YSRCP News: ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ సంచలన నిర్ణయం- వైసీపీ కేంద్ర కార్యాలయం మూసివేత!
YSRCP Latest News: వైసీపీ కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా వైసీపీ కార్యాలయాన్ని మార్చాలని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
CM Jagan Camp Office: గుంటూరు జిల్లా తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసును పార్టీ కేంద్ర కార్యాలయంగా మార్చనున్నట్లు తెలుస్తోంది. జగన్ నివాసం పక్కనే క్యాంప్ ఆఫీసు ఉంది. ఇప్పటికే తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం ఉండగా.. అది తీసేసి దాని స్థానంలో తాడేపల్లి క్యాంప్ ఆఫీసును పార్టీ కార్యాలయంగా మార్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. జూన్ 10 తర్వాత తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని వైసీపీ సెంట్రల్ కార్యాలయంగా మార్చబోతున్నారు.
అక్కడి నుంచే వైసీపీ కార్యకలాపాలు మొదలు కానున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా వైసీపీ కార్యాలయాన్ని మార్చాలని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందుకోసమే కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కంప్యూటర్లు, ఫర్నిచర్ లాంటి ఇతర సామగ్రి తరలింపును వైసీపీ శ్రేణులు తరలిస్తున్నారు.