By: ABP Desam | Updated at : 13 May 2023 07:10 PM (IST)
ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా కరెంట్ షాక్
మొబైల్ వాడకం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇదివరకే పలు చోట్ల మొబైల్ ఛార్జింగ్ పెట్టి వాడకంతోగానీ, అజాగ్రత్తగా ఛార్జింగ్ తీస్తున్న క్రమంలోనూ కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన ఘటనలు జరిగాయి. ఇటీవల కేరళలో గేమ్స్ ఆడుతుంటే సెల్ ఫోన్ పేలడంతో ఓ చిన్నారి చనిపోయింది. తాజాగా ఏపీలో అలాంటి విషాదం జరిగింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఫోన్ కాల్ మాట్లాడుతుండగా కరెంట్ షాక్ కు గురై ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
అసలేం జరిగిందంటే..
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కోమటి వీధికి చెందిన యువకుడు లక్ష్మణ్ (25) క్యాటరింగ్ బాయ్ గా చేస్తుంటాడు. అతడు ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి తన సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టాడు. అయితే కొంత సమయానికి కాల్ రావడంతో ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుండగా షార్ట్ సర్క్యూట్ అయింది. ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా ప్రమాదం జరిగి, యువకుడు లక్ష్మణ్ స్పృహ కోల్పోయాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు అతడ్ని హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. లక్ష్ణణ్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయాడని నిర్ధారించారు. కుమారుడు చనిపోయాడన్న నిజాన్ని తెలుసుకుని అతడి తల్లి షాకైంది. ఆపై కుమారుడి మరణంపై లక్ష్మణ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వీడియో గేమ్స్ ఆడుతుంటే విషాదం..
ఫోన్ కు అలవాటైన ఓ బాలిక ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతే.. ఛార్జింగ్ పెట్టి మరీ గేమ్ అడసాగింది. ఇదే ఆమె పాలిట శాపంగా మారింది. ఫోన్ ఒక్కసారిగా పేలడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తిరువిల్వామలలో ఆదిత్య శ్రీ అనే చిన్నారి మొబైల్ ఫోన్ లో తరచుగా వీడియోలు చూస్తుండేది. గేమ్స్ కూడా ఆడుతుండేది. ఈ క్రమంలోనే ఫోన్ లో ఛార్జింగ్ అయిపోగా.. ఛార్జింగ్ పెట్టి మరీ గేమ్ ఆడసాగింది. ఈ క్రమంలోనే ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భాలిక అక్కడికక్కడే చనిపోయింది. గట్టిగా శబ్దం రావడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా.. అప్పటికే బాలిక మరణించింది. తమ నిర్లక్ష్యం వల్లే పాప చనిపోయిందంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
గత ఏడాది నవంబర్ లో తెలంగాణలో సెల్ ఫోన్ విషాదం!
జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండలం ఈడిగొనిపల్లి గ్రామంలో ఛార్జింగ్‌లో ఉన్న సెల్ ఫోన్ తీస్తుండగా షాక్ తగిలి నిహారిక అనే పదేళ్ల బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. గత ఏడాది నవంబర్ నెలాఖరులో ఈ విషాదం జరిగింది. నిహారిక స్థానిక పాఠశాలలో 4వ తరగతి చదువుతుంది. కూతురు ఆకస్మిక మరణంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఇటీవల కాలంలో సెల్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు పేలుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడవద్దని, పిల్లలను ఎలక్ట్రిక్ పరికరాలకు దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఛార్జింగ్ పెట్టిన ఫోన్ లో మాట్లాడుతుండగా పేలిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఫోన్ ఓవర్ హీట్ కారణంగా ప్రమాదాలు జరిగాయి. నిత్యం ఉపయోగించే సెల్ కూడా కొన్నిసార్లు తీవ్ర ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. సెల్ ఫోన్ వినియోగంలోనూ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని ఇలాంటి ఘటనలు మనకు తెలియజేస్తున్నాయి.
Top 10 Headlines Today: తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్‌మ్యాన్
Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు!
Odisha Train Accident: కోరమండల్ ప్రమాదం వివరాలు, ఫొటోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఒడిశా ప్రభుత్వం
AP PG CET: ఏపీ పీజీ సెట్-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్
Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"
Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!
Wrestlers Protest: బ్రిజ్ భూషణ్‌పై స్టేట్‌మెంట్ వెనక్కి తీసుకున్న మైనర్ రెజ్లర్, ఇంతలోనే ఏం జరిగింది?
Rahul Gandhi: వెనుక అద్దం చూస్తూ ఇండియా కారును ప్రధాని నడుపుతున్నారు, మోదీపై రాహుల్ గాంధీ సెటైర్లు