Vizag : ఫార్మా ప్రమాద బాధితులకు సీఎం చంద్రబాబు పరామర్శ-మృతుల కుటుంబాలకు కోటీ- క్షతగాత్రులకు 50 లక్షల పరిహారం
Andhra Pradesh: అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో గాయపడిన వారు, వాళ్ల ఫ్యామిలీలకు సీఎం చంద్రబాబు ధైర్యం చెప్పారు. కోలుకునే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
Achutapuram SEZ Accident: విశాఖలోని మెడికోవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం ఫార్మా ప్రమాద బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వాళ్లకు ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందేలా ఆదేశాలు ఇచ్చామని అధైర్య పడొద్దని కోలుకుంటారని వాళ్లకు భరోసా ఇచ్చారు. ప్రతి వ్యక్తి వద్దకు వెళ్లి వారి పరిస్థితిపై వైద్యులను అడిగి ఆరా తీశారు. అనంతరం బాధిత ఫ్యామిలీలతో కూడా మాట్లాడారు.
అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో క్షతగాత్రులను విశాఖ ఆసుపత్రిలో పరామర్శించాను. వారికి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాను. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చాను. చికిత్స పొందుతున్న వారు పూర్తి ఆరోగ్యవంతులై తిరిగి రావాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను. ఈ ఘోర దుర్ఘటనలో… pic.twitter.com/JfqKJJ2u45
— N Chandrababu Naidu (@ncbn) August 22, 2024
అచ్యుతాపురంలో ఫార్మా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి పాతిక లక్షల పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారని మరో 36 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. వారిలో 10 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. గాయపడిన ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందజేస్తామని వెల్లడించారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించబోతున్నట్టు ప్రకటించారు. ఇలాంటి దుర్ఘటనలో పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని అన్నారు చంద్రబాబు.