News
News
X

Srikakulam: ఫోన్లోనే గర్భిణీకి డాక్టర్ డెలివరీ! ఇష్టమొచ్చినట్టు బిడ్డని బయటికి లాగేసిన సిబ్బంది - శ్రీకాకుళం జిల్లాలో ఘోరం

ఆసుపత్రికి రాకుండా ఫోన్లోనే వైద్యం చేసేశారు. దీంతో ఇక్కడి సిబ్బంది తెలిసీతెలియని వైద్యంతో బిడ్డను ఇష్టమొచ్చినట్టు బయటకు లాగేసి ఊపిరి తీసేశారు.

FOLLOW US: 
Share:

వైద్యో నారాయణో హరీ అంటారు. భగవంతుడు ఆయువు పోస్తే ఆపత్కాలంలోప్రాణాలు నిలబెట్టేవారు వైద్యులు అని అర్థం. ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటున్న వైద్యులు ఎందరో ఉన్నారు కానీ వారిలో నరరూప రాక్షసులూ ఉన్నారు. డబ్బే ప్రధానంగా భావిస్తూ వైద్యం చేస్తున్నారు. ఒక వైపు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ మరో వైపు సొంత ఆసుపత్రులూ నడుపుతున్నారు దీంట్లో తప్పేమీ లేదు కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారికి వైద్యం చేయటం బాధ్యత కదాఆ బాధ్యతను పక్కనపెట్టి నిండు ప్రాణాలను బలిగొంటున్నారు. ఇందులో పలాస ఆసుపత్రిలో ఓ అడుగు ముందుంది. ఇక్కడి వైద్యులకు బాధ్యత లేదు. అంతా ఆమ్యామ్యాల పర్వమే! వచ్చిన రోగి ఆర్థిక స్థితిగతులను దిగువస్థాయి సిబ్బందితో అంచనా వేయిస్తున్నారు. వారి బ్యాక్ గ్రౌండ్ కూడా చెక్ చేసుకుంటున్నారు. వారు నిరుపేదలు వైద్యం కోసం వచ్చారని తెలిస్తే చాలు పట్టించుకోవటంమానేస్తున్నారు!!

వాస్తవం ఇదీ
వాస్తవం ఏమిటంటే ఆసుపత్రికి రాకుండా ఫోన్లోనే వైద్యం చేసేశారు. దీంతో ఇక్కడి సిబ్బంది తెలిసీతెలియని వైద్యంతో బిడ్డను ఇష్టమొచ్చినట్టు బయటకు లాగేసి ఊపిరి తీసేశారు. విషయం మళ్లీ వైద్యురాలికి చేరవేశారు. ఆమె వచ్చిన వెంటనే డ్యూటీ డాక్టర్‌కు అక్కడి సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఆమె తెలివిగా ముందుగానే పెట్టుకున్న సెలవు దరఖాస్తును తెరమీదికి తెచ్చారు. తాను సెలవులో ఉన్నానని కలరింగ్ ఇచ్చారు. బిడ్డ చనిపోయిందని తెలియటంతో బాధిత కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చామని, తాను ఒక జర్నలిస్టునని చెప్పినా అక్కడి వారి మనసు కరగలేదు. వైద్యురాలు వస్తున్నారంటూ మభ్యపెట్టారు. ముందుగానే చెబితే అప్పో సప్పో చేసి, వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లి బిడ్డను బతికించుకునేవారమంటూ గుండెలవిసేలా రోదించడం తప్ప వారు ఏమీ చేయలేకపోయారు.

పలాసకు చెందిన ఓ పేద జర్నలిస్టు రాజాం సురేష్. తన భార్యకు పురిటి నొప్పులు రావటంతో పలాసలోని సర్కారీ దవాఖానాకు తీసుకువెళ్లారు. వెళ్లిన వెంటనే అక్కడి సిబ్బంది పెద్ద బిల్డప్ లు ఇచ్చి ఏదో వైద్యం చేసేస్తున్నట్టు ఠాగూర్ సినిమాను తలపించేలా హడావుడి చేశారు. అప్పటి వరకు డ్యూటీ డాక్టర్ సెలవులో ఉన్నారని చెప్పకుండా డాక్టర్ ఐదు నిమిషాల్లో వచ్చేస్తారు అంటూ వైద్యం ప్రారంభించేశారు. అటూ ఇటూ ఓ గంటపాటు హడావుడి చేసి, తెలిసీ తెలియని వైద్యం చేసిపసిగొడ్డు ప్రాణం తీశారు. ఆ తరువాత డాక్టర్ సెలవులో ఉన్నారని, ఎనస్థీషియన్ కూడా లేరని వేరే చోటకు తీసుకువెళ్లాలని చావు కబురు చల్లగా చెప్పారు.

