అన్వేషించండి

మీరు ఆగస్టులో పుట్టారా? అన్నీ అదృష్టమే, కానీ డబ్బు విషయంలో మాత్రం...

August Born People Nature : మీ గ్రహస్థితి ఆధారంగా మాత్రమే కాదు..మీరు పుట్టిన నెల కూడా మీ లక్షణాలేంటో చెప్పేస్తుంది అంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఆగష్టులో పుట్టినవారు ఎలా ఉంటారంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆగస్టులో పుట్టినవారు నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసంతో పట్టుదలగా ఉంటారు.
  • వీరు ఊహాలోకంలో విహరిస్తూ, ప్రేమగా అందరితో ఉండటానికి ఇష్టపడతారు.
  • డబ్బు విషయంలో కొంత దురదృష్టం, కళ్ళు, గుండె సమస్యలు ఉంటాయి.

August Born People:  ఆగస్టులో పుట్టిన వారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువ. ధైర్యం, ఆత్మవిశ్వాసం, వినయం, విధేయతలో వీళ్లకు వీళ్లే సాటి...అత్యత్భుతమైన క్వాలిటీస్ ఉన్న వీరు ఓ విషయంలో దురదృష్ట వంతులు అనే చెప్పాలి...

మేషం, మిథునం, ధనస్సు సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?

ఆగస్టులో జన్మించిన వారి లక్షణాలివే...

మీ దూకుడికి సరిలేరెవ్వరు!

ఈనెలలో జన్మించిన వారు ప్రారంభించిన పనిని ఎంత కష్టం ఎదురైనా మధ్యలో విడిచిపెట్టరు..ఎలాగైనా పూర్తిచేసి తీరుతారు. ఇతరులపై పోటా పోటీగా గెలవడం వీరికి ఓ వ్యసనం అయిపోతుంది. ఇంటా బయటా మంచి గౌరవాన్ని పొందుతారు. అనుకున్న పనిని అనుకున్న క్షణమే ప్రారంభించేస్తారు. లేడికి లేచిందే పరుగు అనే సామెత వినే ఉంటారుగా... వీళ్లు ఈ రకమే. ఒక్కోసారి వీరి దూకుడు, ధైర్య సాహసాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి.  

కలల్లో మునిగితేలుతారు

ఈ నెలలో పుట్టినవారికి కలకు కనే స్వభావం ఉంటుంది. నిత్యం ఊహల్లో తేలిపోతుంటారు. ఇదే లక్షణం కొన్నిసార్లు అందలం ఎక్కిస్తే...మరికొన్నిసార్లు వీళ్లని సోమరులుగా మార్చేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో రిలాక్స్ గా ఉన్నట్టు కనిపిస్తారు కానీ...అవసరం వచ్చినప్పుడు ఢీ అంటే ఢీ అని బరిలోకి దిగిపోతారు... అప్పటివరకూ చూసిన వాళ్లేనా వీళ్లు అనిపిస్తారు...

వృషభం, సింహం, వృశ్చికం, మీనం సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?

దైవభక్తి ఎక్కువే

ఆగష్టులో పుట్టినవారికి ధైవ భక్తి అధికం. భగవంతుడిని విశ్వసిస్తారు. జ్ఞాపకశక్తి, లోకజ్ఞానం కూడా ఎక్కువే. ఆధ్యాత్మిక విషయాలపై, పురాణాలపై ఆసక్తి, అవగాహన ఉంటుంది. 

ప్రేమైక జీవులు

ఈ నెలలో జన్మించినవారు ప్రేమిస్తారు..ప్రేమను అందుకుంటారు. మంచి జీవితాన్ని నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తారు. వీరి ప్రేమ చాలా లోతుగా ఉంటుంది.   జీవిత భాగస్వామిపై మాత్రమే కాదు కుటుంబ సభ్యులందరిపై ప్రేమను కురిపిస్తారు. వృత్తి, ఉద్యోగాలపట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తారు..స్నేహితులు, సన్నిహితులు ఎక్కువే వీరికి.

Also Read: పేరు మార్చుకుంటే అదృష్టం కలిసొస్తుందా.. ఇందులో నిజమెంత!

ఒంటరితనం నచ్చదు

ఆగష్టు లో పుట్టినవారు ఎప్పుడూ అందరి మధ్యా సందడిగా ఉండాలనుకుంటారు. వీరికి ఒంటరి తనం అస్సలు నచ్చదు. సమస్యలు వచ్చినప్పుడు మాత్రం అందరితోనూ చెప్పేయరు..కేవలం తమకు అత్యంత సన్నిహితులు అయినవారితో పంచుకుంటారు...వెంటనే పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు. 

ఈ విషయంలో దురదృష్ట వంతులు

ఆగష్టులో జన్మించిన వారు అన్నివిషయాల్లో అదృష్టవంతులే అయినప్పటికీ డబ్బు విషయంలో మాత్రం దురదృష్టవంతులనే చెప్పాలి. ఎంత సంపాదించినా కానీ సమయానికి వీరి చేతిలో డబ్బు అందుబాటులో ఉండదు. అలా అని పేదవారిగా ఉండిపోతారు అనుకుంటే పొరపాటే.. భారీగా సంపాదిస్తారు... అత్యవసరం అయిన సమయంలో కాస్త ఇబ్బంది పడతారు. నెమ్మదిగా పరిస్థితులు సర్దుకుంటాయి.

ఆగస్టులో జన్మించినవారికి సోమవారం, బుధవారం, ఆదివారం బాగా కలిసొస్తాయి. ఆకుపచ్చ, కాషాయ రంగు అదృష్టాన్నిస్తాయి.  ఈ నెలలో జన్మించిన వారికి  ఎక్కువగా కంటికి, గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయి. 

Also Read: ఏదైనా పనిపై ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు ఇలా చేయండి సక్సెస్ మీ సొంతం అవుతుంది!

గమనిక: ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి

 

Frequently Asked Questions

ఆగస్టులో పుట్టినవారి ముఖ్య లక్షణాలు ఏమిటి?

వీరు ఆకర్షణీయంగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ప్రారంభించిన పనిని పూర్తిచేస్తారు, నాయకత్వ లక్షణాలు ఎక్కువ.

ఆగస్టులో పుట్టినవారు డబ్బు విషయంలో ఎలా ఉంటారు?

వీరు డబ్బు విషయంలో దురదృష్టవంతులుగా పరిగణించబడతారు. ఎంత సంపాదించినా, అవసరమైనప్పుడు చేతిలో డబ్బు అందుబాటులో ఉండదు.

ఆగస్టులో జన్మించినవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావచ్చు?

ఆగస్టులో జన్మించినవారికి ఎక్కువగా కంటికి, గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయి.

ఆగస్టులో పుట్టినవారికి అదృష్ట దినాలు, రంగులు ఏవి?

సోమవారం, బుధవారం, ఆదివారం వీరికి కలిసొస్తాయి. ఆకుపచ్చ, కాషాయ రంగులు అదృష్టాన్నిస్తాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

వృషభం, సింహం, వృశ్చికం, మీనం సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
వృషభం, సింహం, వృశ్చికం, మీనం సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
మేషం, మిథునం, ధనస్సు సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
మేషం, మిథునం, ధనస్సు సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
31-07-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
31-07-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
Surya Grahan Chandra Grahan: 13 రోజుల్లో రెండు గ్రహణాలు, ఇవి భారత రాజకీయాల దిశను మారుస్తాయా?
13 రోజుల్లో రెండు గ్రహణాలు, ఇవి భారత రాజకీయాల దిశను మారుస్తాయా?
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget