By: ABP Desam | Updated at : 28 Mar 2023 10:00 AM (IST)
Edited By: jyothi
పారిశ్రామికాభివృద్ధిలో నూతన విప్లపం - పీపీపీ విధానంలో ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి
AP New Industrial Policy: ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నూతన విప్లవానికి తెరతీస్తూ.. ఆంధ్రప్రదేశ్ సరికొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. 2023-27 సంవత్సరాలకు రూపొందించిన ఈ పాలసీని పారిశ్రామికవేత్తల సమక్షంలో ఆవిష్కరించింది. పాత పాలసీ గడువు ముగియక ముందే కొత్త పాలసీని ప్రకటించడం ఇదే తొలిసారి. సోమవారం విశాఖలో పారిశ్రామికవేత్తలతో కూడిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖలు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ నూతన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించారు.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి దోహదం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా నిర్మాణాత్మక ఇండస్ట్రియల్ పాలసీని ప్రభుత్వం రూపొందించింది అన్నారు అమర్‌నాథ్. నూతన విధానం పారిశ్రామికాభివృద్ధిలో విప్లవాన్ని సృష్టిస్తుందని పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈనెల 31వ తేదీతో పాత విధానం ముగియనుండడంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి పారిశ్రామిక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ సలహాదారు శ్రీధర్, ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వకరికాల వలవన్, జేడీ రామలింగరాజు, డైరెక్టర్ డా.జి సృజన, ఏపీఐడీసీ ఛైర్ పర్సన్ బండి పుణ్యశీల, సీఐఐ ఏపీ చాప్టర్ వైస్ ఛైర్మన్ డా.మురళీ కృష్ణ, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
నూతన విధానంలో ముఖ్యాంశాలు..
ప్లగ్ అండే ప్లే విధానానికి అనుగుణంగా పాలసీ రూపొందించారు. వనరుల ఆధారంగా అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన జరుగనుంది. వ్యాపారన్ని సులభతరం చేయడం, పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ కొత్త పాలసీ తయారు చేసినట్టు మంత్రి అమర్‌నాథ్ వివరించారు. పరిశోధనలకు చేయూత, అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించడం ముఖ్యమైందిగా తెలిపారు. తయారీ, అనుబంధ రంగాలు సహా అన్ని రకాల పరిశ్రమల పెట్టుబడిదారులకు పలు రాయితీలు ఇవ్వడం, ఎర్లీబర్డ్ పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు కల్పించడం మరింత ముఖ్యమన్నారు. ఎలాంటి ఆంక్షలు లేని పెట్టుబడుల వాతావరణం కల్పిస్తున్నట్టు వివరించారు. లో కాస్ట్, లో రిస్క్ బిజినెస్. పీపీపీ విధానంలో ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి. ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తారు. అంతర్జాతీయ కనెక్టివిటీ, తయారీ రంగంలో ఎకో సిస్టమ్. దుబాయ్ తరహాలో బెస్ట్ ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి. పర్యావరణ పరిరక్షణ, అన్ని జిల్లాల్లోనూ పారిశ్రామిక వికేంద్రీకరణ చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. తొలిసారిగా ఆపరేషనల్ గైడ్ లైన్స్ లో భూ కేటాయింపులు, రద్దు మొదలైనవి ఈ పీపీపీ విధానంలో ఉన్నాయన్నారు.
అయితే ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా, నంబర్ వన్ ఇండస్ట్రియల్ రాష్ట్రంగా ఏపీ అడుగులు వేస్తోందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు పాలసీ కాల పరిమితి పూర్తయినప్పటికీ కూడా కొత్త పాలసీని తేవడానికి కొంత సమయం తీసుకుంటాయని.. కానీ తమ ప్రభుత్వం మాత్రం పాత పాలసీ ముగియకముందే కొత్త పాలసీని అమలు చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే నూతన విధానం వల్ల రాష్ట్ర ఆర్థిక ప్రగతి మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అయితే ఈ రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, వైద్య పరికరాల తయారీ, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన వనరుల రంగాల్లో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టబడులు రానున్నాయి. అలాగే పరిశ్రమల స్థాపనకు అవసరమైన 96 అనుమతులను కేవలం 21 రోజుల్లోనే మంజూరు చేసేందుకు వైఎస్ఆర్ ఏపీ1 కొత్త యాప్‌ను కూడా విడుదల చేసినట్లు చెప్పారు. విశాఖ కేంద్రంగా వైఎస్ఆర్ ఏపీ1 కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నామని, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోని జిల్లా పారిశ్రామిక కేంద్రాల్లో సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి అమర్ నాథ్ వివరించారు.
APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్ పోస్టులు - వివరాలు ఇలా!
Weather Latest Update: సండే మండే, రెండు రోజులు అసలు బయటకు వెళ్లొద్దు- సూరన్నతో కాస్త జాగ్రత్త
NTR Centenary Celebrations: రంగమేదైనా ఆయనే హీరో-శకపురుషుని కథనాల సమాహారం
పాతపట్నం ఎమ్మెల్యేకి వరుస చేదు అనుభవాలు - మొన్న పార్టీ క్యాడర్, నేడు ప్రజలు ఫైర్!
Breaking News Live Telugu Updates: మూడు గంటలకు కేసీఆర్, కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్ ప్రెస్మీట్
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!