అన్వేషించండి

YSRCP : రెండో జాబితా రెడీ చేసిన సీఎం జగన్ - ఏ క్షణమైనా 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ !

Jagan : పాతిక మంది నియోజకవర్గ ఇంచార్జుల మార్పుతో రెండో జాబితాను వైసీపీ అధినేత విడుదల చేసే అవకాశం ఉంది. పలువురు నేతలు సీఎం క్యాంప్ ఆఫీస్‌కు శుక్రవారం కూడా వచ్చారు.

 

YSRCP Coordinators Change  :  అసెంబ్లీ నియోజకవర్గాలపై సీఎం జగన్ విస్తృత కసరత్తు కొనసాగిస్తున్నారు. శుక్రవారం కూడా పలువురు నేతలు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. 
సీఎం కార్యాలయానికి వచ్చినవారిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, విజయవాడ తూర్పు కన్వీనర్ దేవినేని అవినాష్ తదితర నేతలు వెళ్లారు.. అయితే, కొంత మంది వివిధ పనులపై వస్తుండగా.. కొన్ని సెగ్మెంట్లలో మార్పుల నేపథ్యంలో వీరి రాకకు ప్రాధాన్యత ఏర్పడింది.

మరోవైపు తాడేపల్లిలోని సీఎంవోకు వచ్చారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. గిద్దలూరు సహా ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాల ఇంచార్జీల మార్పు పై సీఎంతో చర్చించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గిద్దలూరు, ఎర్రగొండపాలెం, దర్శి, పర్చూరు వంటి సెగ్మెంట్లపై వైసీపీ అధిష్టానంతో బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చలు జరపనున్నారట.. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో అనే చర్చ సాగుతోంది.  తొలి విడతలో 11 సెగ్మెంట్లలో మార్పులు చేసింది వైసీపీ అధిష్టానం.. ఇక, రెండో విడత లిస్ట్‌ రెడీ అయ్యిందని.. రేపో మాపో లిస్ట్‌ వస్తుందనే చర్చ సాగుతోంది.           

రెండో లిస్ట్ లో   సుమారుగా 25 నియోజకవర్గాల్లో మార్పులు ఉండే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. గత కొంతకాలంగా మంత్రి రోజా స్థానం మారుస్తారనే చర్చ సాగుతూ వచ్చింది.. ఓ దశలో రోజాకు అసలు సీటు డౌటే అనే ప్రచారం సాగింది.. కానీ, నగరిలో మంత్రి ఆర్కే రోజా స్థానం సేఫ్ అని తెలుస్తోంది.. అంతే కాదు.. మంత్రి అంబటి రాంబాబు నియోజకవర్గం కూడా నో ఛేంజ్ అంటున్నారు. ఇక, దర్శి బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డికి   ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. కానీ, ఎమ్మిగనూరు పై ఇంకా స్పష్టత రాలేదు.. ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా చెన్నకేశవరెడ్డి ఉన్నారు.. ఇప్పటికే ఆయనకు 82 ఏళ్ళ వయస్సు రావటంతో ప్రత్యామ్నాయం ఆలోచిస్తోందట పార్టీ హైకమాండ్.. ఎమ్మిగనూరు నుంచి బుట్టా రేణుక లేదా చెన్నకేశవ రెడ్డి ప్రతిపాదించే అభ్యర్థికి ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.                                     

మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ తానే పోటీ చేయబోనని ప్రకటించారు.. కానీ, ఎమ్మెల్యే వసంతను పిలిచి వైసీపీ అధిష్టానం బుజ్జగించిందట.. మరోసారి పోటీకి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసిందట.. దీంతో.. మరోసారి పోటీకి రెడీ అవుతున్నారట వసంత కృష్ణప్రసాద్. అయితే, రెండో జాబితాలో 30 నియోజకవర్గాల్లో మార్పులు ఉంటాయనే చర్చ సాగుతుండగా.. ఫైనల్‌లిస్ట్‌ వస్తేగానీ.. ఆయా స్థానాల్లో నేతల టెన్షన్‌కు తెరపడేలా లేదు.         

టాప్ హెడ్ లైన్స్

Tadipatri Tension: తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్రించిన నేత
తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్ర
Arnab Cyclone: ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
AP Municipal Elections: పోలింగ్‌కు ముందే 17 చైర్‌పర్సన్ స్థానాల్లో కూటమి ఏకగ్రీవం.. విజేతల పూర్తి వివరాలు
పోలింగ్‌కు ముందే 17 చైర్‌పర్సన్ స్థానాల్లో కూటమి ఏకగ్రీవం.. విజేతల పూర్తి వివరాలు
YS Family Property Issue: యలహంక భూమి షర్మిలదే.. ఆస్తులపై గతంలోనే వైఎస్ విజయమ్మ నోటరీ ప్రకటన!
యలహంక భూమి షర్మిలదే.. ఆస్తులపై గతంలోనే వైఎస్ విజయమ్మ నోటరీ ప్రకటన!

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Convoy Accident: రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
Tadipatri Tension: తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్రించిన నేత
తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్ర
Tips To Focus at Work : ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
Paying e-challan online: ట్రాఫిక్‌ చలాన్‌ కట్టకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేస్తారా? ఆన్‌లైన్‌లో ఇలా చెక్‌ చేయండి!
మీ బండిపై ట్రాఫిక్‌ చలాన్‌ ఉందో, లేదో మీకు తెలుసా? మీ ఫోన్‌లోనే చెక్‌ చేయవచ్చు!
Pushpaka Vimanam Series OTT : లిఫ్ట్‌లో ఒక్కసారి గతంలోకి వెళ్తే! - ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లిఫ్ట్‌లో ఒక్కసారి గతంలోకి వెళ్తే! - ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
మూడున్నర లక్షల అమ్మకాలు దాటిన Tata Altroz.. ధర, మైలేజీ, ఫీచర్లు తెలిస్తే మీకూ కొనాలనిపిస్తుంది!
ఈ కారుకు దేశవ్యాప్తంగా ఫుల్‌ డిమాండ్‌.. టాటా అమ్మే ప్రతి 3 కార్లలో ఒకటి ఇదే!
Embed widget