ఈ రాశులవారికి ఈరోజు ఆర్థికలాభం..వ్యక్తిగత జీవితంలో సంతోషం - సెప్టెంబరు 29 రాశిఫలాలు
Horoscope Prediction 29 September 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Daily Horoscope for 29 September 2024
మేష రాశి
ఈ రోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వివాహానికి ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహించాలి.
వృషభ రాశి
ఈ రోజు ఈ రాశివారు వాహనం జాగ్రత్తగా నడపాలి. చిన్న చిన్న కారణాల వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలుంటాయి. మీ మైండ్ చెప్పింది వినండి..ఆర్థికంగా లాభపడతారు. వ్యాపారం, ఉద్యోగంలో మిశ్రమఫలితాలుంటాయి.
మిథున రాశి
ఈ రోజు మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ జీవితంలో సామరస్య వాతావరణం ఉంటుంది. ఇంటి పనుల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మీ ఆలోచనను కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటారు. మీ సన్నిహితులు మీనుంచి సహాయం ఆశిస్తారు.
Also Read: దసరాతో ప్రారంభం..దీపావళితో ముగింపు - 2024 అక్టోబరులో పండుగల జాబితా!
కర్కాటక రాశి
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఓ శుభవార్త వింటారు. ఉద్యోగం, వ్యాపారంలో మిశ్రమఫలితాలుంటాయి. ఈ రోజు మీరు తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరం. గుండె సంబంధిత సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత జీవితం బాగానే ఉంటుంది.
సింహ రాశి
ఈ రోజు మీరు ఆర్థిక విషయాలలో తీవ్రంగా ఉంటారు. కార్యాలయంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వ్యక్తిగత సంబంధాల్లో సంతోషం ఉంటుంది. కుటుంబానికి తగిన సమయం కేటాయిస్తారు. సృజనాత్మక పనిపై ఆసక్తి చూపవచ్చు.
కన్యా రాశి
ఈ రోజు మీరు ఏదో ఒక విషయంలో కోపంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులుంటాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. మారుతున్న వాతావరణ ప్రభావం మీపై ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఈ రోజు మంచిది కాదు.
తులా రాశి
ఈ రోజు మీకు కలిసొస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. ఉద్యోగంలో మీ పనితీరు ఆదర్శప్రాయంగా ఉంటుంది. సీనియర్ల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొత్త వ్యక్తులను కలుస్తారు.
వృశ్చిక రాశి
ఈ రాశివారు వ్యాపారంలో కొత్త ఉద్యోగులను నియమించుకుంటారు. దూరప్రాంత ప్రయాణానికి ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు మీరు కష్టపడితేనే తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది.
Also Read: బ్రహ్మోత్సవం అనే పేరెలా వచ్చింది.. దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వానపత్రం ఎవరిస్తారు!
ధనస్సు రాశి
కళా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు మంచి రోజు. సహోద్యోగులతో సత్సంబంధాలుంటాయి. ఆరోగ్య సేవలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు మంచిది. పని ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులకు చదువులపై ఆసక్తి ఉంటుంది.
మకర రాశి
ఈ రోజు మీరు చేపట్టే పనిలో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అధిక భావోద్వేగానికి గురికావొద్దు. కొత్తగా ప్రారంభించే వ్యాపార, వ్యవహారాలకు సంబంధించి ఎవరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవద్దు..మీ మనసు చెప్పిందే వినండి.
Also Read: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ తేదీలు 2024.. ఏ రోజు ఏ వాహన సేవలు - వాటి విశిష్టతలేంటి!
కుంభ రాశి
ఈ రోజు మీకు కొలిసొస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు అనుకున్నట్టే పూర్తవుతాయి. రోజువారి వ్యవహారాలు క్రమబద్ధంగా సాగిపోతాయి. కొత్త వ్యక్తులతో మీ వ్యక్తిగత విషయాలు చెప్పకుండా ఉండడం మంచిది. ఆరోగ్యం బావుంటుంది..ఆదాయం మెరుగుపడుతుంది.
మీన రాశి
కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. నూతన విషయాల అధ్యయనంపై ఆసక్తి పెరుగుతుంది. మీ పరిచయాల పరిధి పెరుగుతుంది. మిత్రులతో సంబంధాలు బలపడతాయి..శత్రువులపై పైచేయి సాధిస్తారు. అదృష్టం కలిసొస్తుంది.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.