Weather Latest Update: ఇంకో అల్పపీడనం రేపు, తెలంగాణపై ఎఫెక్ట్ ఇలా! ఏపీలో వీరికి హెచ్చరిక: IMD
వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలి ఆ తర్వాతి 24 గంటల్లో బలపడే అవకాశం ఉందని చెప్పారు.

Weather Latest News: ఏపీ, తెలంగాణకు వర్షాల సూచన మరికొద్ది రోజులు ఉండనున్నట్లుగా వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. భారత వాతావరణ విభాగం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా తీర ప్రాంతంలో ఉన్న వాయుగుండం అల్పపీడనంగా మారింది. ఇక ఈ రేపు (ఆగస్టు 13) వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలి ఆ తర్వాతి 24 గంటల్లో బలపడే అవకాశం ఉందని చెప్పారు.
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో 14న మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆ సమయంలో గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) August 11, 2022
హైదరాబాద్ వాతావరణం ఇలా, నైరుతి నుంచి గాలులు
హైదరాబాద్‌లో వాతావరణం ఇలా ఉండే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు ట్వీట్ చేశారు. నగరంలో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. నైరుతి దిశ నుంచి గాలులు (గాలి వేగం గంటకు 14 నుంచి 20 కిలో మీటర్లు) వీచే అవకాశం ఉంది.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నేడు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. అయితే, వర్షాలకు సంబంధించి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. ఈ నెల 14న మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఏపీలో వాతావరణం
రానున్న రెండు, మూడు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర కు భారీ వర్షాల ముప్పు ఉందని వాతావరణ శాఖ అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న 48 గంటల పాటు కోస్తాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేసింది. భారీ ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ శాఖ పేర్కొంది.
అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. తీరం వెంబడి 45 నుంచి 55 కిలో మీటర్లు లేదా కొన్ని చోట్ల 65 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తీరం వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ అధికారులు హెచ్చరించారు.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల సంభవించే అవకాశం ఉంది. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
Fisherman warnings for Andhra Pradesh dated 11.08.2022 pic.twitter.com/dbCGPf95NW
— MC Amaravati (@AmaravatiMc) August 11, 2022
దక్షిణ కోస్తాంధ్రలో
తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల సంభవించే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

