అన్వేషించండి

YS Jagan Comments: హెరిటేజ్ నెయ్యి రేట్లు పెంచుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నం - జగన్ సంచలన ఆరోపణలు 

Tirupati News: హెరిటేజ్ నెయ్యి రేట్లు పెంచుకునేందుకే సీఎం చంద్రబాబు కొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. 2015 -18 మధ్య కాలంలో నందిని బ్రాండ్ ఎందుకు లేదని ప్రశ్నించారు.

YS Jagan Comments On Heritage Company: సీఎం చంద్రబాబు (CM Chandrababu) సంస్థ హెరిటేజ్‌ నెయ్యి రేట్లు పెంచుకునేందుకు కొత్త కొత్త వాదనలు తెరపైకి తీసుకొస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు. అందుకే రూ.1,000 ఉన్న నెయ్యి రూ.300కు వస్తుందనే వాదన చేస్తున్నారని అన్నారు. రూ.320కు నెయ్యి ఎలా వస్తుందనే ప్రశ్న ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. '2015 - 19 మధ్య కాలంలో నెయ్యిని కొనుగోలు చేశారు కదా... ఏ రేట్‌కు ప్రొక్యూర్ చేశారు. అదే క్వాలిటీ నెయ్యే కదా. దశాబ్ధాలుగా నెయ్యి క్వాలిటీ అదే. అవే ఆవులు, అవే డెయిరీలు, అవే క్వాలిటీ ఉంటే తీసుకుంటారు లేకుంటే తీసుకోరు. 2015లో రూ.276 పెట్టి నెయ్యి చంద్రబాబు కొనుగోలు చేశారు. 2019 జనవరిలో రూ.324కు కొన్నారు. అలాంటప్పుడు రూ.320లకు కొంటే తప్పేంటీ. ఇప్పుడు కూడా అదే రేట్లతో కొనుగోలు చేసుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు తన హెరిటేజ్‌ లాభపడాలనే ఉద్దేశంతో రేట్లు పెంచుకునేందుకు మాట్లాడుతున్నారు.' అని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. 2015 -18 మధ్య కాలంలో నందిని బ్రాండ్ ఎందుకు లేదని జగన్ ప్రశ్నించారు. నందిని వాళ్లు కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తారు. కొన్నిసార్లు చేశారు. 2019 తర్వాత కూడా అప్పడప్పుడు పార్టిసిపేట్ చేశారని పేర్కొన్నారు.

'మతం పేరుతో రాజకీయాలు దౌర్భాగ్యం'

రాష్ట్రంలో మతం పేరుతో రాజకీయాలు చేయడం దౌర్భాగ్యమని.. మాజీ సీఎంకే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగిలిన వారి పరిస్థితి ఏంటని జగన్ మండిపడ్డారు. గతంలో అనేకసార్లు తాను తిరుమలకు వెళ్లానని.. శ్రీవారి దర్శనం చేసుకున్నాకే తన పాదయాత్ర ప్రారంభించినట్లు చెప్పారు. 'పాదయాత్ర పూర్తయ్యాక కాలి నడకన వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకున్నా. బ్రహ్మోత్సవాల్లో స్వామి వారికి ఐదుసార్లు వస్త్రాలు సమర్పించా. నా కులం, మతం ప్రజలందరికీ తెలుసు. గుడికి వెళ్లే వ్యక్తిని ఏ మతం అని అడగడం సరికాదు. నా మతం మానవత్వమని కావాలంటే డిక్లరేషన్‌లో రాసుకోవాలి.' అని జగన్ సవాల్ చేశారు.

రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోందని.. దేవుని దగ్గరకు వెళ్లే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం తన రాజకీయ జీవితంలో చూడలేదని జగన్ మండిపడ్డారు. తిరుపతి లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు చెప్పేవన్ని అబద్ధాలని రుజువవుతోందని అనిపిస్తోందని.. లడ్డూ విషయంలో అడ్డగోలుగా దొరికిపోయే సరికి టాపిక్ మార్చేందుకే డిక్లరేషన్ అంశం తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా చూపిస్తున్నారని.. ఇది చాలా దారుణమని అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి (Tirupati) లడ్డూలో ఉన్న రుచి వేరే ఏ లడ్డూలో ఉండదని.. ప్రతి 6 నెలలకోసారి టెండర్లు పిలుస్తారని చెప్పారు. తక్కువకు ఎవరు కోట్ చేస్తే వాళ్లకు టెండర్ అప్రూవ్ చేస్తారని చెప్పారు. ఇది రొటీన్ ప్రక్రియ అని ఇందులో ప్రభుత్వానికి సంబంధం ఉండదని జగన్ స్పష్టం చేశారు. 

Also Read: YS Jagan: 'తిరుపతి లడ్డూ టేస్ట్ వేరే ఏ లడ్డూలోనూ ఉండదు' - రహస్యమైన రిపోర్టు టీడీపీ ఆఫీస్‌ నుంచి ఎందుకు రిలీజ్ చేశారని జగన్ సూటి ప్రశ్న

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Presidential Election 2024: అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ లీడింగ్‌- 15కిపైగా రాష్ట్రాల్లో విజయం- వెనకబడ్డ హారిస్‌
అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ లీడింగ్‌- 15కిపైగా రాష్ట్రాల్లో విజయం- వెనకబడ్డ హారిస్‌
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Presidential Election 2024: అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ లీడింగ్‌- 15కిపైగా రాష్ట్రాల్లో విజయం- వెనకబడ్డ హారిస్‌
అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ లీడింగ్‌- 15కిపైగా రాష్ట్రాల్లో విజయం- వెనకబడ్డ హారిస్‌
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
Cultivating Positivity : నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతున్నాయా? పాజిటివ్​గా ఉండేందుకు ఇవి ఫాలో అవ్వండి
నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతున్నాయా? పాజిటివ్​గా ఉండేందుకు ఇవి ఫాలో అవ్వండి
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
World Travel Market: లండ‌న్ వేదికగా వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
లండ‌న్ వేదికగా వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Embed widget