అన్వేషించండి

విశాఖ బీచ్‌ను క్లీన్ చేశారు- రికార్డుల్లోకి ఎక్కారు

విశాఖ మెగా బీచ్ క్లీనింగ్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది. అమెరికాకు చెందిన పార్లే ఫర్ ది ఓషన్ సంస్థతో కలిసి ఏపీ ప్రభుత్వం ఈ రికార్డు నెలకొల్పింది.

Vizag Beach Cleaning: విశాఖ సముద్ర తీర ప్రాంత పరిశుభ్రతలో జీవీఎంసీ వండర్ బుక్ ఆఫ్ రికార్డు చోటు పొందిందని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీషా ఒక ప్రకటనలో తెలిపారు.

వైజాగ్ తీరంలో మెగా క్లీనింగ్ ప్రోగ్రాం

సముద్ర తీర ప్రాంతంలోని వ్యర్థాలను తొలగించి క్లీన్ బీచ్ నెలకొల్పే లక్ష్యంగా విశాఖపట్నంలో మెగా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, న్యూయార్క్ కు చెందిన పార్లే ఫర్ ది ఓషన్ ఎన్జీవో ప్రతినిధులు సంయుక్తంగా సాగర తీర పరిశుభ్రతకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కూడా భాగం అయింది. మొత్తం 22 వేల 157 మంది పౌరులు స్వచ్ఛందంగా ఈ పరిశుభ్రతా కార్యక్రమంలో పాల్గొన్నట్లు జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మీషా తెలిపారు. విశాఖ సముద్ర తీరంలో ఇంత భారీ ఎత్తున మెగా క్లీనింగ్ ప్రోగ్రాం చేపట్టడం గొప్ప విషయమని అన్నారు. 

రికార్డుల్లోకి ఎక్కిన శుభ్రతా కార్యక్రమం

ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్ నాథ్, విశాఖ నగర మేయర్ గొలగిని వెంకట హరి కుమారి, కలెక్టర్, పోలీసు కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు సుమారు 28 కిలోమీటర్ల పొడవునా ఈ మెగా క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అతి పెద్ద శుభ్రత కార్యక్రమం వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు పొందిందని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి . లక్ష్మీషా తెలిపారు.

ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని తల పెట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఇతర మంత్రులను, అధికారులను, పోలీసు సిబ్బందికి జీవీఎంసీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ రికార్డును జీవీఎంసీ సొంతం చేసుకోవడం పట్ల నగర  ప్రజలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేట్ అధికారులు అందరికీ కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. 

ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఉండవిక

ఏపీ వ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. ఇకపై రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు పెట్టకూడదని, గుడ్డతో తయారు చేసినవి మాత్రమే పెట్టాలని సీఎం జగన్ పిలుపును ఇచ్చారు. వైజాగ్ లో మెగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమం తర్వాత, బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. 

బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించిన ఒక్క రోజే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు 76 టన్నుల ప్లాస్టిక్ ను సముద్రం నుంచి తొలగించారని సీఎం జగన్ అన్నారు. ఆర్థిక పురోగతి, పర్యావరణ పరిరక్షణలు నాణేనికి రెండు దిక్కులు అని.. పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఆర్థిక పురోగతి సాధించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

ఈ సందర్భంగా అమెరికా సంస్థ పార్లే ఫర్ ది ఓషన్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. పార్లే ఫర్ ది ఓషన్ సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీస్తుంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget