అన్వేషించండి

KA Paul News: ప్రజాశాంతి పార్టీకి కొత్త గుర్తు, హ్యాపీలో కుండలు తయారు చేసిన కేఏ పాల్

Prajashanthi Party News: ప్రజాశాంతి పార్టీకి కుండ గుర్తు కేటాయించడం పట్ల కేఏ పాల్ సంతోషం వ్యక్తం చేశారు. కుమ్మరి వారితో కలిసి సరదాగా కుండలు తయారు చేశారు.

Praja Shanti Party Pot Symbol: తమ పార్టీ కి ఎన్నికల సంఘం కుండ గుర్తు కేటాయించినట్టు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ పేర్కొన్నారు. ఆయన రైల్వే న్యూ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో శుక్రవారం (ఏప్రిల్ 12) జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీకి కుండ గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం అధికారులు, హై కోర్టు న్యాయమూర్తులకు ధన్య వాదాలు తెలిపారు. కుండలు తయారు చేసే కుమ్మరి మాదిరిగానే తాను కూడా ప్రజలు జీవితాలు తీర్చి దిద్దుతానని అన్నారు. విశాఖపట్నంలోని రైల్వే న్యూ కాలనీలో కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు.

ప్రజలు ఫ్యాన్లకు (వైసీపీని ఉద్దేశించి) ఉరి వేసుకుని చనిపోయినట్టు కేఏ పాల్ ఎద్దేవా చేశారు. గ్లాసులు (జనసేనను ఉద్దేశించి) పగిలి పోయాయి. సైకిళ్లకు (టీడీపీ) ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. కోర్టులో కేసు వేసి కుండ గుర్తు సాధించానని అన్నారు. ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు ఉపాధి స్టీల్ ప్లాంట్ అనుబంధంగా వెయ్యి కంపెనీల ద్వారా ఉపాధి కల్పిస్తామని అన్నారు. ప్రజలు మోదీ, కేసీఆర్, జగన్ కు అవకాశం ఇచ్చారు. ప్రజా శాంతి పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలి అని కోరారు. 

‘‘ప్రధాన పార్టీల్లో టిక్కెట్లు రాని వారు మా పార్టీలో చేరడానికి వస్తున్నారు. రుషికొండలో కొండ మాయం చేశారు. కుటుంబ, కుల పాలనకు చరమ గీతం పాడాలి. స్టీల్ ప్లాంట్ భూములను అమ్మేస్తున్నారు. కంపెనీలు అహ్మదాబాద్ తరలిపోతున్నాయి. బొత్స సత్యనారాయణ కుటుంబం ఇన్నాళ్లు శ్రీకాకుళంలో దోచుకుని ఇప్పుడు విశాఖ వచ్చింది’’ అని కేఏ పాల్ ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు యేసు పాదం, శుభాకర్, బాబు రావు, జిలు కర రవి కుమార్, బాబుజీ రావు పాల్గొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adani Stocks: అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్‌
అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్‌
Tamannaah Bhatia : అనార్కలీ డ్రెస్​లో అందమైన బొమ్మలా ఉన్న తమన్నా.. Golden Goddessలా ఉందంటోన్న ఫ్యాన్స్
అనార్కలీ డ్రెస్​లో అందమైన బొమ్మలా ఉన్న తమన్నా.. Golden Goddessలా ఉందంటోన్న ఫ్యాన్స్
Bank Locker Rules: బ్యాంక్‌ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
బ్యాంక్‌ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Embed widget