News
News
X

Minister Gudivada Amaranath : బాబు బాణియే జనసేన జనవాణి, పవన్ రాజకీయ ఉగ్రవాది- మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amaranath : వైసీపీ ప్రభుత్వానికి మూడు రాజధానుల విధానం అయితే పవన్ కల్యాణ్ ది మూడు పెళ్లిళ్ల విధానమని మంత్రి అమర్ నాథ్ విమర్శించారు.

FOLLOW US: 
 

 Minister Gudivada Amaranath : విశాఖ గర్జన ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకే పవన్ కల్యాణ్ విశాఖ వస్తున్నారని నాలుగు రోజుల కిందటే చెప్పానని, చెప్పిన విధంగానే పవన్ కల్యాణ్ విశాఖలో దిగగానే ఆ పార్టీ కార్యకర్తలు దాడులు దిగారని మంత్రి అమర్ నాథ్ విమర్శించారు. చంద్రబాబు బాణీ వినిపించడానికే జనవాణి పేరుతో పవన్ కల్యాణ్ విశాఖ వచ్చారన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని గడాఫీతో పోల్చడాన్ని అమర్ నాథ్ తీవ్రంగా తప్పుపట్టారు.  ప్యాకేజీ స్టార్‌ అనే పదానికి అర్థం ఏమిటో విశాఖ ప్రజలకు పవన్‌ కల్యాణ్‌ బాగా అర్థం అయ్యేలా చెప్పారన్నారు. శనివారం ఉత్తరాంధ్ర జేఏసీ సభ ఉంది అనగానే, ఆ సభను పక్కదోవ పట్టించడానికి ఉదయం సభ అంటే సాయంత్రం  డైవర్ట్‌ చేస్తానని చంద్రబాబు తరఫున పవన్ కల్యాణ్ రెడీ అయ్యారన్నారు. తన విశాఖ పర్యటనను మూడు నెలల క్రితమే నిర్ణయించుకున్నానని పవన్ చెప్పటం సిగ్గు చేటు అన్నారు. చంద్రబాబు చేత, చంద్రబాబు వల్ల, చంద్రబాబు కోసం ఏర్పడిన పార్టీ జనసేన అంటూ మండిపడ్డారు. దీనికి బాబు సేన అని పేరు పెడితే బాగుంటుందని అమర్ నాథ్ అన్నారు.
 
ఉత్తరాంధ్రపై గంజాయి ముద్ర
 
ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకుల్ని, మంత్రుల్ని టార్గెట్‌ చేయటం, ప్రైవేటు వ్యక్తుల భూముల వ్యవహారాన్ని ప్రభుత్వం మీద నెట్టటానికి టీడీపీ, జనసేన,  ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మంత్రి అమర్ నాథ్ ఆరోపించారు. ఇదంతా ఒక పథకం ప్రకారం చేస్తున్నారన్నారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం,  మంత్రి ధర్మాన, తమపై టీడీపీ వ్యక్తిగతంగా దాడి చేసి వ్యక్తిత్వ హననానికి దిగారన్నారు. చివరికి ప్రాంతం మీద కూడా చెడు ముద్ర వేస్తున్నారని విమర్శించారు.  ఉత్తరాంధ్రను గంజాయి సాగు ప్రాంతంగా మాట్లాడటానికి కూడా పవన్‌ కల్యాణ్‌ రెడీ అయ్యారని ఆక్షేపించారు.  డీసెంట్రలైజేషన్‌కు మద్దతుగా పోరాటం జరుగుతుండడం టీడీపీ నచ్చటంలేదన్నారు. వారు కోరుకున్న, కలలుగన్న ప్రాంతంలో మాత్రమే, వారు కోరుకున్న ప్రాంతంలో మాత్రమే, భూములు కొన్న ప్రాంతంలో మాత్రమే ఉండాలన్నది వారి కుతంత్రం అని ఆరోపించారు. రాజు మారినప్పుడల్లా రాజధాని మారటాన్ని పవన్‌ కల్యాణ్‌ అనుమతించనంటున్నారని, మరి రాష్ట్ర విభజన జరుగుతుంటే ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు.  

 సామాజిక న్యాయం 
 
కులాల మేలు కోసం పెట్టిన కార్పొరేషన్ల వల్ల మేలు జరగలేదని పవన్‌ కల్యాణ్‌ అంటున్నారని, కులాలకు ఇంతకంటే ఎక్కువగా ఏ ప్రభుత్వంలో అయినా సామాజిక న్యాయం జరిగిందా? అని మంత్రి అమర్ నాథ్ ప్రశ్నించారు. దాదాపు 1.8 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో మూడున్నరేళ్ళలోనే వైసీపీ ప్రభుత్వం వేసిందన్నారు. పసుపు కళ్లజోడు పెట్టుకుని, ఎన్టీఆర్‌ భవన్‌ స్క్రిప్టుతో మాట్లాడితే పవన్ కు కనిపించవన్నారు.  అన్ని కులాలకు ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇస్తూ ఆలయ బోర్డుల్లో, నామినేటెడ్‌ పదవుల్లో సగం అందులోనూ సగం మహిళలకు కేటాయించటం సామాజిక న్యాయం కాదా? అని ప్రశ్నించారు.  

