Kodali Nani: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత అంటూ ప్రచారం - ఆ ఒక్క ట్వీట్‌తో చెక్
Andhra Pradesh News: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలు హల్చల్ చేశాయి. ఇంట్లో నేతలతో మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారనే ప్రచారం సాగింది.

Gudivada MlA Kodali Nani Hospitalized: గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) గురువారం అస్వస్థతకు గురయ్యారనే ప్రచారం సాగింది. నందివాడ (Nandiwada) మండలంలోని తన ఇంట్లో వైసీపీ నాయకులతో మాట్లాడుతుండగా సోఫాలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారనే వార్తలు హల్చల్ చేశాయి. అయితే, దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాజాగా, సోఫాలో తాపీగా కూర్చున్న వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. దీంతో ఆయనకు అస్వస్థత అనే రూమర్లకు చెక్ పెట్టినట్లయింది. ఆయన అనుచరులు తప్పుడు ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఆయన ఇంట్లో అస్వస్థతకు గురయ్యారని.. వైద్యులు సెలైన్లు ఎక్కించారని వార్తలు హల్చల్ చేశాయి. ఈ ప్రచారంపై స్వయంగా కొడాలి నానియే ట్వీట్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు.
— Kodali Nani (@IamKodaliNani) May 23, 2024
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

