అన్వేషించండి

YS Jagan: సంపద సృష్టి కాదు.. సంక్షోభ సృష్టి - కాగ్ లెక్కలతో చంద్రబాబు సర్కార్‌పై జగన్ అటాక్!

AP Economy: ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. CAG నివేదికను ఉటంకిస్తూ, రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉందని విశ్లేషించారు.

Jagan Criticizes Chandrababu Over Fiscal Stress:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రచురించిన 2025-26 ఆర్థిక సంవత్సర తాత్కాలిక ఖాతాలను విశ్లేషిస్తూ, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్న అభివృద్ధి లెక్కలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని.. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం  వైపు కూరుకుపోతోందని ఆయన ఆరోపించారు.

 జీఎస్‌డీపీ గారడీ 

2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి   10.75% వృద్ధి చెందిందని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోందని, కానీ ప్రభుత్వ పన్ను ఆదాయం మాత్రం 3.22% తగ్గడం విడ్డూరంగా ఉందని జగన్ విమర్శించారు. సాధారణంగా రాష్ట్రం వృద్ధి పథంలో ఉంటే పెట్టుబడులు, వినియోగం పెరిగి పన్ను వసూళ్లు కూడా పెరుగుతాయని, ఇక్కడ పన్ను ఆదాయం తగ్గడం అంటే ఆర్థిక మందగమనం ఉందనడానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ అంచనాల్లో 9.60% వృద్ధి చూపి, వాస్తవంలో అది మైనస్  లోకి వెళ్లడం ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోందన్నారు.

 రూ. 13,667 కోట్ల నష్టమా? 

గత ప్రభుత్వ హయాంలో (2023-24) రాష్ట్ర పన్ను ఆదాయం రూ. 85,922 కోట్లుగా ఉందని జగన్ గుర్తు చేశారు. సాధారణంగా 8% వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకున్నా, ఈ రెండేళ్లలో ఆదాయం రూ. 1,00,219 కోట్లు ఉండాలని.. కానీ ఇప్పుడు కేవలం రూ. 86,552 కోట్లే వసూలైందని గణాంకాలతో వివరించారు. ఈ లెక్కన ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సుమారు  రూ. 13,667 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని, చంద్రబాబు చెబుతున్న  సంపద సృష్టి  ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు.   

 ఏపీఎండీసీ నిధులపై ఆరోపణలు 

ఏపీఎండీసీ  ద్వారా మే 2025లో సేకరించిన రూ. 9,000 కోట్ల ఎన్‌సీడీ నిధులను ప్రభుత్వం అక్రమంగా తన రెవెన్యూ ఖర్చుల కోసం వాడుకుందని జగన్ ఆరోపించారు. ఎటువంటి ఆస్తుల సృష్టి జరగకుండానే ఈ నిధులను మళ్లించారని, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఎన్‌సీడీ హోల్డర్లకు రాష్ట్ర కన్సోలిడేటెడ్ ఫండ్ యాక్సెస్ కల్పించారని మండిపడ్డారు. ఈ నిధులు కేవలం లెక్కలు సర్దుబాటు చేసేందుకే నాన్-టాక్స్ రెవెన్యూగా చూపించారని ఆయన విమర్శించారు.

 విధానపరమైన అవినీతి 

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి విధానపరమైన పక్షపాతం, అవినీతి వల్ల వచ్చిందేనని జగన్  విమర్శించారు. ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అవాస్తవ వృద్ధి రేట్లను ప్రకటిస్తోందని, అప్పులు సేకరించడానికి అనారోగ్యకరమైన,  రాజ్యాంగ విరుద్ధమైన మార్గాలను ఎంచుకుంటోందన్నారు. గత రెండేళ్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని, ఇది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
Why YSRCP Fire Brands Silent: వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
Amaravati Mega Metropolitan Region: అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
Trainee IPS Uday Krishna Reddy Remand: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget