News
News
వీడియోలు ఆటలు
X

Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే

. రాశీ చక్రంలోని పన్నెండు రాశులలో కొన్ని రాశుల వారికి పుట్టుకతోనే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. వీరికి అపారమైన సంపద, వైభవం ప్రాప్తిస్తుంది. కొద్దిపాటి శ్రమతోనే అపారమైన ఆర్థిక విజయాలను సొంతం చేసుకుంటారు.

FOLLOW US: 
Share:

ధనం మూలం ఇదం జగత్ అని నానుడి. అందిరికీ లక్ష్మీ కటాక్షం కావల్సిందే. సనాతన ధర్మంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నో మార్గాలను సూచించారు. లక్ష్మీదేవి పూజకు రకరకాల మార్గాలు కూడా సూచించారు. కొందరు పుట్టిన వేళా విశేషం ఆ ఇంటి వారికి కలిసివచ్చిందనే మాటలు తరచుగా వింటూ ఉంటాం. బిడ్డ జన్మించిన సమయం, ఆ సమయంలోని గ్రహస్థితులు కేవలం ఆ బిడ్డ జీవితాన్నే కాదు వారితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు ఫలితాన్ని అనుభవిస్తారు. వ్యక్తిగత కుండలిని అనుసరించి ప్రత్యేక పూజావిధానాలను కూడా జ్యోతిషం సూచిస్తుంది. అంతేకాదు జాతకం తెలుసుకోవడం ద్వారా జీవితంలో ధనయోగం ఉందా లేదా నిర్ధారించడం కూడా సాధ్యమవుతుంది. పన్నెండు రాశులలో కొన్ని రాశుల వారికి పుట్టుకతోనే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. వీరికి అపారమైన సంపద, వైభవం ప్రాప్తిస్తుంది. కొద్దిపాటి శ్రమతోనే అపారమైన ఆర్థిక విజయాలను సొంతం చేసుకుంటారు. మరికొందరికైతే అయాచితంగా ధనం ప్రాప్తిస్తుంది. అవి ఏ రాశులో, వారి జీవితం ఎలా ఉంటుందో ఒక సారి తెలుసుకుందాం.

Also Read: ఏప్రిల్ 6 హనుమాన్ జయంతి కాదు - హనుమాన్ విజయోత్సవం!

లక్ష్మీ కటాక్షం కలిగిన రాశులు

వృషభం

వృషభ రాశిలో పుట్టిన వారి మీద లక్ష్మీదేవి కృప ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే వీరి జీవితం ఆర్థిక కష్టాలు లేకుండానే గడిచి పోతుంది. ఈ రాశి వారు పుట్టిన ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. దీనికి తోడు వృషభ రాశిలో పుట్టిన వారిలో ఎక్కువ మంది అపారమైన తెలివి తేటలు కలిగి ఉంటారు. అంతేకాదు కష్టించి అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టరు. ఉన్నత స్థానాన్ని చేరుకునే వరకు విశ్రాంతి తీసుకోరు. అందువల్ల కూడా వీరిని లక్ష్మి విడిచిపెట్టదు.

మిథున రాశి

మిథున రాశి వారు చాలా అదృష్ట వంతులు. వీరికి లక్ష్మీ అనుగ్రహం పుట్టుకతోనే లభిస్తుంది. అపార సంపదలతో తులతూగుతారు. డబ్బుకు కొరత అనేదే వీరికి తెలియదు. డబ్బుకు కొరతే ఉండదు. ఈ వ్యక్తులు చాలా కష్టపడి పనిచేస్తారు. ఎంతో సంతోషంగా ఉంటారు. కష్టపడే తత్వం, ఆత్మ విశ్వాసం, అడ్డంకులను చిరునవ్వుతో స్వీకరించే వీరి స్వభావం వల్ల వీరు ఎప్పుడూ ఉన్నత స్థానంలోనే ఉంటారు.

Also Read: 2023-2024 ఈ రాశులకు చెందిన రాజకీయనాయకులకు గడ్డుకాలమే!

సింహరాశి

జ్యోతిష్యం సింహరాశి వారిని అదృష్టవంతులుగా అభివర్ణిస్తుంది. ఈ రాశి వారి మీద లక్ష్మీ కటాక్షం అపారంగా ఉంటుంది. ఫలితంగా డబ్బుకు లోటు ఉండదు. లక్ష్మీదేవి ఆశీస్సులతో వీరికెప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఉండవు.  సంపద, ఆస్తి కలిగి రాజుల్లా జీవితాన్ని గడుపుతారు. అంతేకాదు వీరికి దాన గుణం కూడా ఎక్కువే. తమకు కలిగిన దాన్ని దానం చేసే గుణం ఉండడం వల్ల మంచి పేరు కూడా సంపాదిస్తారు. సిరిసంపదలు, పేరు ప్రఖ్యాతులు వీరి సొంతం.

మీన రాశి

మీన రాశి వారి అధిష్టాన దైవం శ్రీహరి, రాశ్యాధిపతి దేవ గురువు బృహస్పతి. అందువల్ల వీరికి ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు మాత్రమే కాదు సంపదకు అధిపతి అయిన లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది. మీన రాశి వారికి కష్టించి పనిచేసే నైజం ఉంటుంది. అందువల్ల విజయం ఎప్పుడూ వీరి వెంటే ఉంటుంది. డబ్బు సంపాదించడం వీరికి చాలా చిన్న విషయంగా ఉంటుంది. ఎప్పటికీ డబ్బుకు లోటు ఉండదు. ఎలాంటి కొరత లేని జీవితం గడుపుతారు.

Published at : 01 Apr 2023 12:08 PM (IST) Tags: zodiac signs Astrology Zodiac astrological prediction jyothish rich by birth

సంబంధిత కథనాలు

Katra Vaishnodevi: గుహలో ప్రయాణం , ముగ్గురమ్మలు కొలువుతీర్చిన శక్తి దర్శనం- కట్రా'వైష్ణోదేవి' విశిష్ట‌త‌ తెలుసా!

Katra Vaishnodevi: గుహలో ప్రయాణం , ముగ్గురమ్మలు కొలువుతీర్చిన శక్తి దర్శనం- కట్రా'వైష్ణోదేవి' విశిష్ట‌త‌ తెలుసా!

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి  లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన  ముఖ్యమైన విషయాలివి!

Chanakya Neeti In Telugu: క‌ష్ట‌కాలంలోనే వీరి నిజ స్వ‌రూపం తెలుస్తుంది..!

Chanakya Neeti In Telugu: క‌ష్ట‌కాలంలోనే వీరి నిజ స్వ‌రూపం తెలుస్తుంది..!

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Attack on Anam: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డిపై దాడి, మంత్రి రోజాపై వ్యాఖ్యలే కారణమా?

Attack on Anam: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డిపై దాడి, మంత్రి రోజాపై వ్యాఖ్యలే కారణమా?

Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల 

Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల