అన్వేషించండి

Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌తో వైఎస్ఆర్ సీపీకి తలనొప్పి? ఈసారి టికెట్ లేనట్టేనా?

Gorantla Madhav News: కాంట్రవర్సీ మాటలు కొందరికి చిక్కుల్లో పడేస్తే ఆయన్ను మాత్రం అవే మాటలే పార్లమెంటుకు పంపాయి. ఇప్పుడు అవే మాటలు ఆయన్ను రాజకీయాలకు దూరం చేస్తున్నాయా? 

Hindupuram MP: ఆయన కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రస్.. ఖాకీ చొక్కా నుంచి ఖద్దరు చొక్కా వేసిన వేసినా ఆయన తీరు మారలేదు. వివాదాలతోనే ఆయన ఎంతో ఫేఎమ్ సంపాదించాడు. కాంట్రవర్సీ మాటలే ఆయన రాజకీయ జీవితానికి అడుగులు వేసాయి. కాంట్రవర్సీ మాటలు కొందరికి చిక్కుల్లో పడేస్తే ఆయన్ను మాత్రం ఆ కాంట్రవర్సీ మాటలే పార్లమెంటుకు పంపాయి. ఇప్పుడు అవే మాటలు ఆయన్ను రాజకీయాలకు దూరం చేస్తున్నాయా? 

ఎంపీ గోరంట్ల మాధవ్. ఈయన గత ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ (YSRCP News) నుంచి హిందూపురం ఎంపీగా (Gorantla Madhav) గెలుపొందారు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈయన... కావాలనే అలా మాట్లాడుతారా.. లేక నిత్యం వార్తల్లో ఉండేలా వ్యాఖ్యలు చేస్తారో అర్థం కాదు.. చాలా మంది దశాబ్ధాల కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నా.. పెద్దగా గుర్తింపులోకి రాలేదు. కానీ గోరంట్ల మాధవ్ మాత్రం ఎంపీ అయ్యాక.. కాక ముందు నుంచే ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన ఈయన ఎస్ఐ గా కెరీర్ ను ప్రారంభించారు. ఎక్కువ కాలం ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే పని చేశారు. సీఐగా ప్రమోషన్ కూడా అందుకున్నారు. అయితే సినిమాలో పోలీసులను చూపిస్తున్న విధంగా హీరోల ఉండాలనుకుంటాడో ఏమో తెలియదు గానీ నాగార్జున సినిమా శివమణి, సాయికుమార్ సినిమాలో అగ్నిగా రెచ్చిపోతూ ఉండేవాడు. పబ్లిక్ ప్లేస్ లో అందరూ చూస్తుండగానే నేరస్థులను శిక్షించడం.. గన్ను తీసి నడుం వద్ద అందరూ కనిపించేలా పెట్టుకోవడం వంటివి చేసే వారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆయన చాలా రకాలుగా జనం దృష్టిని ఆకర్షించి పలు రకాలుగా మీడియాలో కనిపించే వారు.

సీఐ టూ ఎంపీ

టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పట్లో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. దానికి కౌంటర్ గా సీఐ మాధవ్ ప్రెస్ మీట్ లో మీసం తిప్పి సవాల్ విసరడంతో ఆయన పేరు జనం లో బాగా వినిపించింది. అనంతపురం జిల్లాలో సీఐగా పని చేస్తున్నప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. పార్టీలోకి వచ్చి రాగానే సీఎం జగన్ హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చారు. 2019 లో జగన్ వేవ్ ఉండటం.. మాధవ్ కురుబ సామాజిక వర్గం కావడం, తనకంటూ ఒక పేరు ఉండటంతో హిందూపురంలో భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచారు. ఖాకీ తీసేసి.. ఖద్దరు వేసినా ఆయన తీరు మాత్రం మారలేదు. పోలీస్ గా ఉన్నప్పుడు ఎలా కాంట్రవర్సీల్లో ఉండేవారో ఎంపీ అయిన తరువాత కూడా అలానే వ్యవహరించేవారు. ఆయన చేసే వ్యాఖ్యలు, తీరు వైసీపీ పెద్ద తలనొప్పిగా మారిపోయింది. 

