News
News
X

నేడు సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డి - అరెస్ట్ చేయకండా ఆదేశాలు ఇవ్వాలని- తెలంగాణ హైకోర్టులో పిటిషన్ !

సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

FOLLOW US: 
Share:


Avinash Reddy To Highcourt :   వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను అరెస్ట్  చేయకుండా సీబీఐకి ఆదేశాలివ్వాలని కోరుతూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.  సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని పిటిషన్‌లో కోరారు అవినాష్రెడ్డి.  తన న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని  ... పలుమార్లు కోరినా సిబిఐ తన అభ్యర్ధనను అంగీకరించలేదన్నారు.  160 CRPC నోటీస్‌ ఇచ్చారు కాబట్టి సీబీఐ ఎలాంటి బలవంతపు ,చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.  వివేకా హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని.. ఇప్పటివరకు సీబీఐ అరెస్ట్ చేయలేదని.. దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా సీబీఐ ఎక్కడా వ్యతిరేకించలేదని  అవినాష్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.  దస్తగిరి అక్కడ ఇక్కడ విని చెప్పిన మాటల ఆధారంగానే..సీబీఐ విచారణ కొనసాగుతోందన్నారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ..ఈ కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. 

సునీల్ యాదవ్ గూగుల్ టేక్ఔట్ ఫోన్ సిగ్నల్ లొకేషన్ చూపి సిబిఐ తనను వేధిస్తోందని..  స్పాట్ లో దొరికిన లేఖపై సిబిఐ దర్యాప్తు చేయటం లేదన్నారు.  వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారి పనితీరు పక్షపాతంగా ఉందని..  వివేకా హత్య ఎలా జరిగిందో ముందుగానే నిర్ణయించుకొని..అదే కోణంలో విచారణ చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా విచారణాధికారి కొందరిపై ఒత్తిడి తెస్తున్నారని..  తాను విచారణలో చెప్పిన విషయాలను కూడా విచారణ అధికారి మార్చేస్తున్నారని  అవినాష్‌రెడ్డి ఆరోపించారు. నోటీస్ దశలో విచారణ సాగుతుండగా చార్జ్ షీట్‌లో నేరస్తునిగా సిబిఐ చిత్రీకరిస్తోందన్నారు.  

ఇప్పటికే రెండు సార్లు అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ 

సిబిఐ అధికారులు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే జనవరి 28న, ఫిబ్రవరి 24న రెండుసార్లు అవినాష్ రెడ్డిని విచారించారు.  విచారణలో భాగంగా ఈనెల ఆరో తేదీన హైదరాబాద్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈనెల 4వ తేదీన పులివెందులలోని వైయస్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. అయితే తనకు ముందుగా నిర్ణయించిన పలు కార్యక్రమాల వలన ఆరోజు విచారణకు హాజరు కాలేనని అవినాష్ రెడ్డి సిబిఐకి లేఖ రాశారు. దీంతో సిబిఐ అధికారులు ఈనెల 10వ తేదీన విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. ఆయన మూడోసారి సిబిఐ విచారణకు హాజరుకానున్నారు. అలానే ఈనెల 12వ తేదీన వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ విషయంపై అవినాష్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సిబిఐ అధికారులు తనకు పదో తేదీన, తన తండ్రికి 12వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారని ఈ మేరకు తాము హాజరు అవుతామని స్పష్టం చేశారు. 

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పైనే ప్రధానంగా సీబీఐ అనుమానం 

వై.ఎస్. వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌లో అవినాష్ రెడ్డిపై ప్రధానంగా అనుమానాలు వ్యక్తం చేసింది.  వైఎస్ అవినాష్‌రెడ్డి, శివశంకర్ రెడ్డితో వివేకాకు రాజకీయ వైరుధ్యం పెరిగిందని సీబీఐ పేర్కొంది. ఎంపీ టికెట్ అవినాష్‌రెడ్డికి బదులు తనకు ఇవ్వాలని వివేకా కోరుకున్నారని తెలిపింది. తనకు ఇవ్వకపోయినా షర్మిల, విజయమ్మకు ఇవ్వాలని వివేకా పట్టుబట్టారని పేర్కొంది. వివేకా రాజకీయ కదిలికలు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డికి నచ్చలేదని సీబీఐలో తెలిపింది. శివశంకర్‌రెడ్డితో కలిసి అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి వివేకా హత్యకు కుట్ర పన్నినట్లు తెలుస్తోందని పేర్కొంది. హత్య జరిగిన రోజు రాత్రి వై.ఎస్. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఇంటికి సునీల్ యాదవ్ వెళ్లాడని ఐదుగురితో కలిసి అవినాష్‌రెడ్డి హత్య స్థలానికి వెళ్లాడని తెలిపింది. నిందితులు హత్య జరిగిన స్థలాన్ని శుభ్రం చేశారని వివేకా శరీరంపై ఉన్న గాయాలు కనిపించకుండా బ్యాండేజీ కట్టారని కోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో సీబీఐ పేర్కొంది. 
 
అరెస్ట్ ఊహాగానాలతో ఎంపీ ముందు జాగ్రత్త ప్రయత్నాలు ! 

సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ ను బట్టి చూస్తే.. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి విషయంలో సీబీఐ చాలా దూకుడుగా విచారణ జరిపిందని.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవచ్చని కూడా చెబుతున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. 

Published at : 09 Mar 2023 04:02 PM (IST) Tags: YS Viveka murder case Telangana High Court YS Avinash Reddy Avinash Reddy's petition in High Court not to arrest

సంబంధిత కథనాలు

CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

Ugadi Wishes: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన సీఎంలు, దేశాభివృద్ధికి పాటుపడాలని సూచన

Ugadi Wishes: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన సీఎంలు, దేశాభివృద్ధికి పాటుపడాలని సూచన

రైల్వే అధికారులతో దక్షిణ మధ్య రైల్వే జీఎం సమావేశం - చర్చించిన అంశాలివే

రైల్వే అధికారులతో దక్షిణ మధ్య రైల్వే జీఎం సమావేశం - చర్చించిన అంశాలివే

Tirupati News: శ్రీసిటీని సందర్శించిన సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్

Tirupati News: శ్రీసిటీని సందర్శించిన సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Etela Rajender: ఇది మహిళలు చేసే వ్యాపారమా! టూ బ్యాడ్‌ థింగ్‌ కేసీఆర్: లిక్కర్ కేసుపై ఈటల

Etela Rajender: ఇది మహిళలు చేసే వ్యాపారమా! టూ బ్యాడ్‌ థింగ్‌ కేసీఆర్: లిక్కర్ కేసుపై ఈటల

UPW-W vs DC-W, Match Highlights: క్యాప్సీ కేక! యూపీపై గెలుపుతో WPL ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్‌!

UPW-W vs DC-W, Match Highlights: క్యాప్సీ కేక! యూపీపై గెలుపుతో WPL ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్‌!

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!