అన్వేషించండి
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - పలు రైళ్లు రద్దు, కొన్ని సర్వీసులు రీషెడ్యూల్
Andhrapradesh News: విజయవాడ, వాల్తేరు డివిజన్లలో పనుల కారణంగా కొన్ని రైళ్లు రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వాల్తేరులో 5, 6 తేదీల్లో రైళ్లు రద్దు చేశారు.

పలు రైళ్లు రద్దు చేసిన అధికారులు
Source : Other
Some Trains Cancelled And Some Trains Reschduled: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. విజయవాడ (Vijayawada), వాల్తేరు డివిజన్లలో (Waltair Division) పనుల కారణంగా కొన్ని రైళ్లు రద్దు చేయగా.. మరికొన్నింటిన రీషెడ్యూల్ చేశారు. విజయవాడ డివిజన్‌లో 30 రైళ్లు రద్దు కాగా.. వాల్తేరు డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా 10 రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే 4 సర్వీసులు రీషెడ్యూల్ చేసినట్లు చెప్పారు. పలాస - విజయనగరం ప్రధాన లైన్‌లో వంతెన పునర్నిర్మాణ పనులు, ఇతర భద్రతా సబంధింత ఆధునీకరణ పనుల నిమిత్తం పలు రైళ్లు రద్దు చేసినట్లు వెల్లడించారు.
వాల్తేరు డివిజన్ - రద్దైన రైళ్ల వివరాలు
- ఈ నెల 5న (శుక్రవారం) పలాస - విశాఖ - పలాస ప్యాసింజర్ రైలు (07470/07471) , అలాగే విశాఖ - గుణుపూర్ - విశాఖ ప్యాసింజర్ (08522/08521) రైలు రద్దు చేశారు.
- ఈ నెల 5న విశాఖ - బ్రహ్మపూర్ ప్యాసింజర్ (08532), ఈ నెల 6న బ్రహ్మపూర్ - విశాఖ ప్యాసింజర్ (08531) రైలు రద్దు. అలాగే, ఈ నెల 5న విశాఖ - భువనేశ్వర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (22820), భువనేశ్వర్ - విశాఖ ఇంటర్‌సిటీ (22819) రైలు రద్దు చేశారు.
- ఈ నెల 6న భవానీపట్నం - విశాఖపట్నం ప్యాసింజర్ రైలు (08503) రైలు రద్దైంది.
విజయవాడ డివిజన్‌లో..
అటు, విజయవాడ డివిజన్‌లోనూ నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా ఆగస్ట్ నెలలో పలు రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
- ఆగస్ట్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ విజయవాడ - భద్రాచలం (07979), భద్రాచలం - విజయవాడ (07278/07279) రైళ్లు రద్దు. తెనాలి - విజయవాడ (07575), ఆగస్ట్ 3 నుంచి 10 వరకూ తెనాలి - విజయవాడ (07630), విజయవాడ - గుంటూరు (07464/07465). అలాగే గుంటూరు - సికింద్రాబాద్ (17201/17202) రైళ్లు రద్దయ్యాయి. అలాగే, ఆగస్ట్ 5 నుంచి 10 వరకూ విజయవాడ - చెన్నై సెంట్రల్ (12711/12712) రైళ్లు రద్దు చేశారు.
- ఆగస్ట్ 3 నుంచి 10 వరకూ విజయవాడ - గూడూరు (07500), ఆగస్ట్ 4 నుంచి 11 వరకూ గూడూరు - విజయవాడ (07458) రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి.
- ఆగస్ట్ 5 నుంచి 12 వరకూ విజయవాడ - మాచర్ల (07781/07782), అలాగే విజయవాడ - తెనాలి (07629) రైళ్లు రద్దు.
- ఆగస్ట్ 5 నుంచి 10 వరకూ విజయవాడ - గుంటూరు (07464/07465), అలాగే గుంటూరు - విజయవాడ (07755/07756), డోర్నకల్ - విజయవాడ (07755) రైలు రద్దు చేశారు.
- ఆగస్ట్ 3 నుంచి 10వ తేదీ వరకూ నర్సాపూర్ - విజయవాడ (17270), విజయవాడ - బిట్రగుంట (07978) రైలు రద్దు.
- ఆగస్ట్ 3 నుంచి 11 వరకూ బిట్రగుంట - చెన్నై సెంట్రల్ (17237), బిట్రగుంట - చెన్నై సెంట్రల్ (17238), విజయవాడ - హుబ్లీ (17329/17330) రైళ్లు రద్దయ్యాయి. ఆగస్ట్ 5 నుంచి 11 వరకూ విశాఖ - కడప (17487/17488) రైలు రద్దు చేశారు.
దారి మళ్లించిన రైళ్లు
- ఆగస్ట్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ సికింద్రాబాద్ - విశాఖ (12740), ఆగస్ట్ 4వ తేదీన గాంధీనగర్ - విశాఖ (20804), ఆగస్ట్ 7న ఓక - పూరి (20820).
- ఆగస్ట్ 4, 7 తేదీల్లో నిజాముద్దీన్ - విశాఖపట్నం (12804), ఆగస్ట్ 2 నుంచి 10 తేదీ వరకూ ఛత్రపతి శివాజీ టెర్మినల్ - భువనేశ్వర్ (11019) రైళ్లను రాయనపాడు మీదుగా దారి మళ్లించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion