News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bandaru Satyanarayana: బండారు సత్యనారాయణ అరెస్టు, విశాఖ నుంచి గుంటూరుకు తరలింపు!

సీఎం జగన్, మంత్రి రోజాను అసభ్య పదజాలంతో దూషించారనే కేసులో గుంటూరు పోలీసులు బండారును అరెస్టు చేశారు. సీఎం, మంత్రిని దూషించినందుకు గానూ ఆయనపై రెండు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. నేడు (అక్టోబరు 2) ఉదయం నుంచి విశాఖపట్నంల పరవాడలోని బండారు సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్, మంత్రి రోజాను అసభ్య పదజాలంతో దూషించారనే కేసులో గుంటూరు పోలీసులు బండారును అరెస్టు చేశారు. సీఎం, మంత్రిని దూషించినందుకు గానూ ఆయనపై రెండు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఉదయం ఆయన ఇంటికి పోలీసులు చేరుకున్నారనే సమాచారం రాగానే టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పోలీసులను నిలువరించారు. ఈ క్రమంలో ఉదయం నుంచి ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

అంతకుముందు మాజీ మంత్రి బండారుకు 41a,42b కింద పోలీసులు నోటీసులు అందజేశారు. సత్యనారాయణ మూర్తి తన ఇంటి తలుపులు తెరవలేదు. టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగడంతో తమకు ఇష్టం వచ్చిన రీతిలో వారిని చెదరగొట్టారు. చివరకు ఇంటి తలుపులు బద్దలు కొట్టి నోటీసులు అందజేశారు. 41ఏ, 41బీ సెక్షన్ల కింద నోటీసులు అందజేసినట్లు పోలీసులు వెల్లడించారు.

బండారుకు నారా లోకేశ్ ఫోన్

ఉద్రిక్తతల వేళ బండారు సత్యనారాయణ మూర్తికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలని.. పోరాటాన్ని కొనసాగించాలని లోకేశ్ ఆయనకు చెప్పారు. అక్రమ కేసులు పెట్టే పోలీసులు భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని లోకేశ్ హెచ్చరించారు. వైఎస్ఆర్ సీపీ తొత్తుల్లా వ్యవహరించే ప్రతి అధికారి వివరాలు నమోదు చేయాలని బండారు సత్యనారాయణ మూర్తికి సూచించారు.

పోలీసులకు ఫిర్యాదు
బండారు సత్యనారాయణ మూర్తి సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏ నోటీసూ ఇవ్వకుండా రాత్రి నుంచి పోలీసులు తమను నిర్బంధించారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డీఎస్పీ సత్యనారాయణ, పోలీసులు తమను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. ఫిర్యాదు పత్రాన్ని స్వయంగా వెళ్లి స్టేషన్ లో అందించారు. 

రోజా బ్లూ ఫిల్మ్‌లు ఉన్నాయన్న బండారు 
నందమూరి, నారా కుటుంబాలపై వైసీపీ మంత్రి రోజా చేసిన అమర్యాద వ్యాఖ్యలను ఖండిస్తూ రెండు రోజుల కిందట మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రోజాపై ఘాటు విమర్శలు చేశారు. ‘ఎన్టీఆర్ కుటుంబంపై, భువనేశ్వరి, బ్రాహ్మణీలపై మాట్లాడే అర్హత నీకు లేదు. రోజా... నువ్వు సినిమాల్లో ఎలా నటించావో నాకు తెలుసు. నీ చరిత్ర ఎవరికి తెలియదు. నీ బాగోతం బయటపెడితే నీ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటారు. ఇవాళ నీతి సూత్రాలు, ప‌తివ్రత కామెంట్స్ చేస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌మ వ‌ద్ద నీ పూర్తి బండారం ఉంద‌న్నారు. రోజా గ‌తంలో బ్లూ ఫిల్ముల‌లో న‌టించింద‌ని, దానికి సంబంధించిన ఆధారాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌న్నారు. ఆనాడు మిర్యాల‌గూడ‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌చ్చిన సంగతి మ‌రిచి పోయావా అని ప్ర‌శ్నించారు. ఎల‌క్ష‌న్స్ కోసం వ‌చ్చి ఎవ‌రి వ‌ద్ద ప‌డుకున్నావో, ఎన్ని లాడ్జీలు తిరిగావో త‌మకు తెలుస‌ని అన్నారు. అన్ని వివ‌రాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే. ఈ కామెంట్లు వైరల్‌గా మారడంతో..  మహిళా కమిషన్ స్పందించింది.

Published at : 02 Oct 2023 08:04 PM (IST) Tags: Guntur Police Bandaru Satyanarayana Vizag News VisakhaPatnam

ఇవి కూడా చూడండి

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Inter Exams: ఏపీలో మార్చి 1 నుంచి ఇంటర్, 21 నుంచి టెన్త్ పరీక్షలు - షెడ్యూలుపై త్వరలో స్పష్టత

Inter Exams: ఏపీలో మార్చి 1 నుంచి ఇంటర్, 21 నుంచి టెన్త్ పరీక్షలు - షెడ్యూలుపై త్వరలో స్పష్టత

Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్‌ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి

Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్‌ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి

టాప్ స్టోరీస్

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు

Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్‌- తప్పులేదన్న సజ్జనార్‌

Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్‌- తప్పులేదన్న సజ్జనార్‌