Vijayawada Rains: అమరావతి, విజయవాడ మధ్య నిలిచిన రాకపోకలు- బడమేరు వరదతో అధికారులు అలర్ట్
Budameru floods In Vijayawada: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గుణదల పెద్ద వంతెన పైనుంచి బడమేరు వాగు ప్రవహిస్తుంది. విజయవాడ అధికారులు అప్రమత్తం అయ్యారు.

Andhra Pradesh Rains Update | విజయవాడ: అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పలు ప్రాంతాల్లో వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. కృష్ణానది, బుడమేరు పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్చరించారు. గుణదల పెద్ద వంతెనపై నుండి బడమేరు ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వరద నీటిలో వెళ్లే ప్రయత్నం చేయకూడదని సూచించారు. వాగుఉదృతంగా ప్రవహిస్తుండటంతో నెమలిపురి, వజినేపల్లి మద్య రాకపోకలు బంద్ అయ్యాయి. గుంటూరు కాజా టోల్గేట్ వద్ద రోడ్డుపైకి చేరిన భారీగా వరదనీరు చేరుతోంది. సైడ్ డ్రైన్ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు.
విజయవాడలో వరద ముప్పు – అప్రమత్తంగా ఉండాలన్న కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం సాయంత్రం అధికారులు, సిబ్బందితో వరద అప్రమత్తతపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం, వచ్చే రెండు మూడు రోజుల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రవాహం 4–5 లక్షల క్యూసెక్కుల వరకు పెరగవచ్చని ఆయన పేర్కొన్నారు.
దీంతో, నది పరిసర గ్రామాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని, నదికి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కృష్ణానది, బుడమేరు పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న వారికి ఫ్లడ్ అలర్ట్ జారీ చేసి, లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు.
EXTREMELY HEAVY RAINFALL lashed Central #AndhraPradesh with many parts in and around #Vijayawada got severe rains yesterday night that lashed for around 6 hours NON-STOP. Highest recorded in Ponnur, Guntur district with 204 mm, followed by Maddipadu, Prakasam 203 mm. Vijayawada… pic.twitter.com/SVVGqq3tZo
— Andhra Pradesh Weatherman (@praneethweather) August 13, 2025
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఫ్లడ్ అలర్ట్ టీములు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి, లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ప్రజలకు సమాచారం అందించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కమిషనర్ ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని సమస్యలను తెలియజేయడానికి కంట్రోల్ రూమ్‌ను 24/7 అందుబాటులో ఉంచాలని తెలిపారు.
అమరావతి, విజయవాడ మధ్య నిలిచిన రాకపోకలు
పల్నాడు: పెదకూరపాడు నియోజకవర్గాన్ని వరద ముంచెత్తుతోంది. అమరావతి, అచ్చంపేట, క్రోసూరు,పెదకూరపాడులో భారీవర్షం కురుస్తోంది. దాంతో అచ్చంపేటలో కరెంటు ఆఫీసు, పాఠశాలలోకి వరద నీరు చేరుతోంది. అచ్చంపేట-మాదిపాడు రహదారిపై వరద నీరు నిలిచిపోయింది. అమరావతి- విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెదకూరపాడు కాలచక్ర రోడ్డుపై భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. సత్తెనపల్లి- అమరావతి మధ్య సైతం వరద నీటితో రాకపోకలకు అంతరాయం తలెత్తింది.
గుంటూరు జిల్లాలోని పొన్నూరులో అత్యధికంగా 204 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా మద్దిపాడులో 203 మి.మీ వర్షపాతం నమోదయ్యాయి. విజయవాడ నగరంలో 90 మి.మీ, గుంటూరు సిటీలో 160 మి.మీ వర్షపాతం నమోదయ్యాయి. ఈరోజు రాత్రి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ వెదర్ మ్యాన్ సూచించారు.






