ఎక్కడో ఉంటూ..
పలాసలో వైద్యులు ఆడిందే ఆట పాడిందే పాట ఎక్కడో వైద్యం చేసుకుంటూఫోన్ల ద్వారా దిగువ స్థాయి సిబ్బందికి సూచనలు ఇస్తూ కాలం గడిపేస్తున్నారు. ఇక్కడ ఇంకో రకమైన తెలివితేటలు కూడా ఉపయోగిస్తున్నారు. ముందుగానే లీవ్ లెటర్ ఆసుపత్రిలో ఉంచుతున్నారు సొంత క్లినిక్‌లు, సొంత పనులపై ఉంటూ అంతా బాగున్నంత కాలం డ్యూటీలో ఉన్నట్టే లెక్క, ఏదైనా జరగరానిది జరిగితే మాత్రం మేం సెలవులో ఉన్నాం అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధానం పలాస ఆసుపత్రికి ఆనవాయితీగా మారింది. ఎందుకంటే ఇక్కడ పర్యవేక్షించే నాథుడే కరువయ్యాడు. అడిగేవాడే లేడు మంత్రి అప్పలరాజు ఎప్పుడైనా తనిఖీకి వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేస్తే ఒక్క రోజే పనిచేస్తారు ఆ తరువాత షరా మామూలే అని గ్రామస్థులు చెబుతున్నారు.

అడిగే వాడే లేడు
పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో అరాచకం రాజ్యమేలు తోంది. ఎంతో సమున్నత ఆశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారీ వైద్యాన్ని బలోపేతం చేస్తున్నారు. కానీ ఇక్కడి వారికి ఇవేవీ పట్టటం లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దొరికినకాడికి దోచుకుంటున్నారు. వైద్యులు సమయానికి రారు. వచ్చినా వైద్యం చేయరు. సిబ్బందిదీ అదే తీరు డ్రగ్ స్టోర్ మందులు ఉండవు ముందే అమ్మేస్తే ఎందుకుంటాయి అంతా అస్తవ్యస్తం. ఇక్కడి ఆసుపత్రికి అభివృద్ధి కమిటీప్రతినిధిదే హవా. ఆయన సూచనమేరకే ఏదైనా జరగాలి. ఆయనను ప్రసన్నం చేసుకుంటే అంతా సవ్యంగా సాగిపోతుంది. దీంతో ఇక్కడి వైద్యులు సిబ్బంది ఆ పనిలోనే ఉంటే వైద్యాన్ని గాలికొదిలేశారు.

వైద్యుల నిర్లక్ష్యమే కారణం - రాజాం సురేష్, బాధితుడు
నా భార్యకు పురిటినొప్పులు రావటంతో ఆసుపత్రికి తీసుకువచ్చాను. అయితే వైద్యులు లేరన్న విషయం ముందుగా చెప్పలేదు. ఐదు నిమిషాల్లో వచ్చేస్తారు అంటూ కాలయాపన చేశారు. వైద్యురాలితో ఫోన్లో మాట్లాడుతూతెలిసీ తెలియని వైద్యం చేసి నా బిడ్డను చంపేశారు. ఇది పూర్తిగా ఇక్కడి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే జరిగింది. దీని పోరాడుతా. నా లామరొకరి అన్యాయం జరగకూడదు. ఆర్థిక స్థోమత లేకే సర్కారీ దవాఖానాకు వచ్చాం. ముందే చెప్పి కంటే అప్పో సప్పో చేసి వేరే చోటకు వెళ్లిపోయేవాళ్లం. ఈ ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలి.

సెలవులో ఉన్నా - అశ్విని, డ్యూటీ డాక్టర్, పలాస ప్రభుత్వ ఆసుపత్రి
గర్భిణి ఆసుపత్రికి వచ్చిన రోజు సెలవులో ఉన్నానని డ్యాటీ డాక్టర్ అశ్విని చెప్పారు. అయినా సిబ్బంది ఫోన్ చేయటంతో కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చానన్నారు. అయినప్పటికీ బిడ్డ చనిపోయిందని చెప్పారు.

అనస్థీషియన్ లేరు - డాక్టర్ చిన్నంనాయుడు, సూపరింటెండెంట్
పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో అనస్థీషియన్ లేకపోవటం వల్ల సిజేరియన్ చెయ్యటం కుదరలేదు. డ్యూటీ డాక్టర్ సెలవులో ఉన్నారు. అయినప్పటికీ సిబ్బంది కొంతమేర వైద్యసేవలందించారు.

బాధాకరం, విచారణ జరిపిస్తాం - డీసీహెచ్ డాక్టర్ జరజాపు భాస్కరరావు
ఈ సంఘటన బాధాకరమని, విచారణ జరిప్తామని డీసీహెచ్ డాక్టర్ జె. భాస్కరరావు చెప్పారు. వైద్యుల నిర్లక్ష్యం ఉందని తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రికి వచ్చిన వారికి వైద్యం చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని అన్నారు. ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా సహించేది లేదని స్పష్టం చేశారు.

Published at : 08 Mar 2023 12:05 PM (IST) Tags: Srikakulam News Palasa Government hospital Government doctor baby delivery Srikakulam baby death

సంబంధిత కథనాలు

APOSS SSC Hall Tickets: ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

APOSS SSC Hall Tickets: ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

AP Skill Development: 'స్కిల్' డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి అమర్నాథ్

AP Skill Development: 'స్కిల్' డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి అమర్నాథ్

Anakapalli Tribals: సాయంత్రం అయితే అంధకారమే - విశాఖ ఏజెన్సీలో గిరిజనుల దీన గాథ

Anakapalli Tribals: సాయంత్రం అయితే అంధకారమే - విశాఖ ఏజెన్సీలో గిరిజనుల దీన గాథ

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు,  ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

టాప్ స్టోరీస్

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా