Vijayawada: అధిక ధరలకు కూల్ డ్రింక్స్, ఫుడ్ ఐటమ్స్ విక్రయాలు - విజిలెన్స్ ఆకస్మిక దాడులతో సీన్ తారుమారు
Vigilance Enforcement Raids: అధిక ధరలకు విక్రయిస్తే అమ్మకాలు జరిపిన షాపులపై కేసులు నమోదు చేస్తామని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి కనకరాజు హెచ్చరించారు.
అధిక ధరలకు తిను బండారాలు, కూల్ డ్రింక్స్, బిస్కెట్, చిప్స్ ప్యాకెట్స్, మజ్జిగ, పెరుగు ప్యాకెట్స్‌లను అమ్మకాలు జరిపిన షాపులపై కేసులు నమోదు చేస్తామని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి కనకరాజు హెచ్చరించారు. కేసుల నమోదుతో పాటు చేయడంతోపాటు షాపులను సీజ్ చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇంద్రకీలాద్రిపై నెలకొన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయం, కొండపల్లి ఖిల్లా, ఇబ్రహీంపట్నం ఏరియాలోని పలు దుకాణాల్లో అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. అధిక ధరలకు వస్తువులను విక్రయించిన దుకాణ నిర్వాహకులపై కేసులు నమోదు చేశామని కనకరాజు తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే చట్టప్రకారం చర్యలు కఠినంగా ఉంటాయని ఆయన దుకాణదారులకు హెచ్చరికలు జారీ చేశారు.
దుర్గమ్మ సన్నిధిలోనూ దోపిడీనే....
కరోనా తరువాత పరిస్దితులు సాదారణ స్దితికి చేరుకున్నాయి. ఇప్పుడిప్పుడే వ్యాపారాలు కూడా పంజుకుంటున్నాయి. ఈ నేపద్యంలో అధిక ధరలను ఇష్టాను సారంగా వ్యాపారాలు సాగించే వారిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ అంశంపై ఉన్నతాదికారుల ఆదేశాల మేరకు రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా అత్యంత రద్దీగా ఉండే ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో కూడ ఇష్టానుసారంగా భక్తులను దోచేసుకుంటున్నారనే ఫిర్యాలు వెల్లువెత్తాయి. ఇంద్రకీలాద్రిపై దేవస్దానం అధికారులు, వ్యాపారులు మిలాఖత్ అయ్యి భక్తుల నుండి అధి ధరలు వసూలు చేయటంపై అనేక ఫిర్యాదులు అందాయి..
దేవస్దానం అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవటంతో రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ అధికారులకు భక్తులు నేరుగా ఫిర్యాదులు చేశారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు ఆకస్మికంగా తనఖీలు చేశారు. దుర్గమ్మ సన్నిధిలో 20 రూపాయలు విలువ గల వాటర్ బాటిల్ ను రూ.25 నుంచి రూ.30 కి విక్రయిస్తున్నారని అధికారులు గుర్తించారు. అంతే కాదు శీతల పానీయాల ధరలు కూడా అధికంగా వసూలు చేస్తున్నారు. 35రూపాయల విలువ గల కూల్ డ్రింక్ బాటిల్‌ను 40 రూపాయలకు వసూలు చేస్తున్నారు. అదేమని గట్టిగా నిలదీసిన భక్తులను మిగిలిన దుకాణదారులు కూడా కలసి వచ్చి మూకుమ్మడిగా భక్తులపై విరుచుకుపడుతున్నారు. కుటుంబంతో సహా అమ్మవారి దర్శనానికి వచ్చి మాటలు పడాల్సి వస్తుందని భక్తలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇందులో దేవస్థానానికి చెందిన అధికారుల పాత్ర కూడా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. వరుసగా ఇలాంటి సంఘటనలు అధికం అవుతున్నప్పటికీ, ఎవ్వరూ పట్టించుకోవటం లేదని చెబుతున్నారు.
పర్యాటక కేంద్రాల వద్ద దోపిడీ...
అమ్మవారి సన్నిధిలోనే అధిక ధరల దోపిడీ జరుగుతుందనుకుంటే, పర్యాటక కేంద్రాల వద్ద కూడా ఇదే పరిస్దితి నెలకొందని సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పరిస్దితుల తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టూరిజం శాఖకు పర్యాటకుల రద్దీ ఎక్కువ ఉంటేనే ఆదాయం సమకూరుతుంది. ముఖ్యంగా వీకెండ్స్‌లో సందర్శకుల తాడికి అధికంగా ఉండటంతో అదే సమయంలో ధరలు పెంచి అమ్మకాలు సాగిస్తున్నారని పర్యాటకులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. తినుబండారాలు కూడా ప్యాకింగ్ పై ఉన్న ఎమ్మార్పీ కన్నా అధికంగా వసూలు చేస్తున్నారని కొండపల్లి ఖిల్లా వద్ద దుకాణాల్లో వ్యాపారుల భాగోతం అధికారుల దాడుల్లో బయటపడింది. ఇకనుంచి రెగ్యూలర్‌గా తనిఖీలు జరుపుతామని షాపు నిర్వాహకులను హెచ్చరించారు.