మోదీ, జగన్ కలిసి ఉన్న టైంలోనే యుద్ధం మొదలు పెట్టిన పవన్
జగనన్న మోసం అంటూ క్యాంపెయిన్ స్టార్టర్ట్ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.
ప్రధానమంత్రి మోదీ పర్యటన ఇంకా ముగియలేదు. ఆంధ్రాయూనివర్శిటీలో జరుగుతున్న సభావేదికపై నుంచి సీఎం జగన్ ఇంకా దిగనే లేదు. అప్పుడే జనసేన అధినేత పవన్ కల్యాణ్.... పోరాటం మొదలు పెట్టారు. జగనన్న మోసం అంటూ క్యాంపెయిన్ స్టార్టర్ట్ చేశారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న జగనన్న కాలనీలపై జనసేన ఫైట్ స్టార్ట్ చేసింది. ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు ఈ పథకంలో ఉన్న లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో ఈ పథకం సక్రమంగా జరిగిపోయిందని... లబ్ధిదారులకు న్యాయం జరగిపోయిందని ప్రకటనలు చేస్తోందని... వాస్తవ రూపంలో అంత సీన్ లేదంటోందన జనసేన. అందుకే జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
'జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు' జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమం.
— JanaSena Party (@JanaSenaParty) November 12, 2022
జగనన్న కాలనీల పేరిట పేదలకు జరిగిన మోసాన్ని నిలదీయండి..#JaganannaMosam pic.twitter.com/1lAlCyuI8A
#Jaganannamoosam అనే హ్యాష్ ట్యాగ్‌తో ఈ క్యాంపెయిన్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్టార్ట్ చేశారు. ప్రధాని మోదీ, సీఎం జగన్ సభ వైజాగ్‌లో జరుగుతున్న టైంలోనే క్యాంపెయిన్ ప్రారంభించారు. అది కూడా వైజాగ్ నుంచి ఈ ప్రచారం మొదలు పెట్టారు. 12,13,14 తేదీల్లో పార్టీ కార్యక్రమాలకు పిలుపునిచ్చారు పవన్. జగనన్న కాలనీల్లో అనేక అరాచకాలు జరిగాయని.. ఇది రాష్ట్రంలోనే అతి పెద్ద స్కాం అని విమర్శిస్తోంది జనసేన. లబ్ధిదారుల కేటాయింపు పారదర్శకంగా జరగ లేదని ఆరోపిస్తోన్న జనసేన... సోషల్ ఆడిట్ చేయనుంది. క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాస్తవ పరిస్థితులను పరిశీలించనుంది.
రాష్ట్రంలోనే అతి పెద్ద స్కాం జగనన్న కాలనీలు
— JanaSena Party (@JanaSenaParty) November 9, 2022
అధికార పార్టీ నాయకులు కోట్లు దోచుకున్నారు
ఈ నెల 12, 13, 14 తేదీల్లో 'జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు' పేరుతో కార్యక్రమం#JaganannaMosam హ్యాష్ ట్యాగ్ తో ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేయండి
Video Link: https://t.co/pEj9OjqvFj pic.twitter.com/kQLAAmjvu1
కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణానికి ఇచ్చిన రూ.1260 కోట్లు ఎవరు మింగేశారు అంటూ ప్రశ్నించడం స్టార్ట్ చేసింది. http://G.O.Ms.No.8 ప్రకారం మంజూరైన ఇళ్లు 28 లక్షలు మంజూరు చేస్తే... డి- ఫ్యాక్టో సీఎమ్ లెక్కల ప్రకారం నిర్మిస్తున్న ఇళ్లు 21 లక్షలేనని.. మిగతా ఇళ్లు ఏమైనట్టు అని జనసేన నిలదీసింది.
* కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణానికి ఇచ్చిన రూ.1260 కోట్లు ఎవరు మింగేశారు?
— JanaSena Party (@JanaSenaParty) November 12, 2022
* https://t.co/te89j3DtQA.8 ప్రకారం మంజూరైన ఇళ్లు 28 లక్షలు
డి- ఫ్యాక్టో సీఎమ్ లెక్కల ప్రకారం నిర్మిస్తున్న ఇళ్లు 21 లక్షలు. #JaganannaMosam pic.twitter.com/jBATB1us5u