By: ABP Desam | Updated at : 10 Apr 2023 01:01 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టు ఏపీ ప్రజలను మోసం చేసేందుకే కేసీఆర్, కేటీఆర్ మరో ఎత్తుగడ వేస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి. స్టీల్‌ప్లాంట్ సెంటిమెంట్‌తో 2024లో లబ్ధి పొందే ప్రయత్నాల్లో ఉన్నారని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్ కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేయబోతుందని వస్తున్న ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కెసిఆర్, కేటీఆర్ స్వార్థ, రాజకీయ ప్రయోజనాల కోసం యువత ప్రాణాలు ఫణంగా పెట్టొద్దని హితవు పలికారు విష్ణువర్దన్ రెడ్డి. సెంటిమెంట్ రాజకీయాలకు పేరు మోసిన బీఆర్‌ఎస్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్‌ను ఆయుధంగా చేసుకోబోతోందన్నారు. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట అన్నట్టు ఉందని కేసీఆర్ వ్యవహారమని ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లికి సింగరేణితో కలిసి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టిస్తానని కోతలు కోసి నాలుగేళ్లు దాటిపోయిందని గుర్తు చేశారు. కనీసం పునాది కూడా పడలేదన్నారు.
మొన్న : సింగరేణిని మోదీ ప్రైవేటుపరం చేస్తున్నారని ఆందోళనలు !
ఇవాళ : సింగరేణితో విశాఖ స్టీల్ ప్లాంట్‌నే కొనిస్తామని ప్రగల్భాలు !
నర్సీ ... ఇలా అయితే దొరికిపోతామని మీకేవరూ చెప్పలేదా ? లేక ప్రజలను పిచ్చోళ్లనుకుంటున్నారా ?@TelanganaCMO @KTRBRS #Telangana #AndhraPradesh https://t.co/OEMz4qTxWl pic.twitter.com/TqZ0n0OCAj— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) April 10, 2023
ఉదయం నుంచి వరుస ట్వీట్లు చేస్తున్న విష్ణువర్దన్ రెడ్డి... చివరకు ఓ వీడియో కూడా విడుదల చేశారు. ఇదంతా ఓట్ల కోసం చేస్తున్న గిమ్మిక్కుగానే అభివర్ణించారు. మొన్న సింగరేణిని మోదీ ప్రైవేటుపరం చేస్తున్నారని ఆందోళనలు చేశారని... ఇప్పుడు మాత్రం సింగరేణితో విశాఖ స్టీల్ ప్లాంట్‌నే కొనిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. నాటి ఆరోపణలు ఇప్పుడు చేస్తున్న ప్రతిపాదనకు ఎక్కడా పొంతన లేదన్నారు. ఇలా అయితే దొరికిపోతామని మీకెవరూ చెప్పలేదా ప్రజలు పిచ్చోళ్లు అనుకుంటున్నారా అని సెటైర్లు వేశారు.
విశాఖ ఉక్కుపేరుతో మరో మోసానికి తండ్రీ కుమారులు బయల్దేరారని.. వీళ్లకు ప్రజలు ఓ మాదిరిగా కూడా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను లాభాల బాట పట్టించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుందన్నారు విష్ణు. పెట్టుబడులు సేకరిస్తేంటే దాన్ని తరలిస్తారని... అమ్మెస్తరంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమ్మకు అన్నం పెట్టనోడు, చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తడట!
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) April 10, 2023
తెలంగాణ తల్లికి సింగరేణితో కలిసి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టిస్తానని కోతలు కోసి నాలుగేళ్లు దాటిపోయింది. పునాది కూడా పడలేదు.
కానీ విశాఖ ఉక్కు పేరుతో మరో మోసం. మీ తండ్రీ కొడుకులకు ప్రజలు ఓ మాదిరిగా కూడా కనిపించరా? pic.twitter.com/JLyn2uFXdH
తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టుగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా మోసం చేయడానికి సిద్ధపడ్డారని విష్ణు వర్దన్ మండిపడ్డారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను ఏం చేస్తున్నారో అందరికి తెలుసని కామెంట్ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 2024లో లబ్ధి పొంది ఓట్లు వేయించుకునేందుకు మరో సెంటిమెంట్‌తో వస్తున్నారని దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
కెసిఆర్, కేటీఆర్ గారు ,
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) April 10, 2023
మీ స్వార్థ, రాజకీయాల కోసం యవత ప్రాణాలు ఫణంగా పెట్టి ఇంకెన్నాళ్లు సెంటిమెంట్ రాజకీయాలు చేస్తారు?
-ఏపీ బీజేపీ! @BJP4Andhra #AndhraPradesh #Telangana https://t.co/mwjcqUX0gs pic.twitter.com/HNVceTTDx8
Visakhapatnam Port: రెండు సరికొత్త రికార్డులను సాధించిన విశాఖ పోర్టు, మే లో 49 కంటైనర్ నౌకలను హ్యాండిల్ చేసి రికార్డు
Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?
APPSC: త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ ఛైర్మన్
AP News: ఇంధన పొదుపు రాష్ట్రంగా ఏపీ, నాలుగేళ్లలో రూ.4 వేల కోట్లు ఆదా
Vizianagaram News : విజయనగరం డిప్యూటీ మేయర్ రాజీనామా - కారణమేమిటంటే ?
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా