By: ABP Desam | Updated at : 26 Mar 2022 12:50 PM (IST)
ఏప్రిల్ 11న మంత్రివర్గ విస్తరణ !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని ( YS Jagan Cabinet ) ఎప్పుడు ప్రక్షాళన చేయబోతున్నారన్నది వైఎస్ఆర్‌సీపీలో ఉత్కంఠగా మారింది. ప్రక్షాళన విషయాన్ని మంత్రులకు స్వయగా సీఎం జగనే చెప్పారు. సామజిక కారణాలతో కొంత మందిని తప్ప మిగతా అందర్నీ తొలగించబోతున్నట్లుగా స్పష్టం చేశారు. దీంతో మంత్రివర్గంలో బెర్త్ కోసం ఎమ్మెల్యేలు ( YSRCP MLAs ) చేయని ప్రయత్నాలు లేవు. మార్చి ఇరవై ఏడో తేదీన మంత్రులంతా రాజీనామాలు చేస్తారని ఉగాది పర్వదినాన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని గతంలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడా తేదీ కాదని మరోసారి చెబుతున్నారు.
వైఎస్ఆర్‌సీపీ నేతల జేబుల్లోకి రూ. 48వేల కోట్ల ప్రజాధనం - సీబీఐ విచారణకు టీడీపీ డిమాండ్ !
ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ వర్గాలు ఇస్తున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 11న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గ విస్తరణ ( Cabinet Expansion ) చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గంలో చేయబోయే మార్పుల గురించి సీఎం జగన్ ఓ క్లారిటీకి వచ్చినట్టుగా చెబుతున్నారు. 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన సీఎం జగన్.. అప్పుడు ఏర్పాటు చేసిన మంత్రివర్గం రెండున్నర ఏళ్లు మాత్రమే ఉంటుందని చెప్పారు. రెండున్నరేళ్ల తర్వాత కొత్తవారికి కేబినెట్‌లో చోటు కల్పిస్తానని అన్నారు. దాదాపు 90 శాతం మంది మంత్రులను మార్చి.. తొలి విడతలో అవకాశం దక్కనివారికి అవకాశం కల్పిస్తానని సీఎం జగన్ చెప్పారు. ప్రస్తుతం ముగ్గురు మంత్రులను మాత్రమే ఉంచి.. మిగతా అందర్నీ తొలగించి కొత్త వారికి చాన్సిస్తారని తెలుస్తోంది.
గుడ్‌న్యూస్ - విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం, వాట్ నెక్ట్స్ !
అయితే రెంజున్నరేళ్లు ముగిసిన తర్వాత కరోనా ( Corona ) .. ఇతర కారణాల వల్ల మంత్రివర్గ విస్తరణ చేయలేకపోయారు. ఇప్పుడు ఆ పని కూడా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. కొత్తగా మంత్రులయ్యేవారు కుదురుకుని ఎన్నికల సమయానికి పట్టు సాధిస్తే.. విజయం సులువు అవుతుందని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం మంత్రులుగా తొలగించబోయే వారికి జిల్లాల అధ్యక్షులుగా చాన్సివ్వబోతున్నారు. ఇరవై ఆరు కొత్త జిల్లాలను ( New Districts ) ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరవై ఆరు జిల్లాలకు అధ్యక్షుల్ని నియమించబోతున్నారు. వారిలో ఎక్కువగా మాజీ మంత్రులకు చాన్స్ ఉటుంది. ఈ క్రమంలో పాత, కొత్త మంత్రులు కలిసి పార్టీని మళ్లీ గెలిపిస్తారని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది.
Chandrababu In Kadapa: జగన్ పులివెందులలో బస్టాండ్ కట్టలేదు, కానీ 3 రాజధానులు కడతారా: చంద్రబాబు
Minister Gherao: మంత్రి జయరాంను అడ్డుకునేందుకు జనసేన, సీపీఐ లీడర్ల యత్నం- సత్యసాయి జిల్లాలో కబ్జాదారులపై చర్యలకు డిమాండ్
Breaking News Live Updates : కోనసీమ జిల్లా పేరు మార్చుతున్న ఏపీ ప్రభుత్వం
Konaseema District: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - కోనసీమ జిల్లా పేరు మార్చాలని నిర్ణయం, కొత్త పేరు ఏంటంటే !
YSRCP Rajya Sabha: తెలంగాణ వ్యక్తుల్ని రాజ్యసభ పదవుల నుంచి తొలగించండి - సీఎం జగన్కు ఏపీ నిరుద్యోగ జేఏసీ నిరసన సెగ
IBA Womens World Boxing: జరీన్ 'పంచ్' పటాకా! ప్రపంచ బాక్సింగ్ ఫైనల్ చేరిన తెలంగాణ అమ్మాయి
KKR vs LSG Preview: గెలిచి ప్లేఆఫ్స్ వెళ్తారా? ఓడి టెన్షన్ పడతారా!
China Plane Crash: ఎంత పనిచేశారు పైలట్లు! 132 మంది ప్రాణాలు గాల్లో కలిపేశారు!
Shivatmika Photos: నల్ల చీరలో 'దొరసాని'లా వెలిగిపోతోన్న శివాత్మిక