - కాంగ్రెస్ టీ-20ని టెస్ట్ మ్యాచ్‌లా ఆడుతోంది - సొంత పార్టీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఇప్పుడంతా స్విగ్గీ రాజకీయాలు - కాంగ్రెస్ టీ-20ని టెస్ట్ మ్యాచ్‌లా ఆడుతోంది - సొంత పార్టీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Kurnool News: కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Smartphone Price Hike Reasons: 2025 నుంచి పెరగనున్న స్మార్ట్ ఫోన్ల ధరలు - ఈ మూడే కారణాలు!
2025 నుంచి పెరగనున్న స్మార్ట్ ఫోన్ల ధరలు - ఈ మూడే కారణాలు!
Andhra Pradesh: ఏపీ అసెంబ్లీలో చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ అనురాధ - జనసేన, బీజేపీ నేతలకు ఛాన్స్
ఏపీ అసెంబ్లీలో చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ అనురాధ - జనసేన, బీజేపీ నేతలకు ఛాన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేయడం ట్రంప్‌కి సాధ్యమేనా?Elon Musk Vs Ambani | Starlink closer to India | ట్రంప్ ఎన్నికతో ఇండియాకు స్పీడ్‌గా స్టార్ లింక్!Shankar Maniratnam Game Changer Thug Life | మణిరత్నం శంకర్‌కి ఇది చాలా టఫ్ ఫేజ్ | ABP DesamBorugadda Anil Met Family members CCTV | బోరుగడ్డ అనిల్ రాచమర్యాదలు..మరో వీడియో వెలుగులోకి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: ఇప్పుడంతా స్విగ్గీ రాజకీయాలు - కాంగ్రెస్ టీ-20ని టెస్ట్ మ్యాచ్‌లా ఆడుతోంది - సొంత పార్టీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఇప్పుడంతా స్విగ్గీ రాజకీయాలు - కాంగ్రెస్ టీ-20ని టెస్ట్ మ్యాచ్‌లా ఆడుతోంది - సొంత పార్టీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Kurnool News: కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Smartphone Price Hike Reasons: 2025 నుంచి పెరగనున్న స్మార్ట్ ఫోన్ల ధరలు - ఈ మూడే కారణాలు!
2025 నుంచి పెరగనున్న స్మార్ట్ ఫోన్ల ధరలు - ఈ మూడే కారణాలు!
Andhra Pradesh: ఏపీ అసెంబ్లీలో చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ అనురాధ - జనసేన, బీజేపీ నేతలకు ఛాన్స్
ఏపీ అసెంబ్లీలో చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ అనురాధ - జనసేన, బీజేపీ నేతలకు ఛాన్స్
Andhra Group 2 : ఆంధ్రా గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - వారు కోరుకున్నట్లుగానే పరీక్ష వాయిదా -ఎప్పటికంటే
ఆంధ్రా గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - వారు కోరుకున్నట్లుగానే పరీక్ష వాయిదా -ఎప్పటికంటే
PM Modi On Caste Census: ఓబీసీలను విడగొట్టేందుకు కాంగ్రెస్ కొత్త నాటకం, కులగణనపై నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు
ఓబీసీలను విడగొట్టేందుకు కాంగ్రెస్ కొత్త నాటకం, కులగణనపై నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు
Highest Selling Bikes: ఒక్క నెలలోనే ఐదు లక్షలకు పైగా సేల్స్ - దుమ్ములేపుతున్న టూ వీలర్ బ్రాండ్ ఇదే!
ఒక్క నెలలోనే ఐదు లక్షలకు పైగా సేల్స్ - దుమ్ములేపుతున్న టూ వీలర్ బ్రాండ్ ఇదే!
Charlapally Railway Station: ట్రెండ్ సెట్ చేస్తున్న చర్లపల్లి రైల్వే స్టేషన్, రూ.430 కోట్లతో అన్నీ అత్యాధునిక హంగులే
ట్రెండ్ సెట్ చేస్తున్న చర్లపల్లి రైల్వే స్టేషన్, రూ.430 కోట్లతో అన్నీ అత్యాధునిక హంగులే
Embed widget