Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న వేడి, గత 200 ఏళ్లలోనే ఈ నెల ప్రత్యేకం! కారణం ఏంటంటే
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో తూర్పు, ఆగ్నేయ దిశ గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు.

ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో తూర్పు, ఆగ్నేయ దిశ గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.
Synoptic features of weather inference for Andhra Pradesh in Telugu Language Dated 19.02.2022. https://t.co/7nB9Q9Y9AG
— MC Amaravati (@AmaravatiMc) February 19, 2022
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ణ ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
‘‘2022 జనవరి గత 200 సంవత్సరాల్లోనే అత్యంత వేడైన జనవరి. ప్రపంచ వ్యాప్తంగా సాధారణ ఉష్ణోగ్రత కంటే 1.45 డిగ్రీలు అధికంగా నమోదయ్యింది. 1980 తర్వాత భూతాపం, అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువైయ్యాయి. అలా చూస్తే ఈ సారి జనవరి నెల ఉష్ణోగ్రతలు ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఇప్పుడే ఇలా ఉంటే ఒక 200 సంవత్సరాల తర్వాత ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో ఒక్క సారి ఊహించుకోగలరు.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ వెల్లడించారు.
తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం అంతా పొడిగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితే మరో మూడు నాలుగు రోజులు ఉండనుందని అంచనా వేశారు.
తెలంగాణలో ఆకాశం పాక్షింగా మేఘాలతో ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలుగా, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. రాష్ట్రంలో నిన్న కొన్ని జిల్లాల్లో చిరు జల్లులు కురిశాయి. అయినా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి.
— IMD_Metcentrehyd (@metcentrehyd) February 19, 2022






















