సెప్టెంబరు 21 రాశిఫలాలు - ఈ రాశులవారు స్నేహితుల నుంచి మంచి సహకారం అందుకుంటారు!
Horoscope Prediction 21 September 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Daily Horoscope for 21 September 2024
మేష రాశి
ఈ రోజు పెండింగ్‌లో ఉన్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. మీ ప్రత్యర్థులు కార్యాలయంలో బలహీనంగా మారతారు. ఇంట్లోని వ్యక్తులు మిమ్మల్ని చాలా గౌరవిస్తారు. స్నేహితుల నుంచి అవసరమైన సహకారం అందుతుంది. ఈ రోజు పాత విభేదాలను పరిష్కారమవుతాయి.
వృషభ రాశి
ఈ రోజు కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఉంటాయి, కానీ క్రమంగా వాటిని అధిగమిస్తారు. వ్యాపార భాగస్వాముల పట్ల మనస్సులో అపనమ్మకం ఏర్పడవచ్చు.
మిథున రాశి
ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాదాస్పద విషయాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించవచ్చు. కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉంటారు. మిత్రుల నుంచి సరైన ప్రోత్సాహం లభిస్తుంది.
Also Read: లడ్డూ సహా శ్రీవారికి నివేదించే ప్రసాదాలు ఇవే - శుక్రవారం చాలా ప్రత్యేకం!
కర్కాటక రాశి
ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. మీ కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. పిల్లల ప్రధాన సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కోవడం మంచిది. కుటుంబం కోసం ప్రత్యేక సమయాన్ని వెచ్చిస్తారు.
సింహ రాశి
ఈ రోజు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. మతపరమైన ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. పిల్లల పురోగతి వల్ల మనసులో సంతృప్తి ఉంటుంది. మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు లభిస్తాయి. పనికిరాని వాటిపై దృష్టి పెట్టవద్దు.
కన్యా రాశి
మీ లక్ష్యం వైపు దృష్టి సారించండి. మీరు నమ్మినవారే మోసం చేసేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగం, వ్యాపారంలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. పిల్లల కారణంగా బాధపడతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
Also Read: తిరుమలలో మహిళలు తలలో పూలు పెట్టుకుంటే ఏమవుతుంది ..అసలెందుకు పూలు పెట్టుకోరు!
తులా రాశి
ఈ రోజు వ్యాపారంలో అనుకోని లాభాలు ఆర్జిస్తారు. ఉన్నత విద్యకు సంబంధించి ముఖ్యమైన అవకాశాలు అందుకుంటారు. మీ ఆశయాలను నెరవేర్చుకోవడానికి కృషి చేస్తారు. ప్రయాణం చాలా శుభప్రదంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
మీ ఖ్యాతి పెరుగుతుంది. కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఈరోజు మీరు వివాదాలకు దూరంగా శాంతియుతంగా మీ పనిని చేయడానికి ప్రయత్నించండి. నూతన ప్రాజెక్టులు ప్రారంభించాలి అనుకుంటే ఈ రోజు మంచిరోజు అవుతుంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.
ధనుస్సు రాశి
ఈ రోజు మీరు ప్రయోజనాలను పొందుతారు. కుటుంబంలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. గత కొన్ని రోజులుగా ఉన్న టెన్షన్ తగ్గుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది
Also Read: తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా!
మకర రాశి
ఈ రోజు మీరు వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందలేకపోవడం వల్ల కొంత నిరాశ చెందుతారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద స్వభావం కారణంగా...వైవాహిక జీవితంలో విభేదాలు ఉండొచ్చు.
కుంభ రాశి
మీ ప్రణాళికలు అమలుచేయజంలో తొందరపడొద్దు. పిల్లల వృత్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. బంధువుల నుంచి సహకారం అందుతుంది. రోజంతా బిజీగా ఉంటారు. ఉద్యోగం, వ్యాపారంలో మిశ్రమ ఫలితాలుంటాయి.
మీన రాశి
ఈ రోజు వ్యాపారులు అప్పులు చేయాల్సి వస్తుంది. అలర్జీ, దగ్గు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వైవాహికజీవితంలో సంతోషం ఉంటుంది. తెలియని వ్యక్తుల నుంచి దూరం పాటించండి. స్నేహితుల వల్ల ప్రయోజనం ఉంటుంది.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?