ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు తెలియాలి: యూపీ సీఎం ప్రత్యేక సలహాదారు
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు ఉత్తరప్రదేశ్ సీఎం స్పెషల్ అడ్వైజర్ సాకేత్ మిశ్రా పలు అంశాలపై చర్చించారు.
టెక్నాలజీని అన్ని రంగాల్లో సమర్థంగా వినియోగిస్తున్న ఏపీ ప్రభుత్వ పని తీరును అభినందించారుర ఉత్తర్‌ప్రదేశ్ సీఎం స్పెషల్ అడ్వైజర్ సాకేత్ మిశ్రా. సీఎం జగన్‌తో సమావేశమైన ఆయన... ప్రభుత్వం చేపట్టే పథకాలను పరిశీలించారు. వాటిపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రతి వ్యక్తికి సంక్షేమాన్ని అమలు చేస్తున్న వైనం అభినందీనయమని ఆయన కొనియాడారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు ఉత్తరప్రదేశ్ సీఎం స్పెషల్ అడ్వైజర్ సాకేత్ మిశ్రా పలు అంశాలపై చర్చించారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరులో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్, డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా కేంద్రాల పనితీరును పరిశీలించారు సాకేత్ మిశ్రా. వాటి వివరాలను గురించి తెలుసుకున్న ఆయన.. సీఎం జగన్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పర్యటన మంచి అనుభవం
ఆంధ్రప్రదేశ్‌లో తన పర్యటన మంచి అనుభవాన్ని ఇచ్చిందని, జగన్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమాన్ని చూసి చాలా నేర్చుకోవచ్చని సాకేత్ మిశ్రా అన్నారు. క్షేత్ స్థాయిలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, మెరుగుపరుస్తున్న తీరును స్వయంగా పరిశీలించానని తెలిపారు. చివరి వ్యక్తికి కూడా సంక్షేమాన్ని అందించడానికి సీఎం చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించక తప్పదని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాల వెనుక లక్ష్యాలు, ఉద్దేశాలపై జగన్ తో చర్చించానని చెప్పారు.
చివరి పేద వ్యక్తికి కూడా ప్రభుత్వ పథకాలు అందాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు సాకేత్ మిశ్రా . ప్రజలకు వైద్య సేవలు అందించడానికి, ఆరోగ్య చరిత్రను నిక్షిప్తం చేయడం తదితర కార్యక్రమాలను సమన్వయం చేయడం, ఈ కార్యక్రమాలు సజావుగా నడవటానికి ఐటీ, సహా ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం బాగుందిన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది ఒక విప్లవాత్మకమైన, గొప్పదైన కాన్సెప్ట్‌గా భావిస్తుమని చెప్పారు.
ఏపీలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రాలకు తెలిసేలా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు సాకేత్ మిశ్రా. దీనివల్ల వీటిలో మెరుగైన అంశాలను ఇతర రాష్ట్రాలు తీసుకుని, వాటి నుంచి లబ్ధిపొందేందుకు అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి రాష్ట్రం కూడా భిన్నమైనదేనని, ప్రతి రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం నేర్చుకోవాల్సింది ఉంటుందని వివరించారు. ఏపీ ప్రభుత్వం పని తీరు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, గ్రామంలో ప్రభుత్వ సేవలపై ఎవరికి ఏ అవసరం వచ్చినా గ్రామ సచివాలయం కేంద్రంగా అన్నింటికి పరిష్కారం లభించడం విప్లవాత్మక ప్రగతిగా భావిస్తున్నాని వ్యాఖ్యానించారు.
సాంకేతికత వినియోగంలో ఏపీ పని తీరు భేష్...
టెక్నాలజీని అన్ని రంగాల్లో సమర్ధంగా వినియోగిస్తున్నారని అధికారుల పని తీరును సాకేత్ మిశ్రా ప్రశంశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో బహుళ కార్యక్రమాలకు కేంద్రంగా అక్కడున్న వనరులను వాడుకుంటున్న తీరు చాలా గొప్పదని ప్రశంశించారు. రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్న డ్రోన్‌ల వ్యవస్థ ఆకట్టుకుందని అన్నారు. కేవలం పది నిముషాల్లోనే ఎకరంలో పురుగు మందుల పిచికారి చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రైతుకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు ఒకే చోట లభ్యం కావటం గొప్ప మార్పుగా ప్రస్తావించారు...