అన్వేషించండి

AP News: సూర్యనారాయణ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత, ఏ క్షణంలోనైనా ఉద్యోగ సంఘం నేత అరెస్ట్!

Bail Rejected to surya Narayana: రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి సూర్యనారాయణ గండి కొడుతున్నారని ఆరోపిస్తూ పటమట పోలీసులు ఇటీవల సూర్యనారాయణపై కేసు నమోదు చేయడం తెలిసిందే.

ACB Court rejects bail to AP Employees Leader surya Narayana: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణకు విజయవాడ ఏసీబీ కోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి సూర్యనారాయణ గండి కొడుతున్నారని ఆరోపిస్తూ పటమట పోలీసులు ఇటీవల సూర్యనారాయణపై కేసు నమోదు చేయడం తెలిసిందే. తనకు ఈ కేసు నుంచి ఊరట కలిగించాలని ఉద్యోగుల సంఘం నేత హైకోర్టును ఆశ్రయించారు. 

విజయవాడ ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకునేందుకు రాష్ట్ర హైకోర్టు సూర్యనారాయణకు అనుమతి ఇచ్చింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపి నిర్ణయం చెప్పాలని ఏసీబీ కోర్టును రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సూర్యనారాయణ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను సోమవారం విచారించిన విజయవాడ ఏసీబీ కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. దాంతో ఏ క్షణంలోనైనా విజయవాడ పోలీసులు ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

ఉద్యోగ సంఘం నాయకులకు చిక్కులు 
తమ హక్కుల కోసం పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నాయకులకు చిక్కులు తప్పడం లేదు. ప్రభుత్వంపై గవర్నర్‌కూ ఫిర్యాదు చేసిన  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారయణ అరెస్టుకు రంగం సిద్ధమైంది. వాణిజ్య పన్నులశాఖలో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేసిన ప్రభుత్వం.. గత నెలలో అరెస్టుకు ఆదేశించింది. రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సూర్యనారాయణ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.  వాణిజ్యశాఖలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రభుత్వ ఆదాయానికి ఉద్యోగులు గండికొట్టారని ప్రభుత్వం కేసు పెట్టింది.  ఈ కేసులో ఇప్పటికే నలుగుర్ని అరెస్ట్ చేశారు. ఏ -5గా సూర్యనారాయణను చేర్చారు.  

ఈ కేసును ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నారు.  పైనుంచి వస్తున్న ఆదేశాల ప్రకారమే విజయవాడ పోలీసులు నడుచుకుంటున్నారు. కేసు నమోదు, అరెస్ట్ వరకు ఏ దశలోనూ వివరాలు బయటకు రాకుండా పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకున్నారు.  పోలీసులు అరెస్ట్ చేసేందుకు వస్తున్నారన్న సమాచారం తెలుసుకుని సూర్యనారాయణ శుక్రవారం ఉదయం నుంచే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఫోన్లు సైతం వదిలేసి గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన నలుగురు ఉద్యోగులను గురువారం సాయంత్రం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చేందుకు తీసుకొచ్చిన సందర్భంలోనూ ఆయన కోర్టు వద్దకు వచ్చారు. అప్పుడే ఈ కేసులో తనపేరూ చేర్చారని తెలుసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలిసింది.                             

మరో వైపు ఉద్యోగులకు ఆఫీసు బేరర్ లేఖలు, నకిలీ ధృవపత్రాలు జారీ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విచారణాధికారిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్‌ను నియమిస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. బదిలీల నుంచి మినహాయింపు కోసం నకిలీ ఆఫీసు బేరర్ లేఖలు, ధృవ పత్రాలు ఏపీజీఈఏ జారీ చేస్తోందన్న ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఎస్టీఓలు, ఎస్ఆర్ఓ, ఏటీఓ, సీటీఓలు, డీసీటీవోలు, వైద్యులకు, వివిధ విభాగాల ఉద్యోగులకు ఏపీజీఈఏ నకిలీ లేఖలు జారీ చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. సాధారణ బదిలీల నుంచి మినహాయింపు పొందేలా ఈ నకిలీ లేఖల్ని వినియోగిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
CapitaLand Investment: హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
SVSN Varma: 'నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి' - మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
'నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి' - మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం -  భయంతో పరుగులు తీసిన భక్తులు
ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం - భయంతో పరుగులు తీసిన భక్తులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

2028 లోపు ఏపీ మొత్తం పోలవరం ద్వారా నీళ్లు పరిస్తాంఎన్డీఆర్‌ఎఫ్‌ ను తెచ్చింది టీడీపీ  ప్రభుత్వమేరైతు బంధుపై ఎవరిదీ రాజకీయం?Priest Touches Hydraa Commissioner Feet | కన్నీళ్లతో హైడ్రా కమిషనర్ కాళ్లు పట్టుకున్న పూజారి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
CapitaLand Investment: హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
SVSN Varma: 'నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి' - మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
'నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి' - మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం -  భయంతో పరుగులు తీసిన భక్తులు
ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం - భయంతో పరుగులు తీసిన భక్తులు
Kokata Murder Case: 'నా కుమారుడికి మరణ శిక్ష విధించండి' - ఆర్జీకర్ కేసు దోషి తల్లి
'నా కుమారుడికి మరణ శిక్ష విధించండి' - ఆర్జీకర్ కేసు దోషి తల్లి
Anchor Suma: మరోసారి వెండితెరపై అలరించబోతోన్న యాంకర్‌ సుమ - ప్రియదర్శి హీరోగా ఆమె కీలక పాత్రలో 'ప్రేమంటే' చిత్రం
మరోసారి వెండితెరపై అలరించబోతోన్న యాంకర్‌ సుమ - ప్రియదర్శి హీరోగా ఆమె కీలక పాత్రలో 'ప్రేమంటే' చిత్రం
Kho-Kho World Cup: అమ్మాయిలు అదరగొట్టారు - ఖోఖో విశ్వవిజేతగా భారత్, ఫైనల్‌లో నేపాల్ చిత్తు
అమ్మాయిలు అదరగొట్టారు - ఖోఖో విశ్వవిజేతగా భారత్, ఫైనల్‌లో నేపాల్ చిత్తు
Donald Trump : భారత్‌లో ట్రంప్ పర్యటన? - అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం తర్వాత ఆ దేశంలోనూ..
భారత్‌లో ట్రంప్ పర్యటన? - అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం తర్వాత ఆ దేశంలోనూ..
Embed widget