Weather Updates: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్... ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలోని అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
![Weather Updates: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్... ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు Weather update in andhra pradesh telangana hyderabad amaravati on 29th august 2021 Weather Updates: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్... ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/29/526817201abc96fdcb47b9dc0280e1e2_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలుగు రాష్ట్రల్లో ఆదివారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రాలు ప్రకటించాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని పేర్కొన్నాయి.
ఏపీలో వర్షాలు
ఏపీలో ఆదివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్ తీరానికి సమీపంలో వాయువ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అల్పపీడనం కారణంగా ఒడిశాలోని దక్షిణ ప్రాంత జిల్లాలు, ఏపీలోని ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర జిల్లాలపై ఆవరించిన ఉపరితల ద్రోణి కారణంగా ఆదివారం చాలా చోట్ల తేలిక పాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది.
రాయలసీమలోనూ కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తీరం వెంబడి 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేసింది.
Also Read: Gold-Silver Price: పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో మరింతగా.. తాజా ధరలు ఇలా..
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్- గ్రామీణ, వరంగల్-పట్టణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Also Read: Horoscope Today : ఈ రాశులవారు కొత్త పనులు ప్రారంభించవద్దు…ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి బావుంటంది
Also Read: Covid: పాఠశాలలను వెంటనే తెరవండి.. లేదంటే ముప్పు తప్పదు.. కేంద్రానికి నిపుణుల లేఖ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)