News
News
X

BJP Vishnu : అమిత్ షాను కలిసినందుకే విమర్శిస్తారా ? జూ.ఎన్టీఆర్‌కు 18 కోట్ల బీజేపీ సభ్యుల మద్దతు ఉంటుందన్న ఏపీ బీజేపీ !

అమిత్ షాను కలిశారని ఎన్టీఆర్‌ను విమర్శిస్తే బీజేపీ అండగా ఉంటుందని విష్ణువర్దన్ రెడ్డి ప్రకటించారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న మంత్రులకు మానసిక చికిత్స అందించాలని డిమాండ్ చేశారు.

FOLLOW US: 
 
BJP Vishnu :   అమిత్‌షాతో జూనియర్‌ ఎన్‌టీఆర్‌ సమావేశం కావడాన్ని వైఎస్ఆర్‌సీపీ విమర్శిస్తే  ఆయనకు 18 కోట్ల భాజపా సభ్యులు అండగా ఉంటారని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.  రాజకీయాలతో సంబంధం లేని జూనియర్‌ ఎన్‌టిఆర్‌ పేరు మార్పు విషయంలో చేసిన ట్వీట్‌లో ఏం తప్పుందని ఆయన ప్రశ్నించారు. ఏపీ బీజేపీ నిర్వహిస్తున్న ప్రజాపోరు సభల్లో పాల్గొనేందుకు విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడారు.  నాడు  పోలవరం పేరు , నేడు యూనివర్సిటీ ల పేర్లను పెట్టుకుంటూ, మార్చుకుంటూ వివాదాలకు కారణం అవుతున్నారని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  ప్రజలు నేటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలు గమనిస్తున్నారుని గుర్తు చేశారు. 

ఎన్టీఆర్, వైఎస్ఆర్ పథకాలకు తమ పేర్లు పెట్టుకోలేదు !

ఎన్‌టిఆర్‌, వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏ పథకాలకు తమ పేర్లు పెట్టుకోలేదని.. కాంగ్రెస్‌ ఎన్నో ప్రభుత్వ సంస్థలకు పేర్లు పెట్టుకుంటే భాజపా ఏనాడూ పేర్లు మార్చలేదని విష్ణువర్దన్ రెడ్డి గుర్తు చేశారు.  ప్రజలను ఊచకోత కోసిన ఔరంగజేబు పేరును ఢల్లీిలో మార్చి దానికి అబ్దుల్‌ కలాం పేరు పెట్టామని.. కాంగ్రెస్‌ పార్టీ పట్టించుకోకుంటే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, సర్ధార్‌ వల్లభాయ్‌పటేల్‌లకు గౌరవం కల్పించి స్మారక చిహ్మాలు నిర్మించామన్నారు.  విశాఖ కింగ్‌జార్జి ఆసుపత్రి పేరు మార్చాలి... గుంటూరు జిల్లా  టవర్‌ సెంటర్‌ పేరు మార్చి దేశభక్తుల పేర్లు పెట్టాలని డిమాండ్ల చేశారు. 

News Reels

మంత్రులకు మానసిక చికిత్స అందించాలి !

రాష్ట్ర మంత్రులు నోరుజారి, ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ాఅదుపు తప్పి, సిగ్గులేకుండా పిచ్చిపట్టిన వారి వలే మాట్లాడుతున్నారని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఉపముఖ్య మంత్రి తమను ప్రశ్నిస్తే సంక్షేమ పథకాలు ఆపుతామంటారు. సిదిరి అప్పలరాజు ఓట్ల కోసం కాళ్లు పట్టుకుంటామంటారు... బొత్స సత్సనారాయణ పాదయాత్రను 5 నిమిషాల్లో ఆపేస్తానంటున్నారు. అంబటి రాంబాబు అడ్డగోలుగా ఎదుటివారిని దూషిస్తున్నారు. ఎదుటివారిని బూతులు తిట్టడం అర్హతగా భావిస్తున్నారా? .. ఇలాంటి వారినందర్నీ ముఖ్యమంత్రి అదుపులో పెట్టాలన్నారు. వారికి మానసిక వైద్య చికిత్స అందించాలని విష్ణువర్దన్ రెడ్డి సెటైర్లు వేశారు.  ప్రజలు కట్టే పన్నులతో సకల సౌకర్యాలు, పదవులూ అనుభవిస్తూ, వారినే దూషిస్తారా? అని విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రుణయాప్‌ల కట్టడికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలి !

మంత్రుల విషయంలో సిఎం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.  ఎపీలో రుణ యాప్‌ల వత్తిడి కారణంలో 26 మంది నిర్భాగ్యులు ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులు, అల్పాదాయాల వారు రుణయాప్‌ల ఉచ్చులో పడి అవసరాల నిమిత్తం రుణాలు తీసుకుని వారి వత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  ఈ విషయంలో విచారణ చేపట్టి నేరస్తులను చట్టప్రకారం శిక్షించాలని..  తక్షణం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి యాప్‌లను అదుపు చేయడానికి నూతన ఐటీ చట్టం చేయాలని డిమాండ్ చేశారు.  దసరా పండుగ సందర్భంగా ఆలయాల్లో రూ.300, రూ.500  ప్రత్యేక దర్శన టిక్కెట్ల పేరుతో చేస్తున్న  దోపిడిని ఆపాలన్నారు. కోర్సులు పూర్తయిన వారికి జగనన్న విద్యా, వసతి దీవెన పథకాల ద్వారా ఫీజులు విడుదల చేయక ఆపివేయడంతో సర్టిఫికెట్లు అందక ఇబ్బందిపడుతున్నారు. కోర్సు పూర్తయిన వారికి బకాయి ఫీజులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 

Published at : 27 Sep 2022 09:06 PM (IST) Tags: BJP Jr NTR Vishnuvardhan Reddy Jr. NTR Prajaporu Sabhas

సంబంధిత కథనాలు

Vijayawada Pipe Leak: స్విమ్మింగ్ పూల్ లో క్లోరిన్ పైప్ లీక్, చిన్నారులకు అస్వస్థత

Vijayawada Pipe Leak: స్విమ్మింగ్ పూల్ లో క్లోరిన్ పైప్ లీక్, చిన్నారులకు అస్వస్థత

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 12న ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 12న ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Breaking News Live Telugu Updates: హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత, నాలుగు గంటలుగా రోడ్డుపై కూర్చొని షర్మిల నిరసన  

Breaking News Live Telugu Updates:  హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత, నాలుగు గంటలుగా రోడ్డుపై కూర్చొని షర్మిల నిరసన  

MP GVL On Visakha Port : విశాఖ పోర్టు కాలుష్య కట్టడికి చర్యలు చేపట్టండి, కేంద్రాన్ని కోరిన ఎంపీ జీవీఎల్

MP GVL On Visakha Port : విశాఖ పోర్టు కాలుష్య కట్టడికి చర్యలు చేపట్టండి, కేంద్రాన్ని కోరిన ఎంపీ జీవీఎల్

టాప్ స్టోరీస్

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?