యాంటీ సోషల్ ఎలిమెంట్

మంత్రులపై రాళ్లు వేసిన వారిని అరెస్టు చేస్తే తప్పా? అని మంత్రి అమర్ నాథ్ ప్రశ్నించారు.  వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గూండాలు అంటున్నారు, ఎవరైనా పవన్‌ కల్యాణ్‌పై దాడి చేశారా, లేదే అన్నారు. ఒక పక్క బీజేపీతో కాపురం చేస్తూ వారు అమ్మేస్తున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌,  బాబు తన పార్ట్‌నర్‌గా ఉండి అమ్మేసిన ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్‌ ఇవన్నీ ఈ రోజున పవన్‌ కల్యాణ్‌కు గుర్తుకు వచ్చాయా అంటూ మండిపడ్డారు. క్రిమినల్స్‌ రాజకీయాల్లో ఉండకూడదు అన్నది కరెక్టే గానీ, తుపాకితో కాల్చాలన్న కోరిక ఉన్నవారిని ప్రతి ప్రెస్‌మీట్‌లోనూ బెదిరించేవారిని  యాంటీ సోషల్‌ ఎలిమెంట్‌ అంటారా? అని మంత్రి ఆరోపించారు.  

News Reels

2 నెలల కిందట వాణి మొదలుపెట్టి.. 3 నెలల కిందట టికెట్ బుక్ చేసుకున్నారా?
  
"పవన్ కల్యాణ్ విజ్ఞత కలిగిన నాయకుడే అయి ఉంటే, శనివారం ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఘటనకు, తమ కార్యకర్తలు, నాయకులు బాధ్యులు అని హుందాగా ఒప్పుకునే వారు.  పవన్ కల్యాణ్ కు ఆ హుందాతనం లేకకపోగా, ఆ దాడులు తమకు తామే చేయించుకున్నామని మాపై ఆరోపణలు చేయడం శోచనీయం. పవన్ దత్త తండ్రి చంద్రబాబు  కూడా ఎయిర్ పోర్టులో జరిగిన ఘటనను ఖండించాల్సింది పోయి.. దాడికి పాల్పడిన వారిపై కేసులు పెట్టడాన్ని తప్పుపట్టడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. తాను విశాఖ పర్యటన కార్యక్రమాన్ని మూడు నెలల కిందటే ఖరారు చేసుకున్నానని పవన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. రెండు నెలల కిందటే జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్  మూడు నెలల కిందటే టికెట్ ఎలా బుక్ చేసుకుంటారు?. విశాఖ గర్జన కార్యక్రమాన్ని పక్కదోవ పట్టించేందుకు, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు తూట్లు పొడిచేందుకే పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన పెట్టుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలపై తమ పార్టీ వారిని ఉసిగొలిపిన పవన్ కళ్యాణ్.. ఒక రాజకీయ ఉగ్రవాది. తనవెంట వచ్చే వారంతా తనకు ఓట్లు వేస్తారని భ్రమలో పవన్ కళ్యాణ్ ఉన్నారని, సెలబ్రిటీలను చూసేందుకు వచ్చిన వారంతా ఓట్లేస్తే ఈపాటికి ఎంతోమంది సినిమా నటులు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే వారు." -మంత్రి అమర్ నాథ్ 

అమ్మాయిలు బయటకు రావొద్దు 
 
 "పెళ్లి చేసుకున్న చోటల్లా రాజధాని పెట్టమంటారా? అని పవన్ మాట్లాడటం సిగ్గు చేటు. మాది మూడు రాజధానుల విధానం.. పవన్ కల్యాణ్ ది  మూడు పెళ్లిళ్ల విధానం. పవన్ కల్యాణ్ కు సంస్కృతి, సంప్రదాయాలు తెలియవు. ఆయన విశాఖలో ఉన్నంతవరకు అమ్మాయిలు రోడ్లమీదకు రావొద్దు. ఒక విధంగా ఆలోచిస్తే, పవన్ కల్యాణ్ ప్రతి ఒక్కరినీ మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని సలహా ఇస్తాడేమో?. "- మంత్రి అమర్ నాథ్  

Published at : 16 Oct 2022 07:20 PM (IST) Tags: Pawan Kalyan Janasena Minister Gudivada Amarnath Janavani Visakha news

సంబంధిత కథనాలు

Dating App Cheating: డేటింగ్‌ యాప్స్‌లో కొత్త రకం మోసాలు, కిడ్నాప్‌ అవుతున్న యువకులు, ఉద్యోగులు!

Dating App Cheating: డేటింగ్‌ యాప్స్‌లో కొత్త రకం మోసాలు, కిడ్నాప్‌ అవుతున్న యువకులు, ఉద్యోగులు!

Nuzvid Police Station : నూజివీడు పోలీస్ స్టేషన్ పై మహిళలు దాడి, భారీగా పోలీసుల మోహరింపు!

Nuzvid Police Station : నూజివీడు పోలీస్ స్టేషన్ పై మహిళలు దాడి, భారీగా పోలీసుల మోహరింపు!

Men Suicide Cases: పెళ్లి కావడం లేదని యువకుల ఆత్మహత్యలు! తెలుగు రాష్ట్రాల్లోనే సూసైడ్‌లు ఎక్కువ, కానీ ఎందుకిలా?

Men Suicide Cases: పెళ్లి కావడం లేదని యువకుల ఆత్మహత్యలు! తెలుగు రాష్ట్రాల్లోనే సూసైడ్‌లు ఎక్కువ, కానీ ఎందుకిలా?

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పి, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయండి

వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పి, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయండి

టాప్ స్టోరీస్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం  - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!