By: ABP Desam | Updated at : 26 Nov 2022 09:21 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఎంపీ విజయసాయి రెడ్డి
MP Vijayasai Reddy : పారిశ్రామిక ప్రగతిలో ఏపీ దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శనివారం పలు అంశాలు వెల్లడించారు. దేశంలో అత్యధిక ఎగుమతి, దిగుమతులు నిర్వహించే 10 పోర్టులు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించబోతోందన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర ప్రాంత అభివృద్ధి, పోర్టుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా ఈ ఘనత సాధ్యపడిందని అన్నారు.
ఏపీ సీఎం ఎంఎస్ యాప్ తో రోడ్డు సమస్యలకు చెక్
పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో నిర్మాణాత్మక వ్యవస్థ ఏర్పాటుపై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. పారదర్శకతకు, సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నామని ఇందుకోసం 'ఏపీ సీఎం ఎంఎస్' (ఏపీ కన్సిస్టెంట్ మానిటరింగ్ ఆఫ్ మున్సిపల్ సర్వీసెస్) పేరిట ప్రత్యేక యాప్ ను రూపొందిస్తోందని అన్నారు. ఈ యాప్ ద్వారా నగరాలు, పట్టణాల్లో రోడ్డు సంబంధిత సమస్యలపై ప్రజలు ఫొటో తీసి అప్లోడ్ చేయగానే నిర్దిష్ట వ్యవధిలోగా మరమ్మతులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. నెల రోజుల్లో ఏపీ సీఎం ఎంఎస్ యాప్ అందుబాటులోకి రానుందని తెలిపారు.
జిల్లాకు అంబేడ్కర్ పేరు
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సేవలను దేశ ప్రజలందరూ గుర్తు చేసుకున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఆ మహనీయునికి ఘన నివాళి అర్పించారని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరుపెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ మహనీయునిపై ఉన్న గౌరవాన్ని చాటిచెప్పిందని గుర్తుచేశారు. ఆయన ఆశయాలు సాధనకు ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా చిన్నపిల్లల్లో రోజురోజుకీ పెరుగుతున్న మీజిల్స్ వ్యాధి కేసులు ఆందోళన కలిగించే అంశమని విజయసాయి రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు వైద్య నిపుణులతో టీమ్ లు, కమాండ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. మీజిల్స్ చికిత్సకు సంబంధించి సాధ్యమైన ప్రతి సహకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించాలని కోరారు.
రాజ్యాంగ స్ఫూర్తితో
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు భారత దేశం విరాజిల్లడానికి దూర దృష్టితో తయారు చేసిన రాజ్యాంగమే కారణమని టీటీడీ చైర్మన్, వైఎస్సార్ సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజ్యాంగ నిర్మాతల గొప్పతనాన్ని ఆయన కొనియాడారు. శనివారం ఉదయం విశాఖపట్నం జిల్లా ఇసుకతోటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాలకు సమాన ఫలాలు అందేలా మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న రాజ్యాంగ ఆమోద దినోత్సవం దేశ ప్రజలందరికీ పండుగ రోజుగా అభివర్ణించారు. మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ తలెత్తుకుని బతికేలా రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ కు దేశమంతా రుణపడి ఉంటుందన్నారు. ఆ రాజ్యాంగ స్ఫూర్తిని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తూ అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.
Tarak Ratna Health Update : విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి, బెంగళూరు ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు
Avinash Reddy :నాలుగు గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - అవసరమైతే మళ్లీ పిలుస్తామన్నారన్న అవినాష్ రెడ్డి !
సంపన్నులు చదువుకునే స్కూళ్లలో కూడా ఇటువంటి ట్యాబ్ లు లేవు, విద్యార్థులకు క్లాస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్
Fish Tunnel Exhibition : విశాఖలో ఆకట్టుకుంటున్న ఫిష్ టన్నెల్, ప్రదర్శనకు అరుదైన చేపలు
Nagayalanka Ysrcp Clashes : వైసీపీలో రచ్చకెక్కిన వర్గవిభేదాలు, నాగాయలంకలో ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల మధ్య ఫైట్
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!
Waltair Veerayya Success Event : వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి, తొక్కిసలాటలో పలువురికి గాయాలు