Gangavarm Issue : పోర్టు యాజమాన్యానికి ఐదు రోజుల గడవు - నిరసన తాత్కాలికంగా వాయిదా వేసిన కార్మికులు!
గంగవరం పోర్టు కార్మికులు నిరసనను ఐదు రోజులు వాయిదా వేసుకున్నారు. సమస్యల పరిష్కారానికి ఐదు రోజుల గడువు అడిగారు.
Gangavarm Issue : విశాఖలో అలజడి రేపిన గంగవరం పోర్టు నిర్వాసితులు, కార్మికుల నిరసన ఐదురోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేశారు. గంగవరం పోర్టు కార్మికులు.. నిర్వాసితుల డిమాండ్స్ పై తదుపరి నిర్ణయం కోసం 5 రోజుల టైం కావాలని యాజమాన్యం అడిగింది. దీతో కార్మికులు తాత్కాలికం గా నిరసన వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆందోళనలతో అలదడి రేగడంతో చివరికి పోర్టు యజమాన్యం ఐదు డిమండ్లు అంగకిరంచింది.
గంగవరం పోర్టు యాజమాన్యం కార్మికులు చేస్తున్న డిమాండ్లలో ఐదింటిని అంగీకరించింది. కార్మికుల డిమాండ్లకు రాత పూర్వక హామీ ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. అదానీ పోర్ట్ యాజమాన్యం తో మాట్లాడిన అనంతరం ఆర్ డీ ఓ హుస్సేన్ సాహెబ్ మీడియాతో మాట్లాడారు. ప్రతీ కార్మిక కుటుంబానికి వన్ టైం పేమెంట్ కింద 10 వేలు వెంటనే చెల్లించే విధంగా అంగీకరించిందని ఆర్డీవో తెలిపారు. వార్షిక ఇంక్రిమెంట్ ఐదు శాతంతో పాటు అదనంగా ఏప్రిల్ 24 నుంచి ప్రతీ కార్మికునికి వెయ్యి ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. డెత్ బెనిఫిట్స్ కింద ఈ ఎస్ ఐ నిబంధనల మేరకు 25 లక్షలు ఇచ్చేందుకు అంగీకారించారు. తొలగించిన ఐదు మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అదానీ యాజమాన్యం రాకముందు తొలగించిన ఇద్దరు కార్మికులను తీసుకునేందుకు అంగీకరించలేదని ఆర్డీవో చెప్పారు. దీక్ష లు చేస్తున్న సమయానికి జీతాలు ఇచ్చేందుకు కూడా యాజమాన్యం అంగీకరించలేదు. యాజమాన్యం తో సంబంధం లేకుండా ప్రభుత్వ హామీ లతో బాంక్ రుణాలకు అర్ డీ వో హామీ ఇచ్చారు. అయితే భూములు ఇచ్చిన మత్స్యకార కార్మికుల జీతాల్ని 36 వేలకు పెంచాలన్న డిమాండ్ కు మాత్రం యాజమాన్యం అంగకరించ లేదు. ఐదు రోజులు సమయం కావాలని కోరడంతో కార్మికులు అంగీకరించారు.
ఉదయం నుంచి గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.45 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న కార్మికులు ఇవాళ పోర్టు బంద్‌కు పిలుపునిచ్చారు. పోర్టు ముట్టడికి యత్నించారు. ఈ ఆందోళనకు కార్మికులు కుటుంబాలు వివిధ రాజకీయ పార్టీలు కదలి వచ్చాయి. ఈ బంద్ పిలుపుతో ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అయినా కార్మికులు వెనక్కి తగ్గలేదు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేట్లు, ముళ్ల కంచెలను దాటుకొని దూసుకెళ్లారు. ఈ ఉద్రిక్తతో పోలీసులకు గాయాలు అయ్యాయి. కార్మికులు కూడా గాయపడ్డారు కొందరు స్పృహ తప్పి పడిపోయారు.
తమ పొట్ట కొట్టిన వాళ్లు కోట్లు గడిస్తున్నారని తాము మాత్రం అర్ధాకలితో పడుకుంటున్నామంటున్నారు. అధికార పార్టీల అండ చూసుకొని అదానీ రెచ్చిపోతున్నారని నాలుగు గేట్లు పగులుగొట్టుకొచ్చిన తమకు మరో గేటు దాటడం పెద్ద కష్టం కాదన్నారు. తమ డిమాండ్లకు ఓకే చెప్పకుంటే మాత్రం సముద్ర మార్గంలో వచ్చి ముట్టడిస్తామని హెచ్చిరించారు. ఒక్కసారి సముద్రమార్గం నుంచి వస్తే కార్గోషిప్‌లను ఆపేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. తమకు సముద్ర కొత్త కాదని వేల మంది ప్రజలతో కచ్చితంగా ముట్టడిస్తామని అన్నారు. అదానీ సంపాదిస్తున్న లాభాల్లో 2 శాతమే అడుగుతున్నామని అన్నారు. పక్కనే ఉన్న విశాఖ పోర్టులో ఉద్యోగులకు కనీస వేతనం 40 వేలకుపై ఉంటే తమకు ఇక్కడ అందులో సగం కూడా లేదన్నారు.