![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Fire Accident In Vizianagaram: విజయనగరం క్లాత్ మార్కెట్లో అగ్ని ప్రమాదం, పలు దుకాణాలు దగ్ధం
Fire Accident In Vizianagaram: విజయనగరంలోని అతిపెద్ద వస్త్ర మార్కెట్ బాలాజీ హోల్ సేల్ మార్కెట్లో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షాపు నెంబరు 216, 217 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.
![Fire Accident In Vizianagaram: విజయనగరం క్లాత్ మార్కెట్లో అగ్ని ప్రమాదం, పలు దుకాణాలు దగ్ధం Andhra Pradesh Fire Accident In Vizianagaram Balaji Cloth Market Fire Accident In Vizianagaram: విజయనగరం క్లాత్ మార్కెట్లో అగ్ని ప్రమాదం, పలు దుకాణాలు దగ్ధం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/22/92173782ab0dc5048675363ea801d4b91690025279518798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Fire Accident In Vizianagaram: విజయనగరంలోని అతిపెద్ద వస్త్ర మార్కెట్ బాలాజీ హోల్ సేల్ మార్కెట్లో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షాపు నెంబరు 216, 217 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదంలో రెండు షాపులు పూర్తిగా దగ్గమయ్యాయి. దుకాణాల సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ షార్ట్ సర్క్యూట్ అవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగసి పక్కనే ఉన్న కుసుమంచి వస్త్ర దుకాణానికి మంటలు అంటుకున్నాయి. మంటలు వేగంగా వ్యాపించి పక్కనే ఉన్న విజయ్ వస్త్ర దుకాణానికి విస్తరించాయి. ఈ ప్రమాదంలో రెండు షాపులు పూర్తిగా దగ్గం కాగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. అగ్ని ప్రమాద విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. మరోవైపు మంటలు మిగతా షాపులకు వ్యాపించకుండా వ్యాపారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అగ్నిప్రమాదంతో వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)