అన్వేషించండి

Zodiac Signs: ఈ రాశులవారికి వానాకాలం అంటే చాలా ఇష్టం - చిరుజల్లుల సవ్వడి వింటూ ఊహా ప్రపంచంలోకి వెళ్లిపోతారు!

Astrology: చిరు జల్లులు, మట్టివాసన, ప్రశాంతంగా కనిపించే ప్రకృతి, ఎటుచూసినా పచ్చదనం.. ఇవన్నీ సంతోషాన్ని రెట్టింపుచేస్తాయి..ఈ ఆనందాన్ని అందరూ ఆస్వాదించలేరు...అది కూడా మీ రాశిపై ఆధారపడి ఉంటుందట..

Zodiac Signs:  నల్లటి మబ్బులు..చల్లటి గాలులు..చినుకుల సవ్వడిని చూసి తమని తాము మర్చిపోతుంటారు కొందరు. ఈ ప్రపంచానికి దూరంగా ఊహాలోకంలో విహరిస్తుంటారు. ఈ భావోద్వేగాలన్నీ మీ జన్మరాశిపై ఆధారపడి ఉంటాయంటారు జ్యోతిష్యశాస్త్ర పండితులు. ఈ రాశుల్లో మీరున్నారా ఇక్కడ చెక్ చేసుకోండి..
 
వృషభ రాశి (Taurus) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

పంచభూతాల్లో వృషభ రాశి భూమికి సంకేతంగా చెబుతారు. చినుకుతడికి పులకరించే భూమిలా...మబ్బులు, చినుకులు చూడగానే వృషభ రాశివారిలో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఈ రాశివారికి పర్యావరణంతో లోతైన సంబంధం ఉంటుంది. అందుకే వానని చూసి చికాకు పడరు.. జల్లుల్లో తడుస్తూ ప్రకృతి అందాలను చూస్తూ మట్టి సువాసనను ఆస్వాదిస్తారు.   

కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

కర్కాటక రాశి పంచభూతాల్లో నీటికి సంకేతం. వీరిలో భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. వాతావరణంలో వచ్చే మార్పులు ఈ రాశివారి  ఆలోచనలపై ప్రభావం చూపిస్తాయి. మిగిలిన కాలాల్లో కన్నా వానాకాలంలో కర్కాటక రాశివారు ఓదార్పుని పొందుతారు. వర్షపు చినుకుల సవ్వడి వింటూ  ఒంటరిగా కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ పుస్తకం చదవడం అంటే వీళ్లకి మహా సరదా. 

Also Read: ఈ రాశులవారు టామ్ అండ్ జెర్రీ టైప్ - పెళ్లి జరిగితే ఇల్లు కురుక్షేత్రమే!
 
వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం,అనూరాధ, జ్యేష్ఠ)

వృశ్చిక రాశి కూడా పంచభూతాల్లో జలసంబంధమైనదే. ఈ రాశివారి ఆలోచనలు వానాకాలంలో చాలా సానుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా  వ్యక్తిగత సంబంధాల వృద్ధిపై ఎక్కువ దృష్టి పెడతారు. బంధాల మధ్య ఉన్న ప్రతికూలత తొలగించి ప్రశాంతత తెచ్చేందుకు ఈ సీజన్ సరైనది అనుకుంటారు.  ఈ రాశివారు వర్షాన్ని తమలో పరివర్తనకు సూచనగా ... తమలో ఉండే ప్రతికూలతను దూరంచేసి నూతన ప్రారంభానికి మార్గం సుగమం చేసేదిగా భావిస్తారు. 
 
కుంభ రాశి   (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

వానాకాలాన్ని ఆస్వాదించే వారిలో కుంభ రాశివారూ ఉన్నారు. విశ్లేషణాత్మకంగా ఉండే వీరి ఆలోచనలకు వానాకాలం ప్రేరణ ఇస్తుందట. వర్షపు చినుకుల్లో లయబద్ధమైన సంగీతం వింటూ తమ జీవితంలో ఉండే ఆనంద క్షణాలను గుర్తుచేసుకుంటారు. అదే సమయంలో భవిష్యత్ జీవితం ఆనందమయం కావాలంటే ఎలాంటి మార్పులను స్వాగతించాలో కూడా తమలో తాము ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారట.   

Also Read: మీలో మీకు తెలియని అపరిచితుడు ఇదిగో!
 
మీన రాశి  (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

మీన రాశి కూడా పంచభూతాల్లో నీటికి సంకేతం. కలలు కనడం వీరి సహజనైజం. ఈ రాశివారికి వర్షాకాలంతో ఓ మంచి అనుబంధం ఉన్నట్టు భావిస్తారు. తొలకరి జల్లులుకురిసేవేళ వీరిలో సృజనాత్మకత మేల్కొంటుంది..కొత్త కొత్త ఆలోచనలు, ఊహల్లో మునిగితేలుతారు. వర్షాన్ని ఆస్వాదిస్తూ తమ భావాలను పేపర్ పై పెట్టడాన్ని ఈ రాశివారు ఎంజాయ్ చేస్తారు.  

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. 

Also Read: ఈ రాశులవారి వైవాహిక జీవితం అత్యంత సంతోషంగా ఉంటుంది!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

12-07-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
12-07-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
జూలై 15 నుంచి గుప్త నవరాత్రులు: రాశి ప్రకారం మంత్రాలు, దశ మహావిద్యల పూజతో అదృష్టం మీదే!
జూలై 15 నుంచి గుప్త నవరాత్రులు: రాశి ప్రకారం మంత్రాలు, దశ మహావిద్యల పూజతో అదృష్టం మీదే!
శివ భక్తులపై శని ప్రభావం ఉండదా? శిష్యుడైన శని బారి నుంచి శివుడు కూడా తప్పించుకోలేకపోయాడు కదా!
శివ భక్తులపై శని ప్రభావం ఉండదా? శిష్యుడైన శని బారి నుంచి శివుడు కూడా తప్పించుకోలేకపోయాడు కదా!
11-07-2026 శనివారం మీ రాశిఫలాలు!
11-07-2026 శనివారం మీ రాశిఫలాలు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Telangana Politics Mind Game: తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
TG20 League Winner: టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
Veg Momos Recipe: ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Embed widget