News
News
X

Ramnath Kovind Visakha Tour: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విశాఖ పర్యటన ఖరారు, షెడ్యూల్ ఇదే!

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విశాఖ పర్యటన షెడ్యూల్ విడుదల అయింది. ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు విశాఖలో ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి పాల్గొన్నారు.

FOLLOW US: 

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్(President Ramnath Kovind) విశాఖ పర్యటన ఖరారైంది. రాష్ట్రపతి పర్యటన(President Tour) షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ(పీఎస్ఆర్) సందర్భంగా మూడు రోజుల పాటు విశాఖలో రాష్ట్రపతి పర్యటించనున్నారు. ఫిబ్రవరి 20వ తేదీన రామ్ నాథ్ కోవింద్ విశాఖకు రానున్నారు. 21వ తేదీ ఉదయం ఐఎన్ఎస్ డేగా(INS Dega) నుంచి బయలుదేరి నేవల్ డాక్ యార్డ్(Neval Dockyard) లోని ఎన్ 14A జెట్టీకి పయనమవనున్నారు. అనంతరం నౌకాదళ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. సుమిత్ర నౌక‌ నుంచి ఫ్లీట్ రివ్యూ చేయనున్నారు. ఎఫ్ఆర్ వేడుకల పోస్టల్ కవర్(Postal Cover), స్టాంపులను రాష్ట్రపతి  ఆవిష్కరించనున్నారు. 22వ తేదీ ఉదయం తిరిగి దిల్లీకి ప్రయాణమవనున్నారు. రాష్టప్రతి పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు.

రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ 

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మూడు రోజుల విశాఖ పర్యటన ఖరారు అయ్యింది. ప్రెసిడెంట్‌ ప్లీట్‌ రివ్యూలో భాగంగా తూర్పు నౌకాదళం ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఈనెల 20న భువనేశ్వర్‌ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరి మధ్యాహ్నం 1.35 గంటలకు విశాఖలోని ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకోనున్నారు. అక్కడ నేవల్‌ ఎయిర్‌స్టేషన్‌(Naval Air Station) నుంచి చోళసూట్‌కు చేరుకుంటారు. 20వ తేదీ రాత్రి అక్కడ బస చేస్తారు. 21న నేవల్ డాక్‌యార్డ్‌లోని ఎన్‌14ఏ జెట్టీ వద్దకు చేరుకుని గార్డు నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం సుమిత్ర నౌకలోకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం పీఎఫ్‌ఆర్‌ గ్రూపు ఫొటో దిగడం, స్టాంపు విడుదల తదితర కార్యక్రమాల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ పాల్గొంటారు. మరుసటి రోజు ఉదయం ప్రత్యేక విమానంలో తిరిగి దిల్లీకి చేరుకుంటారని తెలిపాయి

ఈ నెలాఖరులో వైజాగ్‌లో జరగనున్న ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్‌ఆర్), మిలన్ మల్టీనేషనల్ నౌకాదళ విన్యాసాల భద్రతా ఏర్పాట్లను డీజీపీ గౌతం సవాంగ్ ఆదివారం సమీక్షించారు. ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(Shipping Corportaiton of India), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, సబ్‌మెరైన్‌లు, 50కి పైగా విమానాలు సమీక్షలో పాల్గొంటాయి. వేడుకలో మొబైల్ కాలమ్‌లో స్టీంపాస్ట్, ఫ్లైపాస్ట్, సెయిల్స్ కవాతు ఉంటాయి. రెండు కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలు, భద్రతా ఏర్పాట్లపై నగర పోలీసులు, ఈఎన్‌సీ సిబ్బంది డీజీపీ(DGP)కి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఫిబ్రవరి 21న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వైజాగ్‌ తీరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నౌకాదళాన్ని సమీక్షించనున్నారు. ఫిబ్రవరి 27న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(CM Jagan Mohan Reddy) పాల్గొనే అంతర్జాతీయ కవాతుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొనున్నారు.  ఈ  కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు శాఖల మధ్య సమన్వయం అవసరమని డీజీపీ అన్నారు. భద్రతా ఏర్పాట్ల కోసం 3 వేల మంది పోలీసులను మోహరించనున్నారు. రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ కాంప్లెక్స్, విశాఖపట్నం(Visakhapatnam) అంతర్జాతీయ విమానాశ్రయం(International Airport)లో సీసీ కెమెరాలు, స్నిఫర్ డాగ్‌లను ఏర్పాటు చేస్తారు.

Published at : 14 Feb 2022 07:25 PM (IST) Tags: Visakhapatnam AP News President Ram Nath Kovind Ramnath kovind Vizag tour Fleet Review

సంబంధిత కథనాలు

Anantapur Crime News :  బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

లేఖ రాయడం కూడా లోకేష్‌కు చేతకాదు: కాకాణి

లేఖ రాయడం కూడా లోకేష్‌కు చేతకాదు: కాకాణి

AP BJP : ఇన్ని వర్షాలు పడినా సీమకు నీళ్లేవి ? - ప్రాజెక్టులపై చేసిన ఖర్చెంతో చెప్పాలన్న ఏపీ బీజేపీ !

AP BJP : ఇన్ని వర్షాలు పడినా సీమకు నీళ్లేవి ? - ప్రాజెక్టులపై చేసిన ఖర్చెంతో చెప్పాలన్న ఏపీ బీజేపీ !

Breaking News Live Telugu Updates: కాంగ్రెస్‌కు మరో షాక్! రేవంత్ పై మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Breaking News Live Telugu Updates: కాంగ్రెస్‌కు మరో షాక్! రేవంత్ పై మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Crime News : బెజవాడలో కాల్‌మనీ కలకలం - టీడీపీ కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్ !

Crime News :  బెజవాడలో కాల్‌మనీ కలకలం - టీడీపీ కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్ !

టాప్ స్టోరీస్

TS Congress : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

TS Congress  : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

KCR Medchal : దేశాన్ని మతం పేరుతో విడదీసే ప్రయత్నం - తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్ !

KCR Medchal : దేశాన్ని మతం పేరుతో విడదీసే ప్రయత్నం - తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్ !

YSRCP Vs Janasena : వైఎస్ఆర్‌సీపీ నేతలది బ్రిటిష్ డీఎన్‌ఏ - కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి రాజకీయమన్న జనసేన !

YSRCP Vs Janasena :  వైఎస్ఆర్‌సీపీ నేతలది బ్రిటిష్ డీఎన్‌ఏ - కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి రాజకీయమన్న జనసేన !