News
News
X

Pawan Kalyan : ప్రధాని మోదీ ఆకాంక్ష అదే, భవిష్యత్ లో ఏపీకి మంచి రోజులు - పవన్ కల్యాణ్

Pawan Kalyan : విశాఖలో ప్రధాని మోదీతో పవన్ భేటీ ముగిసింది. అనంతరం పవన్ మాట్లాడుతూ ఏపీకి భవిష్యత్ లో మంచి రోజులు వస్తాయన్నారు.

FOLLOW US: 
 
Pawan Kalyan : విశాఖ చేరుకున్న ప్రధాని మోదీతో జనసేన అధ్యక్షుడు శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. ఐఎన్ఎస్ చోళలో ప్రధాని మోదీతో పవన్ సమావేశం అయ్యారు. ఇవాళ సాయంత్రం విశాఖ చేరుకున్న పవన్ నోవోటెల్ హోటల్ బస చేశారు. ప్రధాని మోదీ ఐఎన్ఎస్ చోళ హోటల్ కు చేరుకోగానే ముందుగా పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు. ప్రధాని మోదీ ఏకాంతంగానే పవన్ తో భేటీ అయ్యారు. షెడ్యూల్ ప్రకారం పది నిమిషాల భేటీ అయినా అరగంటకు పైగా మోదీ-పవన్ సమావేశం కొనసాగింది.  ప్రధానితో భేటీ ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. 

భవిష్యత్తులో మంచి రోజులు 

"దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ప్రధాని మోదీని కలిశాను. ఈ మీటింగ్  ఏపీ బాగుండాలనే ఉద్దేశంతో జరిగింది. ప్రధాని మోదీ ఏపీలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఏపీకి మంచిరోజులు వస్తాయి. ఏపీ బాగుండాలనేది ప్రధాని ఆకాంక్ష. నాకు అవగాహన ఉన్నంత మేరకు ప్రధానికి అన్ని వివరాలు తెలియజేశాను. త్వరలో అన్ని విషయాలు చెబుతాను. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రధాని మోదీని కలిశాను. పీఎంవో నుంచి రెండ్రోజుల క్రితం సమాచారం వచ్చింది. 2014 తర్వాత సుమారు 8 ఏళ్ల తర్వాత ప్రధానిని కలిసే అవకాశం వచ్చింది. దిల్లీ వెళ్లినా ప్రధానిని కలవలేకపోయాను. ఇది ప్రత్యేక పరిస్థితుల మధ్య జరిగిన మీటింగ్. తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి. ఏపీ అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ఈ మీటింగ్ భవిష్యత్ లో మంచి రోజులు తీసుకోస్తుందన్నారు.  " - పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు 

News Reels

జడ్ ప్లస్ సెక్యూరిటీ కోసం 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై రెక్కీ జరిగిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ తరుణంలో పవన్‌కు సెక్యూరిటీ కల్పించాలని విశాఖలో సైకత శిల్పం ఏర్పాటు చేశారు. విశాఖ యారాడ బీచ్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ పవన్ కల్యాణ్‌కు జెడ్‌ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని ఆయన అభిమానులు కోరారు.  రెండు రోజుల పర్యటన సందర్భంగా విశాఖకు వస్తున్న ప్రధాని మోదీకి జనసేన నేతలు, కార్యకర్తలు పవన్‌కు భద్రత పెంచాలని విజ్ఞప్తి చేశారు.  

రేపు ఉదయం ప్రధానితో సీఎం, గవర్నర్ భేటీ 

ప్రధాని నరేంద్రమోదీతో శనివారం ఉదయం గవర్నర్‌ బిశ్వ భూషణ్ హరిచందన్‌, సీఎం  జగన్  భేటీ కానున్నారు. శుక్రవారం రాత్రి నగరానికి చేరుకున్న ప్రధాని ఐఎన్‌ఎస్‌ చోళలో బస చేయగా గవర్నర్‌ నోవాటెల్‌ హోటల్‌లో, సీఎం పోర్టు అతిథి గృహంలో ఉన్నారు. శనివారం ఉదయం గవర్నర్‌, సీఎం జగన్ రోడ్డు మార్గంలో ఐఎన్‌ఎస్‌ చోళకు వెళ్లి ప్రధానితో సమావేశమవుతారు. తరువాత అక్కడ నుంచి హెలికాప్టర్‌లో ఏయూ గ్రౌండ్స్  ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు వస్తారు. 

Also Read : PM Modi : విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ, బీజేపీ నేతల కన్నా ముందే పీఎంతో పవన్ భేటీ

Published at : 11 Nov 2022 10:10 PM (IST) Tags: PM Modi Visakhapatnam AP News Pawan Kalyan Janasena

సంబంధిత కథనాలు

Konaseema News :  ఉపాధి కోసం వెళ్లి ఉసురు తీసుకుంది, పని ఒత్తిడి తట్టుకోలేక మస్కట్ మహిళ ఆత్మహత్య!

Konaseema News : ఉపాధి కోసం వెళ్లి ఉసురు తీసుకుంది, పని ఒత్తిడి తట్టుకోలేక మస్కట్ మహిళ ఆత్మహత్య!

Dating App Cheating: డేటింగ్‌ యాప్స్‌లో కొత్త రకం మోసాలు, కిడ్నాప్‌ అవుతున్న యువకులు, ఉద్యోగులు!

Dating App Cheating: డేటింగ్‌ యాప్స్‌లో కొత్త రకం మోసాలు, కిడ్నాప్‌ అవుతున్న యువకులు, ఉద్యోగులు!

Nuzvid Police Station : నూజివీడు పోలీస్ స్టేషన్ పై మహిళలు దాడి, భారీగా పోలీసుల మోహరింపు!

Nuzvid Police Station : నూజివీడు పోలీస్ స్టేషన్ పై మహిళలు దాడి, భారీగా పోలీసుల మోహరింపు!

Men Suicide Cases: పెళ్లి కావడం లేదని యువకుల ఆత్మహత్యలు! తెలుగు రాష్ట్రాల్లోనే సూసైడ్‌లు ఎక్కువ, కానీ ఎందుకిలా?

Men Suicide Cases: పెళ్లి కావడం లేదని యువకుల ఆత్మహత్యలు! తెలుగు రాష్ట్రాల్లోనే సూసైడ్‌లు ఎక్కువ, కానీ ఎందుకిలా?

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

టాప్ స్టోరీస్

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు