Gannavaram News: లోపల రచ్చ అంతే ఉంది, వల్లభనేనికి యార్లగడ్డ మాస్ వార్నింగ్
Politcal Heat: గన్నవరం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. వంశీ వ్యాఖ్యలకు యార్లగడ్డ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం శ్రేణులను జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
Yarlagadda Waring: ఎన్నికలకు ముందే ఏపీలో రాజకీయం వేడెక్కింది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో నేతలు ఎన్నికల మూడులోకి అప్పుడే వెళ్లిపోయారు. ఇక అంగబలం, అర్థబలం సరిసమానంగా ఉన్న చోట పోటీ నువ్వా-నేనా అన్నట్లు ఉంది. రాష్ట్రం మొత్తం ఎన్నికలు జరిగేది ఒక ఎత్తైతే కొన్ని నియోజకవర్గాలు రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ ఆసక్తి కలిగిస్తాయి. అలాంటి నియోజకవర్గమే కృష్ణా జిల్లాలోని గన్నవరం(Gannavaram). ఇక్కడ విచిత్రమేంటనే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabaneni Vamsi) వైసీపీలో చేరగా...వంశీపై ఓటమిపాలైన వైసీపీ(YCP) అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు(Yarlagadda Venkatrao) తెలుగుదేశం(TDP)లో చేరి గన్నవరం సీటు తొలి జాబితాలో చేజిక్కించుకుని కయ్యానికి కాలుదువ్వుతున్నాడు. గతంలో వంశీ బెదిరింపులకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
సై అంటే సై
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తెలుగుదేశం నేత యార్లగడ్డ వెంకట్రావు(YVR) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం(TDP) కార్యకర్తల జోలికి వస్తే అంతకు రెట్టింపు స్థాయిలో బదులిస్తామని హెచ్చరించారు. వంశీ అండ చూసుకుని రెచ్చిపోతున్న ప్రతి ఒక్క పోలీసు అధికారి పేరు రెడ్ బుక్ లో ఎక్కించేలా తానే స్వయంగా తీసుకుంటానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఉండే మరో 50 రోజులేనని.....వంశీ ఎలాగూ విదేశాలకు పారిపోవడం ఖాయమని మరి మీరు ఎక్కడికి పోతారంటూ నిలదీశారు. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలని పోలీసు(Police)లకు సైతం గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఊరి చెరువు మట్టి డబ్బులు కొంతమంది జేబుళ్లోకి పోతుంటే మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు సోదరులారా అంటూ పోలీసులకు హితవు పలికారు. దాడులు చేసి వారిపైనే రివర్స్ కేసులు పెట్టే విష సంస్కృతి గన్నవరం నియోజకవర్గంలో ఉందని యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. ‘’అమెరికా నుంచి వచ్చాడు.. సౌమ్యుడు.. వివాద రహితుడు అనుకుంటున్నారేమో...లోపల లోకల్ మాస్ అలాగే ఉంటూ సినిమా డైలాగ్ కొట్టి మరీ జిల్లా ఎస్పీని యార్లగడ్డ హెచ్చరించారు. నీ పేరు నారా లోకేష్ రెడ్ బుక్కులోకి చేర్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా’’...తేల్చి చెప్పారు.
నేను రెడీ
రాజకీయం రాజకీయంగా చేయాలని లేదు రౌడీయిజమే చేస్తానంటే నేను దేనికైనా రెడీ అంటూ యార్లగడ్డ వెంకట్రావు సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏది చేయాలన్నా అంగబలం, ఆర్థిక బలంమే ఉండాలంటే అవిరెండు తన దగ్గర పుష్కలంగా ఉన్నాయన్నారు. ప్రతి సమస్యకు కొట్టుకోవడమే పరిష్కారమైతే తాను వెనక్కి తగ్గేదేలే అన్నారు. గన్నవరం(Gannavaram) నియోజకవర్గంలో టీడీపీ నేతలపై దాడిని ఖండిస్తున్నానన్నారు. పార్టీ కార్యాలయాలపై దాడి, పక్కవారి ఆస్తుల లాక్కొనే దౌర్భాగ్య పరిస్థితి గన్నవరంలోనే ఉందని, ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు కడపలో కూడా లేవని అన్నారు. తెలుగుదేశం(TDP) పార్టీ బీఫామ్ పెట్టుకుని గన్నవరంలో గెలవడం పెద్ద లెక్కకాదని...ఆ పార్టీ టిక్కెట్ ఇస్తే ఎవరైనా ఇక్కడ గెలుస్తారని యార్లగడ్డ అన్నారు. కష్టపడి నాయకులను గెలుపించుకునేది పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడానికా అని యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు. తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన నారా కుటుంబ సభ్యులపై నోరు పారేసుకోవటం వంశీకి పరిపాటిగా మారిందన్నారు. దీనికి అంతం లేదా అని ప్రశ్నించారు. బూతులు మాట్లాడటమే రాజకీయం అయితే రెండు రోజుల్లో నేర్చుకొని తాను కూడా మాట్లాడగలనన్నారు.తొలి జాబితాలోనే తన పేరు ప్రకటించిన చంద్రబాబు(CBN)కు, తెలుగుదేశానికి మద్దతు తెలిపిన పవన్ కల్యాణ్(Pavan Kalyan) కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇకపై నియోజకవర్గమే తన ఇల్లు అని....ఇంటికి తిరిగి ప్రతి ఒక్క ఓటరుకు వైసీపీ అరాచకాలు, ముఖ్యంగా వంశీ చేసిన అన్యాయాలను విడమరిచి చెబుతానన్నారు.