అన్వేషించండి

Bellam Vinayakudu Temple: వైజాగ్‌కు ప్రత్యేకం - ఈ బెల్లం వినాయకుడు, ఆలయం పూర్తి విశేషాలు ఇవే

Bellam Vinayakudu Temple: ప్రస్తుతం ఉన్న బెల్లం వినాయకుడి గుడి నిజానికి ఒక శివాలయం. కానీ రానురానూ బెల్లం వినాయకుడి ప్రాధాన్యత పెరిగి ఆ పేరే ఈ గుడికి మిగిలిపోయింది . 

Vizag Bellam Vinayakudu Temple: తెలుగు రాష్ట్రాల్లోనే అరుదైన బెల్లం వినాయక ఆలయం విశాఖలో ఉంది. కోరిన కోరికలు తీరితే బెల్లాన్ని భక్తులు నైవేధ్యంగా చెల్లిస్తుండడంతో ఈ వినాయక ఆలయానికి బెల్లం వినాయకుడు అనే పేరు వచ్చింది. నిజానికి ఆ వినాయకుడి పేరు ఆనందగణపతి. వైజాగ్ లో కేజీహెచ్ పక్కనుండి వెళితే కొత్త జాలరి పేట వస్తుంది. ఆ పేటలో సముద్రం ఎదురుగా నిర్మించిందే బెల్లం వినాయకుడి గుడి. 
ఈ ఆలయాన్ని 10-11 శతాబ్దాల మధ్య చోళులు నిర్మించారని చరిత్రకారులు చెబుతుంటారు. ఆలయం చిన్నదైనా.. దీని నిర్మాణంలో చోళుల శిల్పకళ ఛాయలు ఇప్పటికీ కనిపిస్తాయి. నిజానికి ఒకప్పుడు విశాఖ సముద్రతీరంలో ఉండేదని చెప్పే వైశాఖి ఆలయానికి అనుబంధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే నెమ్మదిగా వైశాఖి ఆలయం సముద్రంలో కలిసిపోయింది.. ప్రస్తుతం ఉన్న బెల్లం వినాయకుడి గుడి నిజానికి ఒక శివాలయం. కానీ రానురానూ బెల్లం వినాయకుడి ప్రాధాన్యత పెరిగి ఆ పేరే ఈ గుడికి మిగిలిపోయింది . 

కోరిక తీరిందా .. బెల్లం మొక్కు చెల్లించాల్సిందే : 
ఇక్కడి వినాయకుడి  వద్దకు వచ్చి కోరికలు కోరుకునే భక్తులు అవి తీరిన  వెంటనే బెల్లం దిమ్మలు తెచ్చి స్వామివారికి మొక్కుబడి చెల్లించాల్సిందే. ఇక్కడ స్వామికి నైవేద్యమూ, భక్తులకు ప్రసాదమూ .. రెండూ బెల్లమే. అందుకే ఈ గుడికి వెళ్ళేదారిలో ఎక్కడ చూసినా బెల్లం దుకాణాలే  కనిపిస్తాయి. ఈ ఆనవాయితీ ఎన్నో తరాల నుండి జరుగుతుంది అంటారు ఇక్కడి స్థానికులు. విశాఖలోని అత్యంత ప్రసిద్ధి పొందిన వినాయక దేవాలయాలు రెండు. ఒకటి సిరిపురం లోని సంపత్ వినాయక్ టెంపుల్ అయితే.. రెండోది క్రొత్త జాలరిపేట లోని బెల్లం వినాయకుని గుడి. ఈ రెండింటి లోనూ బెల్లం వినాయకుడి గుడి చాలా పురాతనమైంది.  ఆ మధ్యకాలంలో దీని ప్రశస్తి మరుగునపడినా గత కొన్నేళ్లుగా బెల్లం వినాయకుడికి మళ్ళీ ప్రాముఖ్యత పెరిగింది అని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. 

ఈ గుడిలో ఒకప్పుడు తాంత్రిక పూజలు.. 
బెల్లం వినాయకుడి మరో ప్రత్యేకత ఆ విగ్రహ తొండం. సాధారణంగా విఘ్నేశ్వరుడి తొండం ఏ గుడిలో చూసినా ఎడమ వైపుకు వంగి ఉంటుంది. కానీ విచిత్రంగా బెల్లం గణపతి తొండం మాత్రం కుడివైపుకు ఉంటుంది. చోళుల సమయంలో ఈ గుడిలో తాంత్రిక పూజలు జరిగేవనీ, అందుకే ఈ విగ్రహ నిర్మాణం విచిత్రంగా ఉంటుంది అని ఇక్కడి పండితులు చెబుతారు. ప్రతిరోజూ ఉదయం 6 నుండి మధ్యాహ్నం 11 వరకూ, సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకూ ఈ ఆలయం తెరుచుకుని ఉంటుంది. ప్రతి బుధవారం భక్తులతో ఈ గుడి కిటకిట లాడుతూ ఉంటుంది. ఇక గణపతి నవరాత్రులకైతే ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ అంటున్నారు.      

Also Read: Vizag Sampath Vinayaka Temple: వైజాగ్‌లోని ఈ చిన్ని వినాయక విగ్రహం పాకిస్తాన్ సబ్ మెరైన్ ఘాజీని ముంచేసిందా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Punjab Kings vs Mumbai Indians Highlights | ముంబయి ఆల్ రౌండ్ షో... పంజాబ్‌కు తప్పని ఓటమి | ABPAsaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP DesamAC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP DesamLoksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
Embed widget