న్యూడ్ కాల్ వీడియో హల్ చల్
చంద్రబాబు, జేసీ బ్రదర్స్ వంటి వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. పోలీసు బూట్లను ముద్దుపెట్టుకుని వార్తల్లో నిలిచారు. మాధవ్ న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతున్నట్టుగా ఒక వీడియో సోషియల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఇది గల్లీ నుంచి ఢిల్లీలోని పార్లమెంట్ వరకు వైరల్ గా మారి మాధవ్ ను కోలుకోలేని దెబ్బ తీసింది. అంతేకాదు ఇలాంటి పని చేసిన ఎంపీని బర్తరఫ్ చేయాలంటూ వైసీపీపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. దీనిపై యాక్షన్ తీసుకోలేక.. అలా అని మద్దతు పలకలేక వైసీపీ అధిష్టానం తీవ్రంగా మదనపడి పోయింది. మరోవైపు న్యూడ్ వీడియో వచ్చిన మాధవ్ చేసిన వ్యాఖ్యలు, కమ్మ వర్సెస్ కురుబల మధ్య విభేదాలకు దారి తీసింది.

ఇది మర్చిపోక ముందే రాంనగర్ లో తన ఇంటి అద్దె విషయంలో వివాదం మొదలైంది. మాధవ్ ఇంటి అద్దె చెల్లించకుండా, విద్యుత్ బిల్లు చెల్లించకుండా మూడేళ్లుగా మా ఇంట్లో ఉన్నారంటూ ఓనర్ గొడవ పెట్టుకున్నారు. ఇది చూస్తూ చూస్తూనే పెద్దదిగా మారి విషయం మీడియా వరకు వెళ్లడంతో పోలీసులు పంచాయతీ చేసే వరకు వచ్చింది.

తాజాగా వ్యాఖ్యలతో మళ్లీ వివాదాలు
గోరంట్ల మాధవ్ చాలా రోజులు మౌనంగా ఉన్నారు. కానీ ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు అటు తిరిగి ఇటు తిరిగి వైసీపీ కి చుట్టుకున్నాయి. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో జైలుకు వెళ్లిన నేపథ్యంలో జైలులో ఆయనకు భద్రత లేదు.. వైసీపీలో కీలక వ్యక్తుల నుంచి ప్రాణ హాని ఉందంటూ టీడీపీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. అదే సమయంలో ఎంపీ మాధవ్ ఓ మీటింగ్ మాట్లాడుతూ చంద్రబాబు చావడం ఖాయం అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టీడీపీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చినట్టైంది. ఒక ఎంపీనే ఇలా మాట్లాడారంటే ఏదో కుట్ర జరుగుతోందని టీడీపీ వైసీపీని టార్గెట్ చేసింది. దీనికి వైసీపీ అధిష్టానం సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మాధవ్ కూడా మీడియా ముందుకు వచ్చి.. తాను చేసిన వ్యాఖ్యలు వేరొకరకంగా ఎల్లో మీడియా ప్రచారం చేసిందని నేను అలా మాట్లాడలేదని వివరణ ఇచ్చుకున్నారు.

మాధవ్ జీవితంలో ఆ మాటలే ఆయన ఖాకీ చొక్కా నుంచి ఖద్దరు చొక్కా వేసుకునే వైపు నడిపించాయని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. ఏది ఏమైనా మాధవ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ చేశాయో ఇప్పుడు అవే వ్యాఖ్యలు ఆయనను పార్టీలో అంత పలచన చేస్తున్నాయన్నది వాస్తవం! మొదటి నుంచి కాంట్రవర్సీనే నమ్ముకున్నారు. అది ఆయన్ని హీరోని చేసింది. సీఐగా ఎవరికీ రాని గుర్తింపుని తెచ్చింది. అంతే కాదు ఆయన్ని రాజకీయాల్లో వచ్చే వరకు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో అదే కాంట్రవర్సీతో ముందుకెళ్తున్నారేమో అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గోరంట్ల మాధవ్ ఈ కాంట్రవర్సీ మాటలతో మరియు న్యూడ్ వీడియో ఇష్యు తర్వాత జరిగిన పరిణామాలతో ఈసారి టికెట్ ఇవ్వబోరని వస్తున్న వార్తల నేపథ్యంలో మాధవ్ తాను నమ్ముకున్న కాంట్రవర్సీ వ్యాఖ్యలనే నమ్ముకున్నారని చాలామంది పార్టీలో అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget