Weather Latest Update: నేడు ఈ జిల్లాల్లో తీవ్ర గాలులతో ఆరెంజ్ అలర్ట్ - ఐఎండీ హెచ్చరిక
ఏపీలో మొత్తం 478 మండలాల్లో వడగాలులు వీస్తున్నాయని అమరావతి కేంద్రం తెలిపింది.
దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు శనివారం (జూన్ 17) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో పడే అవకాశం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో తీవ్ర వడగాలులు ములుగు, కొత్త గూడెం, ఖమ్మం, జిల్లాల్లో మరియు వడగాలులు కొమరంభీం నిర్మల్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, సూర్యాపేట్ జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రేపు వడగాలులు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ తీవ్ర వడగాలులు నెలకొన్నాయి. ఆదిలాబాద్, హన్మకొండ, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లా్ల్లో అక్కడక్కడ వడగాలుల పరిస్థితులు నెలకొన్నాయి.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 27 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 59 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. వీటితో వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. వీటితో వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఏపీలో మొత్తం 478 మండలాల్లో వడగాలులు వీస్తున్నాయని అమరావతి కేంద్రం తెలిపింది. పార్వతీపురం మన్యంలో 44.87 డిగ్రీలు, విజయనగరంలో 44, అనకాపల్లిలో 43.9, ఏలూరులో 42.2, అల్లూరిలో 42.7, తూర్పుగోదావరిలో 42.5, విశాఖపట్నంలో 41.3, ఎన్టీఆర్‌లో 41.9, గుంటూరులో 41, పలనాడులో 41, బాపట్లలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మరో రెండ్రోజుల పాటు కోస్తాంధ్రలో వేడి గాలులు కొనసాగే అవకాశం ఉంది. నేటి నుంచి రాయలసీమ జిల్లాల్లో వేడిమి వాతావరణ పరిస్థితులు తగ్గే సూచనలు ఉన్నాయి.
ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఏపీలోని శ్రీహరి కోట, పుట్టపర్తి, కర్ణాటకలోని రత్నగరి, కొప్పాల్ వరకూ విస్తరించి ఉన్నాయని వెల్లడించారు. ఈనెల 18 నుంచి నైరుతి పవనాలు ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నాయని, దీంతో రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.